AIS app for Taxpayers : ట్యాక్స్ పేయర్ల కోసం కొత్త ‘ఏఐఎస్’ యాప్.. ఇదేలా ఉపయోగించాలి? పూర్తివివరాలు మీకోసం..!

AIS app for Taxpayers : ఈ ఏఐఎస్ యాప్ వినియోగించే యూజర్లు ముందుగా డౌన్‌లోడ్ చేసి తమ పాన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. మీ ఫోన్ నంబర్, ఈమెయిల్‌కు పంపే ఓటీపీని ధృవీకరించాల్సి ఉంటుంది.

AIS app for Taxpayers : ట్యాక్స్ పేయర్ల కోసం కొత్త ‘ఏఐఎస్’ యాప్.. ఇదేలా ఉపయోగించాలి? పూర్తివివరాలు మీకోసం..!

Income Tax department launches AIS app for taxpayers ( Image Source : Google )

AIS app for Taxpayers : పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపు పన్ను శాఖ ఏఐఎస్ (AIS) యాప్ ప్రవేశపెట్టింది. ఈ ఏఐఎస్ యాప్ ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక సమాచార నివేదికకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. పన్నుచెల్లింపు దారులు చెల్లించే పన్నుకు సంబంధించిన అన్ని వివరాలు ఇందులో ఉంటాయి. ఇంతకీ, ఈ ఏఐఎస్ యాప్ ఎలా వినియోగించాలి? ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Motorola Edge 50 Ultra : మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా ఫోన్ చూశారా? ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలుసా?

‘ఏఐఎస్ ఫర్ ట్యాక్స్ పేయర్’ అనే సరికొత్త మొబైల్ యాప్ ఇది. ఐటీ శాఖ దీన్ని రిలీజ్ చేసింది. ఈ ఏఐఎస్ యాప్ పూర్తిగా ఉచితంగా యాక్సస్ చేయొచ్చు. పన్ను చెల్లింపుదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా టీసీఎస్, టీడీఎస్, డివిడెండ్‌లు, వడ్డీ, పన్ను చెల్లింపులు, షేర్ లావాదేవీలు, ఆదాయపు పన్ను రీఫండ్‌లు, జీఎస్టీ డేటా, విదేశీ చెల్లింపులు వంటివి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ఈ ఏఐఎస్ యాప్ వినియోగించే యూజర్లు ముందుగా డౌన్‌లోడ్ చేసి తమ పాన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. మీ ఫోన్ నంబర్, ఈమెయిల్‌కు పంపే ఓటీపీని ధృవీకరించాల్సి ఉంటుంది. అనంతరం 4 సంఖ్యల పిన్ నంబర్ సెట్ చేసుకోవాలి. తద్వారా ఏఐఎస్ యాప్ యాక్సెస్ చేయొచ్చు. 26AS/ AIS సెర్చ్ చేయడానికి ఇ-ఫైలింగ్ సైట్‌కి లాగిన్ చేయాల్సిన అవసరం లేదు.

గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్‌లో ‘AIS’ పేరుతో ఆదాయపు పన్ను శాఖ ఆండ్రాయిడ్ యాప్‌ను విడుదల చేసింది. చాలా సులభంగా ఎంతో ఉపయోగకరమైనది. పెన్షన్ క్రెడిట్, SB Int, FD Int, షేర్లు/మ్యూచువల్ ఫండ్స్ నుంచి డివిడెండ్, టీడీఎస్ మొదలైన వాటిని చూపిస్తుంది. మీరు ఇప్పటికే మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడిని ఐటీ డిపార్ట్‌మెంట్‌లో రిజిస్టర్ చేసి ఉంటే.. ధృవీకరణ ప్రయోజనాలకు మీరు 2 వేర్వేరు ఓటీపీలను అందుకుంటారు. ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేందుకు వినియోగించవచ్చు.

ఏఐఎస్ యాప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ : 

1. ప్లే స్టోర్/ యాప్ స్టోర్‌కి వెళ్లండి
2. AIS అని సెర్చ్ చేయండి. ఐటీ ఎంబామ్‌లతో కనిపిస్తుంది
3. ఆ తర్వాత యాప్ డౌన్‌లోడ్ చేయండి.
4. మీ పాన్ నంబర్‌ను ఎంటర్ చేయండి
5. మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ద్వారా రెండు OTPS, ఒకటి SMS ద్వారా వస్తుంది.
6. రెండింటిని మీరు మీ వివరాలతో వెరిఫై చేసుకోవాలి.
7. మీరు ఏటీఎం పిన్ వంటి MPIN సెట్ చేసుకోవచ్చు.
8. MPIN సెట్ చేసి ఎంటర్ చేసిన తర్వాత AIS వివరాలను పొందవచ్చు.

Read Also : Electric Air Taxi : ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీలు ఎగరనున్నాయి…2026వ సంవత్సరంలో ప్రయాణికులకు సేవలు