SwaRail Super App : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సరికొత్త ‘స్వరైల్’ సూపర్ యాప్ ఇదిగో.. ఇకపై బుకింగ్ సేవలన్ని ఒకేచోట..!
SwaRail Super App : రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే సేవలను ఒకే ప్లాట్‌ఫారమ్‌లో 'స్వరైల్' సూపర్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉన్న ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది.

Indian Railways Launch
SwaRail Super App : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైల్వే టికెట్ల బుకింగ్ విషయంలో ఆందోళన అవసరం లేదు. రైల్వే టికెట్ రిజర్వేషన్ కోసం ఇతర యాప్, వెబ్‌సైట్లపై ఆధారపడాల్సిన పనిలేదు. ఎందుకంటే.. రైల్వే సర్వీసులన్నీ ఒకే దగ్గర వినియోగించేలా ఇండియన్ రైల్వే సరికొత్త సూపర్ యాప్ తీసుకొచ్చింది.
అదే.. స్వరైల్ (SwaRail) సూపర్ యాప్.. ఈ యాప్ ద్వారా రైల్వే ప్రయాణికుల సమస్యలన్నింటికి చెక్ పడినట్టే. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ‘SwaRail’ SuperApp ప్రారంభించింది. వివిధ రైల్వే సేవలను ఒకే సమయంలో యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫారమ్‌గా ఏకీకృతం చేయాలనే లక్ష్యంతో సూపర్ యాప్ తీసుకొచ్చింది. ఈ స్వరైల్ యాప్‌ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) అభివృద్ధి చేసింది.
Read Also : Personal Loan : మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారా? ఈ 3 తప్పులు అసలు చేయొద్దు.. మీ జేబుకు చిల్లు పడ్డట్టే..!
ప్రస్తుతం బీటా దశలో ఉన్న ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంది. అన్ని రకాల సేవలను ఏకీకృతం చేయడం ద్వారా వినియోగదారు అనుభవాన్ని మరింత మెరుగుపరచనుంది. దాంతో ఇతర ప్రత్యేక అప్లికేషన్‌ల అవసరాన్ని తగ్గించడమే ప్రాథమిక లక్ష్యంగా రైల్వే శాఖ చెబుతోంది.
‘SwaRail’ ఏయే సేవలను అందిస్తుందంటే? :
స్వరైలు సూపర్ యాప్ అనేక రకాల సేవలను అందిస్తోంది. ఈ కింది సేవలన్నీ ఒకే యాప్‌లో పొందవచ్చు.
టిక్కెట్ బుకింగ్‌లు : రిజర్వ్ చేసినా అన్‌రిజర్వ్‌డ్ టికెట్ రిజర్వేషన్‌లను సులభతరం చేస్తుంది.
ప్లాట్‌ఫారమ్, పార్శిల్ బుకింగ్‌లు : ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి, పార్శిల్ సేవలను నిర్వహించేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది.
ట్రైన్ PNR ఎంక్వైరీలు : రైలు షెడ్యూల్‌లు, ప్యాసింజర్ నేమ్ రికార్డ్ (PNR) స్టేటస్, రియల్ టైమ్ అప్‌డేట్స్ అందిస్తుంది.
ఫుడ్ ఆర్డర్ : ప్రయాణీకులు వారి ప్రయాణ సమయంలో భోజనం ఆర్డర్ చేసేందుకు వీలు కల్పిస్తుంది.
రైల్ మదద్ : ఫిర్యాదులు చేసేందుకు, సాయం కోరేందుకు ఒక యాప్ అందిస్తుంది.
బీటా టెస్టింగ్‌లో యూజర్లు ఎలా పాల్గొనాలి? :
‘స్వరైల్’ సూపర్ యాప్ బీటా టెస్టింగ్ దశలో పాల్గొనాల్సిందిగా రైల్వే మంత్రిత్వ శాఖ వినియోగదారులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న యూజర్లు సంబంధిత యాప్ స్టోర్‌ల నుంచి ఈ సూపర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
(RailConnect) లేదా (UTS) మొబైల్ యాప్‌లో ఇప్పటికే ఉన్న వినియోగదారులు వారి ప్రస్తుత వివరాలను ఉపయోగించి లాగిన్ చేయవచ్చు. కొత్త వినియోగదారులు కనీస డేటా ఎంట్రీ అవసరాలతో రిజిస్టర్ చేసుకోవచ్చు. అధికారిక పబ్లిక్ లాంచ్‌కు ముందు ఏదైనా మార్పులు అవసరాన్ని గుర్తించేందుకు ఈ టెస్టింగ్ దశలో అభిప్రాయాన్ని అందించమని మంత్రిత్వ శాఖ వినియోగదారులను ప్రోత్సహిస్తుంది.
‘స్వరైల్’ స్పెషల్ ఫీచర్లు ఏంటి? :
స్వరైలు సూపర్ యాప్ అనేక ముఖ్యమైన ఫీచర్లను అందిస్తుంది :
సింగిల్ సైన్-ఆన్ : వినియోగదారులు ఐఆర్‌సీటీసీ రైల్‌కనెక్ట్, యూటీఎస్ మొబైల్ యాప్ వంటి ప్రస్తుత భారతీయ రైల్వే యాప్‌లలో వర్తించే ఆధారాలతో అన్ని సేవలను ఒకేదగ్గర యాక్సెస్ చేయవచ్చు.
ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ : ఏకీకృత పద్ధతిలో సమగ్ర సమాచారాన్ని అందించేలా వివిధ సేవలను ఒకే యాప్‌లో అందిస్తుంది. ఉదాహరణకు, పీఎన్ఆర్ ఎంక్వైరీల సంబంధిత రైలు సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.
Read Also : Gold Price Today : కేంద్ర బడ్జెట్‌కు ముందుగానే భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
యూజర్ ఫ్రెండ్లీ ఆన్‌బోర్డింగ్ : సైన్-అప్ ప్రక్రియ యాక్సెసిబిలిటీని మెరుగుపరుస్తుంది. ఇప్పటికే ఉన్న లాగిన్ వివరాలను ఉపయోగించి ఆన్‌బోర్డ్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.
సేఫ్ లాగిన్ ఆప్షన్లు : మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం (m-PIN), బయోమెట్రిక్ అథెంటికేషన్ సహా మల్టీ లాగిన్ మెథడ్స్ అందిస్తుంది.
ఈ ఫీచర్‌లు భారతీయ రైల్వే సేవలను యాక్సెస్ చేసేందుకు సులభమైన మార్గాన్ని అందించేలా రూపొందించింది. టెస్టింగ్ పూర్తి అయిన అనంతరం అందరి రైల్వే ప్రయాణికులకు ఈ యాప్ సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.