మరో కొత్త ఫీచర్.. ఈ స్మార్ట్‌ఫోన్ కొనండి.. మీ చుట్టూ సువాసనలు వెదజల్లొచ్చు.. ఎలాగంటే?
భారత మార్కెట్లో రూ.20,000 కన్నా తక్కువ ధరతో విడుదల అవుతుందని అనిశ్ కపూర్ తెలిపారు.

భారత్‌లో ఇన్ఫినిక్స్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఆ కంపెనీ నోట్ సిరీస్‌లో భాగంగా దీన్ని తీసుకువస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ప్రత్యేకత ఏంటో తెలుసా? ఫోన్ బ్యాక్‌సైడ్ నుంచి మంచి వాసన వస్తుంది.
సువాసనను రిలీజ్ చేయడానికి సెంట్ టెక్ బిల్టిన్ సిస్టమ్‌ను రూపొందించారు. ఇది ఫోన్ లోపల ఒక చిన్న ఎయిర్ ఫ్రెషనర్ లాగా ఉంటుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ను మీరు కొనుగోలు చేసిన తర్వాత 6 నెలల వరకు మాత్రమే ఈ సువాసన వస్తుంది.
ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉన్న మొదటి ఫోన్ ఇదే. ఈ నెలాఖరులో దీన్ని లాంచ్ చేయనున్నారు. ఇన్ఫినిక్స్ ఇండియా సీఈవో అనిశ్ కపూర్ ఈ కొత్త టెక్నాలజీ గురించి జాతీయ మీడియాతో మాట్లాడారు. మెరైన్ డ్రిఫ్ట్ బ్లూ కలర్ వేరియంట్‌లోనూ ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువస్తున్నామని తెలిపారు.
తాము ఇన్నోవేట్ కోసం ప్రయత్నిస్తున్నామని, అందుకే సెంట్ టెక్‌ను తీసుకొస్తున్నామని చెప్పారు. ఇందుకోసం చాలా టెక్నాలజీని వాడామని అన్నారు. ఏప్రిల్ 18న దీన్ని భారత్‌లో లాంచ్ చేస్తున్నట్లు చెప్పారు.
ఇన్ఫినిక్స్ నోట్ మూడు వేర్వేరు రంగులలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే, సువాసనలను వెదజట్టే సెంట్ టెక్ మాత్రం మెరైన్ కలర్‌లో మాత్రమే ఉంటుందిని వివరించారు. అందరూ తమ చుట్టూ సువాసన ఉండాలని కోరుకుంటారని అన్నారు.
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ధర గురించి అధికారికంగా ప్రకటన రాలేదు. అయితే, నోట్ 50S 5G+ భారత మార్కెట్లో రూ.20,000 కన్నా తక్కువ ధరతో విడుదల అవుతుందని అనిశ్ కపూర్ తెలిపారు. ధరల గురించి వివరాలను ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన రోజే వెల్లడిస్తామని అన్నారు.