Instagram : ఇన్‌స్టా సేవలకు అంతరాయం .. పనిచేయని యాప్
ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. కొందరు యూజర్లు కొత్త పోస్టులు షేర్ చేయలేకపోగా మరికొందరు స్టోరీస్ చూడలేక పోయారు.

Instagram : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ కాకపోవడంతో యూజర్లు పోస్టులు అప్డేట్ చేయలేకపోతున్నారు. కొందరు యూజర్లకు ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ కాలేదు. స్టోరీస్ చూసేందుకు కూడా వీలు కాలేదు. ఈ సమస్య భారత్ లో ఉదయం 10.30ని స్టార్ట్ అయింది.
దీంతో ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు తమ సమస్యలను ట్విట్టర్ వేదికగా లేవనెత్తారు. పోస్టులు లోడ్ అవడం లేదని, కొత్త పోస్టులు చేసేందుకు వీలు కావడం లేదని తెలిపారు. ఇదే అంశంపై కొందరు ఫన్నీ పోస్టులను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. కాగా యాప్ ఓపెన్ చేసి.. స్టోరీస్, పోస్టులు చూడటానికి ప్రయత్నిస్తే.. పోస్టులు, స్టోరీస్ రీలోడ్ కాలేవు.. అంటూ కొందరు యూజర్లకు అలెర్ట్ మెసేజ్ కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సర్వర్లు డౌన్ అవడం వల్లనే ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.
డౌన్‌టైమ్ ట్రాకింగ్ సైట్ డౌన్‌డిటెక్టర్ వెబ్ సైట్ యూజర్ల సమస్యలను వెల్లడించింది. 47 శాతం మందికి యాప్ సరిగా ఓపెన్ కావడం లేదని, 27 శాతం మంది వెబ్ వెబ్ వర్షన్‌లో సమస్యను ఎదుర్కొంటున్నారు. 26 శాతం మందికి.. సర్వర్ కనెక్షన్ సమస్యలు వస్తున్నట్టు డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది.