iPhone 12 Pro : ప్రమాదవశాత్తూ 26వ ఫ్లోర్ నుంచి జారి పడిన ఆపిల్ ఐఫోన్ 12 ప్రో.. ఆ తర్వాత ఏమైందో తెలిస్తే షాకవుతారు..!
iPhone 12 Pro : చైనాకు చెందిన మహిళ అనుకోకుండా తన విలువైన ఆపిల్ ఐఫోన్ 12 ప్రో 26వ ఫ్లోర్ నుంచి కింద పడేసింది. అయినా, అది పూర్తిగా క్షేమంగా ఉందని నివేదిక తెలిపింది. నివేదిక ప్రకారం.. మహిళ ఫుజియాన్ ప్రావిన్స్‌లోని నింగ్డేలో నివసిస్తోంది.

iPhone 12 Pro accidentally falls from 26th floor _ Here’s what happened next
iPhone 12 Pro : చైనాకు చెందిన మహిళ అనుకోకుండా తన విలువైన ఆపిల్ ఐఫోన్ 12 ప్రో 26వ ఫ్లోర్ నుంచి కింద పడేసింది. అయినా, అది పూర్తిగా క్షేమంగా ఉందని నివేదిక తెలిపింది. నివేదిక ప్రకారం.. మహిళ ఫుజియాన్ ప్రావిన్స్‌లోని నింగ్డేలో నివసిస్తోంది. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని 26వ అంతస్తులోని బాల్కనీలో మెత్తని బొంతను విప్పుతున్న సమయంలో ఐఫోన్ 12 ప్రో ఫోన్ పొరపాటున తన జేబులోంచి జారిపోయిందని ఆమె పేర్కొంది.
ఈ సంఘటన డిసెంబర్ 16న జరిగింది. నివేదిక ప్రకారం.. భవనం 2వ అంతస్తులో ప్లాట్‌ఫారమ్‌పై మహిళ ఫోన్ పడిపోయింది. వెంటనే ఆమె అక్కడ వారి సాయాన్ని కోరింది. వెంటనే స్పందించిన సిబ్బంది ఫోన్‌ను తిరిగి ఇచ్చేందుకు అక్కడికి వచ్చారు. అయితే, ఆమె ఐఫోన్ 12ప్రో స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ చెక్కుచెదరకుండా ఉంది. అది చూసి మహిళ ఆశ్చర్యపోయింది. iPhone 12 Pro రెండేళ్ల పాత స్మార్ట్‌ఫోన్. 2020లో గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది.
హ్యాండ్సెట్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR స్క్రీన్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో సిరామిక్ షీల్డ్‌ను కలిగి ఉంది. సర్జికల్-గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్‌ను కలిగి ఉంది. 30 నిమిషాల వరకు 6 మీటర్ల లోతు వరకు నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న అత్యంత కఠినమైన, మన్నికైన స్మార్ట్ఫోన్లలో ఆపిల్ ఐఫోన్లు ఒకటిగా చెప్పవచ్చు. ఐఫోన్ 12 ప్రో 26వ అంతస్తు నుంచి పడిపోయిన తర్వాత పనిచేయడం కూడా యాదృచ్చికంగా అనిపిస్తుంది.

iPhone 12 Pro accidentally falls from 26th floor
ఫోన్ పడిన సమయంలో ప్లాట్‌ఫారమ్‌పై నురగ ఉండటం వల్ల డ్యామేజ్ కాలేదు. అయినప్పటికీ, ఐఫోన్ కఠినమైన ఉపరితలంపై పడిన సంఘటనల్లో ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే వెలుగు చూశాయి. 2022 సంవత్సరం ప్రారంభంలో యూకే యూజర్ తన iPhone XR నదిలో పడిపోయిన 10 నెలల తర్వాత కూడా వర్కింగ్ కండిషన్లో ఉందని గుర్తించాడు.
మరోవైపు.. iPhone 14 Pro, iPhone 14 Pro Max వినియోగించే చాలా మంది యూజర్లు తమ డివైజ్ స్క్రీన్‌పై కొన్ని గీతలు పడనట్టు నివేదించారు. ఆ సమస్య గురించి వినియోగదారులు Reddit, Apple కమ్యూనిటీ ఫోరమ్‌లో ఫిర్యాదు చేశారు. కొంతమంది వినియోగదారులకు iOS 16.2 అప్డేట్ తర్వాత సమస్య ప్రారంభమైంది.
అయితే ఇతరులు గత వెర్షన్ iOS 16 బిల్డ్‌లలో స్క్రీన్‌పై ఫ్లాషింగ్ లైన్లను చూసినట్లు పేర్కొన్నారు. Reddit వినియోగదారుల్లో ఒకరు తన iPhone 14 Pro Maxని Apple తిరిగి తీసుకుందని, డయాగ్నస్టిక్స్ తర్వాత, టెక్నీషియన్ హార్డ్‌వేర్ సమస్య కాదని వెల్లడించారు. సాఫ్ట్వేర్ సమస్య కారణంగానే అలా జరిగిందని తెలిపారు. ఆపిల్ ఈ సమస్యను గుర్తించిన వెంటనే ప్రభావిత యూజర్లకు సపోర్టును అందించింది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : Apple iPhone 12 : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?