iPhone 13 Price Drop : ఆపిల్ ఐఫోన్ 13 ధర మళ్లీ తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!
iPhone 13 Price Drop : ఐఫోన్ 13 ధర రూ. 40వేల లోపు ఉంటుంది. 2024లో సరసమైన ఐఫోన్ కోసం చూస్తున్న ఆపిల్ అభిమానులకు బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.

iPhone 13 price drops on Flipkart, now available under Rs 40k only
iPhone 13 Price Drop : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 ధర మళ్లీ తగ్గింది. ఈసారి ఈ ఐఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా మరింత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఆపిల్ ఇప్పుడు కొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను కూడా లాంచ్ చేసింది. అయితే, అధిక ధర కారణంగా ప్రతి ఒక్కరూ కొత్త వెర్షన్‌ను కొనుగోలు చేయలేరు. తక్కువ ధరలో ఐఫోన్‌ను సొంతం చేసుకునే యూజర్లకు ఐఫోన్ 13 ప్రస్తుతం బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. లేటెస్ట్ ఐఫోన్ 13 డీల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గిన ఐఫోన్ 13 ధర :
ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఐఫోన్ 13ని రూ. 40,999 ప్రారంభ ధరతో విక్రయిస్తోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా, అమెజాన్ ఐఫోన్ 13ని చౌకైన ధరకు అందిస్తోంది. ఈ ఐఫోన్ ధర రూ. 42,999కు అందిస్తోంది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో మెరుగైన డీల్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 1,250 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తోంది. దీని ధర రూ.39,749కి తగ్గుతుంది. ఐఫోన్ 13 ఇప్పుడు రూ. 40వేల విభాగంలో అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ లేకుంటే రూ.1,000 డిస్కౌంట్ పొందవచ్చు. యూపీఐ లావాదేవీలను కూడా ఎంచుకోవచ్చు. అంతేకాకుండా, మీ పాత ఫోన్‌ని మార్చుకోవాలని ప్లాన్ చేస్తే రూ. 23,650 వరకు అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ మొత్తం ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా పొందవచ్చు.
ఐఫోన్ 13 కొనాలా? వద్దా? :
ఐఫోన్ 13 ధర రూ. 40వేల లోపు ఉంటుంది. 2024లో సరసమైన ఐఫోన్ కోసం చూస్తున్న ఆపిల్ అభిమానులకు బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. ఎ15 బయోనిక్ చిప్ ఆధారంగా పనిచేస్తుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్, రోజువారీ వినియోగానికి సున్నితమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. చాలా మంది వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. కొత్త మోడల్‌లు మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ ఐఫోన్ 13 ఐఓఎస్ అప్‌డేట్స్ అందుకుంటుంది. దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్టు, కొత్త ఫీచర్లకు యాక్సస్‌కు అందిస్తుంది.
రూ. 40వేల లోపు ధరలో గుడ్ ఫొటో క్వాలిటీని అందించగల డ్యూయల్-కెమెరా సిస్టమ్ అందిస్తోంది. ప్రత్యేక ఫీచర్లలో ఇదొకటి. 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే కలిగి ఉంది. అయినప్పటికీ ప్రో మోడల్‌లు, కొత్త ఐఫోన్‌లలో కనిపించే హై రిఫ్రెష్ రేట్ లేదు. బ్యాటరీ ఆప్టిమైజేషన్‌లతో వచ్చే ఇటీవలి మోడల్‌ల మాదిరిగా ఉండకపోయినా బ్యాటరీ లైఫ్ బెస్ట్ అని చెప్పవచ్చు. తరచుగా వినియోగిస్తే ఛార్జింగ్ ఒక రోజు కన్నా తక్కువకే వస్తుంది.
బ్యాంక్ ఆఫర్లు లేకపోయినా ఐఫోన్ 13 పర్ఫార్మెన్స్, కెమెరా క్వాలిటీని అందిస్తుంది. ఈ ఐఫోన్ ధర రూ. 40వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు. అయితే, 120Hz స్క్రీన్, అడ్వాన్స్‌డ్ కెమెరాలు, ఎక్కువ బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్‌లకు ప్రాధాన్యత ఇస్తే.. కొత్త మోడల్‌లను సొంతం చేసుకోవచ్చు. కొత్త ఐఫోన్‌లు ఛార్జర్‌తో రావని గమనించాలి.