iPhone 14 Plus : ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ ధరతో పోలిస్తే.. ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌కు ఫుల్ డిమాండ్.. ఎందుకో తెలుసా?
iPhone 14 Plus : 2022 ఏడాదిలో ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నాలుగు కొత్త ఐఫోన్ మోడల్‌లను ప్రవేశపెట్టింది. iPhone 14, iPhone 14 Pro, iPhone 14 Plus, iPhone 14 Pro Max మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఎప్పుడూ కూడా సేల్స్ ఎంత అనేది వెల్లడించలేదు.

iPhone 14 Plus not selling as Apple expected, demand for iPhone 14 Pro models is high
iPhone 14 Plus : 2022 ఏడాదిలో ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నాలుగు కొత్త ఐఫోన్ మోడల్‌లను ప్రవేశపెట్టింది. iPhone 14, iPhone 14 Pro, iPhone 14 Plus, iPhone 14 Pro Max మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఎప్పుడూ కూడా సేల్స్ ఎంత అనేది వెల్లడించలేదు. ఆపిల్ చౌకైన iPhone 14, iPhone 14 Plusతో పోల్చినప్పుడు.. iPhone 14 Pro ఫుల్ డిమాండ్ కొన్ని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. ఐఫోన్ 14 Pro మోడల్‌లకు ఐఫోన్ 14, ప్లస్ మోడల్‌ల విషయంలో అలా కాదని ఒక కొత్త నివేదిక సూచిస్తుంది. ఆపిల్ ఇప్పుడు వ్యూహాన్ని మార్చుకుంది.
ఈ ఏడాదిలో మినీని ప్లస్ మోడల్‌తో భర్తీ చేసింది. ఆపిల్ కొత్తగా ప్రారంభించిన iPhone 14 ప్లస్‌పై iPhone 14 మాదిరిగానే పెద్ద డిస్‌ప్లే, స్పెసిఫికేషన్‌లను అందిస్తుంది. నివేదికల ప్రకారం.. iPhone 14 Plusకి డిమాండ్ ఊహించిన దాని కంటే చాలా తక్కువగా ఉంది. వాస్తవానికి యూజర్లు ప్రో మోడళ్లపై చాలా ఆసక్తి చూపిస్తున్నారు.

iPhone 14 Plus not selling as Apple expected, demand for iPhone 14 Pro models is high
అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఫీచర్లను కూడా అందిస్తాయి. ధర కూడా చాలా ఎక్కువగానే ఉంది. DigiTimes నివేదిక ప్రకారం.. ప్రో మోడల్‌లు iPhone 14, iPhone 14 Plus అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాదిలో ప్రో, నాన్-ప్రో మోడల్‌ల మధ్య అమ్మకాల ఫలితాల్లో తేడాలు ఉన్నాయి.
ఐఫోన్ 14 సిరీస్ మొత్తం షిప్‌మెంట్‌లు గత ఏడాదిలో ఐఫోన్ 13 లైనప్‌తో సమానంగా ఉంటాయని నివేదిక పేర్కొంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ సేల్ వచ్చే త్రైమాసికంలో కూడా ఫ్లాట్‌గా ఉంటే.. ఆపిల్ ఈ మోడళ్లను తయారు చేసే స్పేర్ పార్ట్ ఆర్డర్‌లను తగ్గించవచ్చని నివేదిక పేర్కొంది. ఆపిల్ ఆర్డర్‌లను తగ్గించినట్లయితే.. ఏడాది చివరి నాటికి ఐఫోన్ 14 సిరీస్ షిప్‌మెంట్‌లపై కూడా భారీగా ప్రభావం చూపిస్తుంది.

iPhone 14 Plus not selling as Apple expected, demand for iPhone 14 Pro models is high
కొత్త ఐఫోన్‌లను లాంచ్ చేసిన వెంటనే.. ప్రముఖ విశ్లేషకుడు మింగ్-చి కువో మాట్లాడుతూ.. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌లకు డిమాండ్ ‘లేక్‌లస్టర్’ ఐఫోన్ SE3, ఐఫోన్ 13 మినీ కంటే కూడా అధ్వాన్నంగా ఉంది. iPhone 14 Pro, iPhone 14 Pro Max అధిక డిమాండ్‌ను కొనసాగిస్తున్నట్లు నివేదించింది. ఆపిల్ మరిన్ని ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్‌లను తయారు చేసేందుకు నాన్-ప్రో మోడల్‌ల నుంచి ప్రొడక్టులను మారుస్తుందని వినియోగదారులు విశ్వసిస్తున్నారు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..