Apple iPhones Discount : ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఇదే బెస్ట్ టైమ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!
Apple iPhones Discount : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 15, ఇతర ఐఫోన్‌లు తగ్గింపు ధరతో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయాలంటే ఇప్పుడే కొనేసుకోండి.

iPhone 15 Pro Max, iPhone 14, iPhone 15 and more get big discount_ Check out details
Apple iPhones Discount : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 15 ఇతర ఐఫోన్‌లు భారీ తగ్గింపు ధరతో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 4 నుంచి 5 నెలల తర్వాత ఐఫోన్ ధర తగ్గవచ్చు. అప్పటివరకూ వేచి ఉండలేకపోతే.. మీరు కోరుకున్న ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌ను కొనుగోలుకు ఇదే బెస్ట్ టైమ్. ఆపిల్ అధీకృత రిటైలర్, ఇమాజిన్ స్టోర్, బ్రాండ్ నుంచి లేటెస్ట్ సెట్ ఐఫోన్‌లు, ఇతర డివైజ్‌ల కోసం వెబ్‌సైట్‌లో సేల్ బ్యానర్‌లను పోస్ట్ చేసింది. బెస్ట్ ఐఫోన్ 15 సిరీస్, ఐఫోన్ 14 డీల్‌లను అందిస్తోంది. ఇందులో మీకు నచ్చిన ఐఫోన్ కొనేసుకోండి.
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 15 భారీ తగ్గింపు :
ప్రస్తుతం ఐఫోన్ 15 ప్రో మాక్స్ రూ. 1,57,900 తగ్గింపు ధరతో విక్రయిస్తోంది. ఈ డివైజ్ వాస్తవానికి ప్రారంభంలో రూ. 1,59,900కి లాంచ్ అయింది. అంటే.. వినియోగదారులు రూ. 2వేల ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనపు తగ్గింపు రూ. 4వేలు వరకు పొందవచ్చు. ఈ ఐఫోన్ ధర రూ. 1,53,900కి తగ్గుతుంది.
Read Also : Lava Yuva 3 Pro Specifications : అత్యంత సరసమైన ధరకే లావా యువ 3 ప్రో ఫోన్.. స్పెషిఫికేషన్లు, ధర ఎంతంటే?
ఐఫోన్ ప్రో మోడల్‌లపై డిస్కౌంట్‌లను పొందడానికి ఇదే బెస్ట్ సమయం కావచ్చు. ఈ ఐఫోన్‌ను అతి తక్కువ ధరకు పొందడానికి ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ డీల్ చెక్ చేయొచ్చు. వివిధ ఇ-కామర్స్ సైట్‌లలో లభించే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఐఫోన్ మరింత ఎక్కువ మార్జిన్‌తో ధర తగ్గే అవకాశం ఉంది.

iPhone 15 Pro Max, iPhone 14, iPhone 15 big discount
కొద్దిరోజులు ఆగితే మరింత తగ్గవచ్చు :
ఐఫోన్ 15 కూడా అమ్మకానికి ఉంది. వినియోగదారులు ఈ ఐఫోన్ మోడల్ రూ. 77,900కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ అసలు ధర రూ. 79,900 నుంచి తగ్గింది. బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5వేల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందిస్తుంది. ఐఫోన్ ధర రూ.72,900కి తగ్గనుంది. అదేవిధంగా, ఐఫోన్ 15 ప్లస్‌ను రూ. 82,900కి సమర్థవంతంగా కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 14 డీల్ కోసం చూస్తున్న యూజర్లు ఆపిల్ స్టోర్‌లకు బదులుగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే ఇ-కామర్స్ సైట్ ఈ ఐఫోన్ ధర రూ. 58,999 కన్నా తక్కువగా విక్రయిస్తోంది. జనవరి 2024లో జరిగే రిపబ్లిక్ డే సేల్‌లో ఐఫోన్ 14 ధర మరికొన్ని వేలకు తగ్గే అవకాశం ఉన్నందున కొన్నివారాల పాటు వేచి ఉండవచ్చు. ఇతర ఐఫోన్ డీల్‌లను ఇమాజిన్ స్టోర్‌లోనే కొనుగోలు చేయొచ్చు.
ఐఫోన్‌లతో పాటు, మ్యాక్‌బుక్స్‌పై కూడా రూ.20వేల వరకు తగ్గింపు పొందవచ్చు. మ్యాక్‌బుక్ ప్రో ఎమ్2 మోడల్ (256జీబీ) 13-అంగుళాల డిస్‌ప్లేతో రూ. 1,09,312కి విక్రయిస్తోంది. అయితే మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్1 (256జీబీ) రూ. 76,918కి విక్రయిస్తోంది. చివరగా, 14-అంగుళాల డిస్‌ప్లేతో మ్యాక్‌బుక్ ప్రో ఎం3ని రూ. 1,54,706 ధరతో కొనుగోలు చేయవచ్చు. మీరు మ్యాక్‌బుక్‌ని కొనుగోలు చేయాలని భావిస్తే.. ఇమాజిన్ స్టోర్ భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది.
Read Also : Tech Tips in Telugu : మీ స్మార్ట్‌ఫోన్‌ను టీవీ రిమోట్‌గా ఇలా మార్చేయండి.. ఇదిగో సింపుల్ టిప్స్ మీకోసం..!