iPhone 17 series: ఐఫోన్ 17 సిరీస్ డమ్మీ ఫోన్లు చూశారా? వామ్మో.. డిజైన్‌లో ఎన్నెన్ని మార్పులో..
ఐఫోన్ 16 సిరీస్‌తో పోల్చితే ఐఫోన్ 17 సిరీస్ డిజైన్‌లో ఎన్నో మార్పులతో వస్తుంది.

iPhone 17 series dummy units
గత కొన్నేళ్లుగా ఆపిల్ తన న్యూ జనరేషన్ ఐఫోన్ మోడళ్ల విషయంలో పాత డిజైన్ విధానాన్నే ఫాలో అవుతోంది. స్టాండర్డ్ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ డిజైన్‌లో అప్‌గ్రేడ్‌లు ఉన్నప్పటికీ.. ప్రో మోడల్స్‌లో మాత్రం పాత డిజైనే ఉంది.
ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబరులో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లలో డిజైన్ మార్పులు చాలా ఉంటాయని ఇప్పటికే పలు రిపోర్టులు చెప్పాయి. యూజర్లు ఫ్రెష్ లుక్‌తో వీటిని అందుకోవచ్చని వాటి ద్వారా తెలుస్తోంది.
తాజాగా, ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 ఎయిర్, వనిల్లా ఐఫోన్ 17 మోడళ్ల డమ్మీ యూనిట్లు ఓ కొత్త వీడియోలో కనపడ్డాయి. ఐఫోన్ 16 సిరీస్ మోడళ్లతో పోల్చి చూస్తే డిజైన్‌లో అనేక మార్పులతో ఐఫోన్ 17 సిరీస్ వస్తున్నట్లు అర్థమవుతుంది.
డిజైన్ అప్‌గ్రేడ్లు
యూట్యూబ్ ఛానల్ ఐడివైస్‌హెల్ప్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. ఐఫోన్ 16 సిరీస్‌తో పోల్చితే ఐఫోన్ 17 సిరీస్ డిజైన్‌లో ఎన్నో మార్పులతో వస్తుంది. అందులో పోస్ట్ చేసిన వీడియోలో నాలుగు ఐఫోన్ 17 మోడళ్ల డమ్మీ యూనిట్లు ఉన్నాయి. కొత్త డిజైన్, రీడిజైన్ చేసిన కెమెరా బార్‌ను అందులో చూపారు.
ఐఫోన్ 17 ఎయిర్ పేరుతో ఈ ఏడాది ఆపిల్ అల్ట్రా-తిన్ ఐఫోన్‌ను లాంచ్ చేస్తుందని ఇప్పటికే పలు లీక్‌ల ద్వారా తెలిసింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 17 ప్లస్ మోడల్ స్థానంలో వస్తుందని కూడా అంటున్నారు.
దాని డిజైన్ విషయానికి వస్తే ఐఫోన్ 17 ఎయిర్ హారిజాంటల్ పిల్-ఆకారపు కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది. ఒకే బ్యాక్ కెమెరాతో దీన్ని విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5.588 మిల్లీమీటర్లు మందంతో వస్తుందని ఈ వీడియోలో చెప్పారు.
ఈ వీడియోలో ఐఫోన్ 17 ప్రో, 17 ప్రో మాక్స్ డిజైన్‌ను కూడా చూపారు. వీటిలో కొత్త కెమెరా మాడ్యూల్‌ను ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెక్టాంగిల్ (దీర్ఘచతురస్ర ఆకారపు) కెమెరా బార్ కింద ఫ్లాష్, మైక్రోఫోన్ ఆప్షన్లు ఉంటాయి. రైట్ కార్నర్‌లో లిడార్‌ను ఉంచుతున్నారు.
గతంలో లీకైన వివరాల ప్రకారం.. కెమెరా బార్ గాజుకు బదులుగా అల్యూమినియంతో తయారవుతుందని చెప్పిన విషయం తెలిసిందే. ఐఫోన్ 17 ప్రో మాక్స్… ఐఫోన్ 16 ప్రో మాక్స్ కంటే కొంచెం మందంగా ఉంటుంది. దీంతో ప్రో మోడళ్లలో భారీ మార్పులు చూడొచ్చని అర్థం చేసుకోవచ్చు.