ఐఫోన్ ఎస్‌ఈ వచ్చాక ఐఫోన్ 15 కనుమరుగు? అందుకు నాలుగు కారణాలు ఇవిగో..
ఇప్పటివరకు ఐఫోన్ ఎస్‌ఈ 4కు సంబంధించిన ఫీచర్ల లీకేజీని గమనిస్తే ఈ ఐఫోన్‌లో ఉన్న ఫీచర్లు ఐఫోన్ 15 ఫీచర్లను డామినేట్ చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

iPhone SE 4: యాపిల్ డివైజులు అంటే ప్రపంచ వ్యాప్తంగా యమ క్రేజ్ ఉంటుంది. యాపిల్ కొన్ని వారాల క్రితమే ఐఫోన్ 16ను విడుదల చేసిన విషయం తెలిసిందే. యాపిల్ నుంచి తక్కువ ధరకు ఐఫోన్ ఎస్‌ఈ సిరీస్‌లు కూడా ఉంటాయి. ఖరీదైన ఐఫోన్‌లను కొనలేని వారు ఐఫోన్ ఎస్‌ఈ మోడళ్ల కోసం వేచి చూస్తుంటారు.
ఇప్పటివరకు ఐఫోన్ ఎస్‌ఈ మోడళ్లు మూడు వచ్చాయి. 2016 ఏడాదితో పాటు 2020, 2022లో వరుసగా ఆ ఐఫోన్ ఎస్‌ఈ మోడళ్లు విడుదలయ్యాయి. ఇప్పుడు నాలుగో తరం ఐఫోన్ ఎస్‌ఈ 4 కోసం చాలా మంది ఆసక్తి కనబర్చుతున్నారు. ఐఫోన్ ఎస్‌ఈను వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
దీన్ని నిపుణులు ఐఫోన్ 15తో పోల్చుతున్నారు. ఐఫోన్ ఎస్‌ఈ 4ను విడుదల చేశాక ఐఫోన్ 15 కనుమరుగైపోయే అవకాశమూ ఉందని చెబుతున్నారు. ఇందుకు ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి. ఐఫోన్ ఎస్‌ఈ మోడళ్లలో 1.ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లు ఉండడం, 2.తక్కువ ధరకు వస్తుండడం, 3.పవర్ ఫుల్ ఇంటర్నల్స్ ఉండడంతో పాటు 4. ఐఫోన్ 16లో స్పోర్టింగ్ ఫన్ కలర్స్ లాంటివే ఐఫోన్ ఎస్‌ఈలోనూ ఉండే అవకాశం ఉంది.
ఇప్పటివరకు ఐఫోన్ ఎస్‌ఈ 4కు సంబంధించిన ఫీచర్ల లీకేజీని గమనిస్తే ఈ ఐఫోన్‌లో ఉన్న ఫీచర్లు ఐఫోన్ 15 ఫీచర్లను డామినేట్ చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఐఫోన్ 16 సిరీస్‌ను విడుదల చేసిన తర్వాత.. ఐఫోన్ 15 అమ్మకాల్లో తగ్గింపు కనపడుతోంది.
ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో..
ఐఫోన్ ఎస్‌ఈ మోడల్ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లతో విడుదల అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఫీచర్ ఐఫోన్ 15 బేస్ మోడల్‌లో లేదు. ఆ ఫీచర్ ఐఫోన్ 15ప్రోతో పాటు ఐఫోన్ 15ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16 అన్నీ మోడళ్లలో మాత్రమే ఉంది. దీంతో ఐఫోన్ 15 కంటే ఐఫోన్ ఎస్‌ఈను కొనడమే బెస్ట్ అని యూజర్లు భావించే అవకాశం ఉంది.
తక్కువ ధర
ఆపిల్ 15 కంటే ఐఫోన్ ఎస్‌ఈను కొనేందుకే యూజర్లు మొగ్గు చూపుతారని చెప్పడానికి మరో కారణం తక్కువ ధరకు ఐఫోన్ ఎస్‌ఈ లభ్యం కానుండడమే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐఫోన్ ఎస్‌ఈ 3 భారత్‌లో రూ.47,600కు లభ్యమతుతోంది. ఇది ఐఫోన్ 15 (ధర రూ.69,000) కంటే తక్కువ ధర. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 15 దాదాపు 55 వేల రూపాయలకు లభ్యమవుతున్నప్పటికీ అది కూడా ఐఫోన్ ఎస్‌ఈ కంటే ఎక్కువే. ఐఫోన్ ఎస్‌ఈ 3 ధరలాగే ఐఫోన్ ఎస్‌ఈ 4 ధరను కూడా ఆపిల్ రూ.50 వేలలోపే పరిమితం చేస్తే ఆపిల్ 15 కంటే ఐఫోన్ ఎస్‌ఈను కొనేందుకే యూజర్లు మరింత ఆసక్తి కనబర్చుతారు.
పవర్ ఫుల్ ఇంటర్నల్స్
ఐఫోన్ 15 కంటే మరింత పవర్‌ఫుల్ ఇంటర్నళ్లను ఐఫోన్ ఎస్‌ఈ 4లో ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆపిల్ 15 కంటే యూజర్లు ఐఫోన్ ఎస్‌ఈవైపే మళ్లే అవకాశం ఉంటుంది.
ఐఫోన్ 16 స్పోర్టింగ్ ఫన్ కలర్స్ రావడం
స్టాండర్డ్ ఐఫోన్ 15 మోడళ్లను పరిశీలిస్తే దానికంటే ఐఫోన్ 16 మోడళ్లలో స్పోర్టింగ్ కలర్స్, ఆకర్షణీయమైన షేడ్స్ ఉన్నాయి. అలాగే, ఐఫోన్ ఎస్‌ఈ 4లోనూ ఇలాంటి ఫీచర్లే ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.