పుస్తకం చదువుతూ గార్బా డ్యాన్స్ చేసిన యువకుడు

అందరూ హాయిగా లోకాన్ని మర్చిపోయి గార్బా డ్యాన్స్‌ చేస్తుంటే ఈ యువకుడు మాత్రం...

పుస్తకం చదువుతూ గార్బా డ్యాన్స్ చేసిన యువకుడు

Updated On : October 7, 2024 / 4:43 PM IST

దేశవ్యాప్తంగా ప్రజలు నవరాత్రి ఉత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. గుజరాత్‌లో గార్బా నృత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గార్బా డ్యాన్స్ అంటే దేశ వ్యాప్తంగా చాలా మందికి ఇష్టం. తాజాగా, ఓ యువకుడు గార్బా ఈవెంట్‌లో పుస్తకం పట్టుకుని చేసిన గార్బా డ్యాన్స్ వైరల్ అవుతోంది.

అందరూ హాయిగా లోకాన్ని మర్చిపోయి గార్బా డ్యాన్స్‌ చేస్తుంటే ఈ యువకుడు మాత్రం అక్కడ కూడా పుస్తకాన్ని చదవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎక్స్‌ యూజర్ అంకిత ఈ వీడియోను పోస్ట్ చేసింది. గార్బా ఈవెంట్‌లో బ్రౌన్ కుర్తా, జీన్స్ ధరించిన యువకుడు తన చేతుల్లో పుస్తకాన్ని పట్టుకుని గార్బా స్టెప్పులకు తగ్గట్లు డ్యాన్స్ చేశాడు.

అతడి డ్యాన్స్‌పై నెటిజన్లు స్పందిస్తూ.. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యేవాళ్లు ఇలాగే ఎక్కడికి వెళ్లినా పుస్తకాన్ని పట్టుకుని వెళ్లి చదువుతూ అన్ని పనులు చేస్తుంటారని అంటున్నారు. చదువుకోవడానికి వేరే ప్రదేశమే దొరకలేదా? అంటూ కొందరు కామెంట్లు చేశారు. చదువు విలువ తెలుసుగనుకే అటువంటి పని చేశాడంటూ కొందరు చురకలు అంటిస్తున్నారు. అన్నం తినేటప్పుడు కూడా ఇలాగే చదువుకుంటాడా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

మెడిసిన్‌లో ఇద్దరికి నోబెల్‌ బహుమతి.. ఏం కనుగొన్నారంటే?