iQOO 11 Launched in India : భారత్‌లో iQOO 11 ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వచ్చేసిందోచ్.. అద్భుతమైన ఫీచర్లు.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!
iQOO 11 Launched in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం iQOO నుంచి భారత మార్కెట్లోకి కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ iQOO 11 మోడల్ వచ్చేసింది. Qualcomm Snapdragon 8 Gen 2 హుడ్ కింద iQOO 11 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఫోన్‌గా చెప్పవచ్చు.

iQOO 11 launched in India _ Top specs, price, features and everything you need to know
iQOO 11 Launched in India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం iQOO నుంచి భారత మార్కెట్లోకి కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ iQOO 11 మోడల్ వచ్చేసింది. Qualcomm Snapdragon 8 Gen 2 హుడ్ కింద iQOO 11 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఫోన్‌గా చెప్పవచ్చు. Qualcomm ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో వచ్చిన iQOO 11 దేశంలోనే మొదటి ఫోన్. 2K E6 AMOLED ప్యానెల్, Vivo V2 చిప్‌తో పాటుగా 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. లో-లైటింగ్ ఫోటో ఫోటోగ్రఫీని పెంచుతుంది.
iQOO లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ Antutuలో 1323820 కలిగి ఉంది. ఫోన్ UFS 4.0తో కూడా వస్తుంది. యాప్ స్పీడ్ వేగం, కాష్ స్పీడ్, బిగ్ ఫైల్ ట్రాన్స్‌ఫర్ స్పీడ్ ద్వారా పనిచేస్తుంది. iQOO ఇండియా CEO నిపున్ మరియా మాట్లాడుతూ.. iQOOలో సరికొత్త మొబైల్ టెక్నాలజీలు, హై-పర్ఫార్మెన్స్ ఫీచర్లను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు.
ప్రీమియం డిజైన్, ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్‌లు, బెస్ట్ పర్ఫార్మెన్స్ అందించే iQOO 11తో ఈ ఏడాదిలో ఫస్ట్ ఫ్లాగ్‌షిప్ ప్రొడక్టులను తీసుకురానుంది. భవిష్యత్తులో అసాధారణమైన ప్రొడక్టులు, సర్వీసులను తీసుకొచ్చేందుకు యూజర్ ఎక్స్‌పీరియన్స్ చుట్టూ తిరిగే వెర్షన్ అని చెప్పవచ్చు.
iQOO 11 టాప్ స్పెషిఫికేషన్లు ఇవే :
Display : iQOO 11 144Hz, HDR10+కి సపోర్టుతో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.
Processor : iQOO 11 Qualcomm Snapdragon 8 Gen 2 ద్వారా ఆధారితమైనది. Qualcomm ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ మొదటి స్మార్ట్‌ఫోన్.
RAM : iQOO 11 గరిష్టంగా 16GB RAMతో వస్తుంది. అదనంగా, 8GB వరకు వర్చువల్ ర్యామ్
Read Also : iQOO 9T Discount : అమెజాన్‌లో iQOO 9T స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అదిరే ఫీచర్లు.. ధర ఎంతంటే?
Storage : iQOO 11 గరిష్టంగా 256GB వరకు స్టోరేజీతో వస్తుంది.
Software : iQOO 11పైన FunTouchOSతో Android 13లో రన్ అవుతుంది.

iQOO 11 launched in India _ Top specs, price, features and everything you
Back Camera : iQOO 11 ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50-MP Samsung GN5 లెన్స్, 13-MP టెలిఫోటో లెన్స్, 8-MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి.
Front Camera : iQOO 11 16-MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
Battery : iQOO 11 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
iQOO 11 టాప్ ఫీచర్లు ఇవే :
iQOO 11 అనేక అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. గేమింగ్‌తో పాటు లో-లైటింగ్ ఫోటోగ్రఫీతో ఇన్-హౌస్ V2 ఇమేజింగ్ చిప్‌తో ఫోన్ వస్తుంది. గేమర్‌లకు బాగా సరిపోతుంది. ఫోన్ హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌ను పెంచే డ్యూయల్ x-లీనియర్ మోటార్‌లతో కూడా వస్తుంది. గేమర్ రెండు వేళ్లకు బదులుగా వేళ్లతో గేమ్ ఆడవచ్చు. గేమ్‌లు ఆడుతున్నప్పుడు వివిధ కట్‌సొమైజేషన్‌లు, సెట్టింగ్‌లు ఉన్నాయి. తీవ్రమైన గేమింగ్ సెషన్ మధ్యలో ఉన్నట్లయితే మీరు కాల్‌ను హోల్డ్‌లో ఉంచవచ్చు. iQOO 11 మూన్ షాట్‌లను క్యాప్చర్ చేసేందుకు రూపొందించిన సూపర్‌మూన్ ఫీచర్‌ను కూడా అందిస్తుంది. 30x జూమ్‌తో సపోర్టు ఇస్తుంది.
iQOO 11: భారత ధర ఎంతంటే? :
iQOO 11 ఫోన్ (8GB+256GB) వేరియంట్ ధర రూ. 59,999 ధరతో వచ్చింది. 16GB+256GB ధర రూ. 64,999తో వస్తుంది. బ్యాంక్ ఆఫర్లతో పాటు ఫోన్‌ను రూ.51,999, రూ.56,999కి కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్, జనవరి 12న ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ సేల్ (Prime Early Access Sale) సమయంలో మీరు రూ. 1000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ప్రైమ్ అకౌంట్ లేని యూజర్లు జనవరి 13 నుంచి అమెజాన్ iQOO స్టోర్‌లలో డివైజ్ కొనుగోలు చేయవచ్చు. iQOO 11 లెజెండ్, ఆల్ఫా వేరియంట్‌లతో సహా రెండు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..