iQOO 9T 5G : లాంచింగ్ ముందే.. iQOO 9T 5G ఫోన్ ఫీచర్లు రివీల్ చేసిందిగా..!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐక్యూ (iQOO) కంపెనీ భారత మార్కెట్లోకి కొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్ iQOO 9T 5G తీసుకొస్తోంది.

Iqoo 9t 5g Colour Options, Design Confirmed Ahead Of India Launch
iQOO 9T 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐక్యూ (iQOO) కంపెనీ భారత మార్కెట్లోకి కొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్ iQOO 9T 5G తీసుకొస్తోంది. దేశ మార్కెట్లోకి iQOO 9T 5G ఫోన్ లాంచ్ చేయకముందే కంపెనీ ఫీచర్లను రివీల్ చేసింది. దీనికి సంబంధించి ప్రధాన ఫీచర్లను టీజ్ చేసింది. iQOO 9T 5G ఫోన్ భారత మార్కెట్లో ఎప్పుడు లాంచ్ తేదీ అనేది తెలియదు. కానీ, కంపెనీ తన స్మార్ట్‌ఫోన్‌ను స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCతో ఈ నెలలో లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది. iQOO 9T అమెజాన్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
రాబోయే 9T 5G ఫోన్ డిజైన్, ఏయే కలర్లలో రానుందో కంపెనీ ధృవీకరించింది. iQOO 9T 5G ఫోన్ బ్లాక్, BMW లెజెండ్ ఎడిషన్ కలర్ ఆప్షన్‌లో లాంచ్ కానుంది. రెండు వేరియంట్‌లు డ్యూయల్-టోన్ వెనుక ప్యానెల్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. కెమెరా మాడ్యూల్ చుట్టూ ఉన్న ప్రాంతం నిగనిగలాడే బ్లాక్ డిజైన్ కలిగి ఉంది. బ్లాక్ కలర్ వేరియంట్ కెమెరా మాడ్యూల్ షేపడ్ డిజైన్‌తో వచ్చింది. మరోవైపు.. BMW లెజెండ్ ఎడిషన్, బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ షాడోలతో వైట్ ప్యానెల్‌ను కలిగి ఉంది. iQOO 9T 5G వెనుక ట్రిపుల్-కెమెరా సెటప్‌ను అందిస్తుంది.

Iqoo 9t 5g Colour Options, Design Confirmed Ahead Of India Launch
గింబాల్ లాంటి డిజైన్‌తో 50MP శాంసంగ్ GN5 సెన్సార్‌ను కలిగి ఉంటుందని అంటున్నారు. 13MP అల్ట్రావైడ్ కెమెరా, 12MP పోర్ట్రెయిట్ కెమెరా సెన్సార్ కూడా ఉంటుంది. మెరుగైన కెమెరా పర్ఫార్మెన్స్ కోసం 9T 5G Vivo V1+ ISPని కలిగి ఉంటుందని iQOO ధృవీకరించింది. ఈ ఫోన్ FULL HD+ రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లేతో రానుంది. 16MP ఫ్రంట్ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్‌ను కలిగి ఉండనుంది. ఫోన్ బాక్స్ బయట 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4700 mAh బ్యాటరీని అందిస్తుంది.