iQOO Neo 9 Pro Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ఐక్యూ నియో 9 ప్రో సేల్ మొదలైందోచ్.. ఈ ఫోన్ తక్కువ ధరకే కొనాలంటే?
iQOO Neo 9 Pro Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఐక్యూ నియో 9 ప్రో ఫోన్ సేల్ ప్రారంభమైంది. అమెజాన్, ఐక్యూ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ కొనేసుకోవచ్చు. ధర, ఫీచర్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

iQOO Neo 9 Pro goes on sale_ Top specs, bank offers and more
iQOO Neo 9 Pro Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ నుంచి కొత్త ఫోన్ ఇటీవలే లాంచ్ అయింది. అదే.. ఐక్యూ నియో 9 ప్రో ఫోన్.. ఇప్పుడు ఈ కొత్త ఐక్యూ ప్రో మోడల్ సేల్ ప్రారంభమైంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్‌తో ఆధారితమైనది. ఆసక్తికరమైన కలర్ ఆప్షన్లను అందిస్తోంది.
ఈ ఫోన్ మిడ్-రేంజ్ విభాగానికి చెందినది. మీరు కొత్త ఫోన్ కొనేందుకు చూస్తుంటే అమెజాన్, ఐక్యూ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అమ్మకానికి ఉంది. ఐక్యూ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 32,999 నుంచి అందుబాటులో ఉంది. మీ ఫోన్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐక్యూ నియో 9 ప్రో సేల్ :
ఐక్యూ నియో 9 ప్రో మోడల్ సేల్ ఈరోజు (మార్చి 21) మధ్యాహ్నం 12:00 గంటలకు మొదలైంది. ఈ ఫోన్ మొత్తం ఫైరీ రెడ్, కాంకరర్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అంతేకాదు.. ఐక్యూ 3 స్టోరేజ్ వేరియంట్‌లలో 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 39,999కు అందిస్తుంది. ఈ ఫోన్ నేరుగా 13 శాతం డిస్కౌంటుతో వస్తుంది.
తద్వారా ఐక్యూ ఫోన్ ధర రూ. 34,999కి తగ్గింది. అదనంగా, ఐక్యూ ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 2వేల అదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.32,999కి తగ్గింది. 8జీబీ+128 జీబీవేరియంట్‌తో పాటు ఐక్యూ నియో 9 ప్రో మోడల్ 8జీబీ+256బీబీ వేరియంట్, 12జీబీ+ 256జీబీ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంది. 8జీబీ వేరియంట్ ధర రూ. 34,999, 12జీబీ వేరియంట్ ధర రూ. 36,999కు కొనుగోలు చేయొచ్చు.
ఐక్యూ నియో 9 ప్రో టాప్ స్పెసిఫికేషన్‌లు :
ఐక్యూ నియో 9 ప్రో 5జీ ఫోన్ 6.78-అంగుళాల ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 3,000 నిట్‌ల ఆకట్టుకునే గరిష్ట ప్రకాశాన్ని చేరుకోగలదు. 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ముఖ్యంగా, ఈ స్మార్ట్‌ఫోన్‌లో ‘వెట్ హ్యాండ్ టచ్’ టెక్నాలజీని పొందవచ్చు. తడి చేతులతో స్క్రీన్‌ను తాకినప్పుడు కూడా రెస్పాండ్ అవుతుంది.
హుడ్ కింద.. ఈ డివైజ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 2 చిప్‌సెట్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. గరిష్టంగా 12జీబీ వరకు (LPDDR5X) ర్యామ్ 256జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో వస్తుంది. ఈ ఫోన్ అడ్రినో 740 జీపీయూతో వస్తుంది. ఐక్యూ నియో 9 ప్రో 5జీ ఎక్స్‌టెండెడ్ ర్యామ్ టెక్నాలజీని అందిస్తుంది.
ఐక్యూ యూజర్లు ఆన్‌బోర్డ్ ర్యామ్ సామర్థ్యాన్ని పొందవచ్చు. గేమర్‌లకు స్టీమింగ్ రూమ్ అనేది మరింత కూలింగ్ సిస్టమ్ సపోర్టు అందిస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. ఐక్యూ నియో 9 ప్రో 5జీ ఫోన్ 50ఎంపీ ఐఎమ్ఎక్స్ 920 నైట్ విజన్ సెన్సార్, 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో కూడిన డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. గత ఫ్లాగ్‌షిప్ ఫోన్ మాదిరిగానే వివో X100 ప్రో అదే సెన్సార్ కలిగి ఉంది. 5,160ఎంఎహెచ్ బ్యాటరీతో 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ డివైజ్ ఐపీ54 సర్టిఫికేట్ పొందింది. వై-ఫై 7 కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది.