ఒప్పో vs ఐకూ: తక్కువ ధరకు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్.. K13x, Z10xలో ఏది బెటర్? ఇంత మంచి ఫోన్‌ను ఎవరు వదులుకుంటారు?
మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉంటే ఈ ఫోన్ కొనండి.

కొత్త 5G ఫోన్ కొనాలనుకుంటున్నారా? బడ్జెట్ తక్కువగా ఉందా? అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకోవాల్సిందే. మార్కెట్‌లో తాజాగా విడుదలైన ఒప్పో K13x, ఐకూ Z10x ఫోన్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రెండూ బడ్జెట్ ధరలోనే అద్భుతమైన ఫీచర్లతో వచ్చాయి.
మరి ఈ రెండింటిలో మీ అవసరాలకు ఏది సరిగ్గా సరిపోతుంది? పనితీరు, కెమెరా, బ్యాటరీ వంటి అన్ని విషయాల్లో ఏది ముందుందో వివరంగా చూద్దాం..
ఫీచర్ | ఒప్పో K13x | ఐకూ Z10x |
---|---|---|
ప్రాసెసర్ | Dimensity 6300 | Dimensity 7300 |
డిస్‌ప్లే | 6.67″ LCD (HD+) | 6.72″ IPS (FHD+, బ్రైట్‌గా ఉంటుంది) |
బ్యాటరీ | 6000mAh (45W) | 6500mAh (44W, రివర్స్ ఛార్జింగ్) |
స్టోరేజ్ | 128GB (1TB వరకు పెంచుకోవచ్చు) | 256GB (పెంచుకోలేరు) |
కెమెరా | 50MP + 2MP (1080p వీడియో) | 50MP + 2MP (4K వీడియో) |
ప్రస్తుత ధర | రూ.11,999 | రూ.16,498 |
పనితీరు, వేగం
ఒప్పో K13x: ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. సాధారణ వాడకానికి, రోజువారీ పనులకు ఇది చక్కగా సరిపోతుంది. 4GB RAM, 128GB స్టోరేజ్ వచ్చింది. మెమొరీ కార్డుతో స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు.
ఐకూ Z10x: పనితీరు విషయంలో దీనికి ఎక్కువ మార్కులు వేయొచ్చు. ఇందులో శక్తిమంతమైన డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. 8GB RAM, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. అయితే, ఇందులో మెమొరీ కార్డు వేసుకునే అవకాశం లేదు.
ఏది కొనాలి: మీకు అధిక పనితీరు, గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ బాగుండాలంటే ఐకూ Z10x బెస్ట్ ఆప్షన్.
డిస్‌ప్లే, బ్యాటరీ: రోజంతా ఛార్జింగ్ అవసరం లేదా?
డిస్‌ప్లే: ఐకూ Z10x డిస్‌ప్లే నాణ్యతలో ముందుంది. దీని ఫుల్ HD+ రిజల్యూషన్ (1080p) కారణంగా చిత్రాలు, వీడియోలు మరింత స్పష్టంగా, అందంగా కనిపిస్తాయి. ఒప్పో K13x HD+ రిజల్యూషన్‌తో వచ్చింది. బ్రైట్‌నెస్ విషయంలో కూడా ఐకూ (1050 nits) మెరుగ్గా ఉంది, కాబట్టి ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
బ్యాటరీ: రెండూ భారీ బ్యాటరీలతో వస్తున్నాయి. ఒప్పోలో 6000mAh బ్యాటరీ ఉండగా, ఐకూలో 6500mAh బ్యాటరీ ఉంది. ఛార్జింగ్ వేగం దాదాపు సమానంగా ఉంది. అయితే, ఐకూ Z10xలో ఉన్న రివర్స్ ఛార్జింగ్ ఫీచర్‌తో మీరు ఇతర చిన్న గ్యాడ్జెట్లను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.
ఏది కొనాలి: ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలంటే ఐకూ Z10x బెస్ట్ ఆప్షన్.
ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి ఏది బెస్ట్?
రెండు ఫోన్లలోనూ 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఫొటోల నాణ్యతలో పెద్ద తేడా ఉండకపోవచ్చు.
ఒప్పో K13x: గరిష్ఠంగా 1080p @ 60fps వరకు వీడియో రికార్డ్ చేస్తుంది.
ఐకూ Z10x: ఇది 4K UHD వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఏది కొనొచ్చు: మీరు సోషల్ మీడియా కోసం వీడియోలు తీయాలనుకుంటే, ఐకూ Z10x మీకు నచ్చుతుంది.
ఎవరు ఏ ఫోన్ కొనాలి?
ఒప్పో K13x (రూ.11,999)
మీ బడ్జెట్ చాలా తక్కువగా ఉంటే ఈ ఫోన్ కొనండి. మీకు ఎక్కువ స్టోరేజ్ అవసరమై, మెమొరీ కార్డుతో పెంచుకోవాలనుకుంటే ఇది కొనొచ్చు. రోజువారీ వాడకానికి, సాధారణ ఫోన్ కాల్స్, వాట్సాప్ కోసం అయితే ఈ స్మార్ట్‌ఫోన్ కొనండి.
ఐకూ Z10x (రూ.16,498)
మీకు గేమింగ్, అధిక పనితీరు కావాలనుకుంటే ఈ ఫోన్ కొనొచ్చు. సినిమాలు, వీడియోలు చూడడానికి, బ్రైట్ డిస్‌ప్లే కావాలంటే ఈ స్మార్ట్‌ఫోన్ కొనండి. 4K వీడియో రికార్డింగ్ కావాలంటే, కొంచెం బడ్జెట్ ఎక్కువగా ఉంటే ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు.