ట్విటర్ సృష్టికర్త మరో సంచలనం.. రెండు కొత్త యాప్స్.. ఈ యాప్స్‌ వాడడానికి ఇంటర్నెట్ అక్కర్లేదు..

ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రెండు యాప్‌లూ "గూస్" సాయంతో తయారయ్యాయి.

ట్విటర్ సృష్టికర్త మరో సంచలనం.. రెండు కొత్త యాప్స్.. ఈ యాప్స్‌ వాడడానికి ఇంటర్నెట్ అక్కర్లేదు..

Updated On : July 20, 2025 / 3:22 PM IST

ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, “బ్లాక్” సీఈవో జాక్ డోర్సీ టెక్ రంగంలో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. “గూస్” అనే శక్తిమంతమైన ఏఐ టూల్, “వైబ్ కోడింగ్” అనే కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. వీటి ద్వారా జాక్ డోర్సీ ఒక్క వారంలో రెండు కొత్త యాప్‌లను రూపొందించారు. ఎక్కువ కోడింగ్ చేయాల్సిన పని కూడా లేకుండా వీటిని రూపొందించడం గమనార్హం.

ఆ రెండు యాప్‌లు ఇవే..
బిట్‌చాట్: ఇంటర్నెట్, ఫోన్ నంబర్లు అవసరం లేకుండా బ్లూటూత్ మెష్ నెట్‌వర్క్‌ ఉపయోగించి ఆఫ్‌లైన్‌లో పని చేసే సురక్షితమైన పియర్ టు పియర్ మెసేజింగ్ యాప్ ఇది.

బిట్‌చాట్ ఇంటర్నెట్ లేకుండానే పనిచేస్తుందని తెలియడంతో దీనిపై అమితాసక్తి నెలకొంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉపయోగించి తక్కువ కనెక్టివిటీ ప్రాంతాల్లో కూడా ప్రైవేట్ చాట్స్ అందిస్తుంది.

Also Read: కేంద్రమంత్రిగా నాగబాబు? టీడీపీ నుంచి ఎవరు?

సన్ డే: యూజర్లు ఉండే ప్రాంతం, వారి చర్మరంగు, దుస్తులు, యూవీ ఇండెక్స్ ఆధారంగా యూవీ ఎక్స్‌పోజర్ ట్రాక్ చేయడం, విటమిన్ డీని అంచనా వేసే వెల్నెస్ యాప్ ఇది.

ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రెండు యాప్‌లూ గూస్ సాయంతో తయారయ్యాయి. ఇది “బ్లాక్” అభివృద్ధి చేసిన ఓపెన్ సోర్స్ ఏఐ ఏజెంట్. గూస్ ఎక్కువ భాగం సాఫ్ట్‌వేర్ అభివృద్ధిని ఆటోమేట్ చేస్తుంది.

ఇది కోడ్ రాయడం, ఎర్రర్ డీబగ్ చేయడం, ఇంటర్‌ఫేస్‌లు రూపొందించడం, యాప్‌లు డిప్లాయ్ చేయడం వంటివి చేస్తుంది. ఇది గిట్‌హబ్‌లో హోస్ట్ అయి, పూర్తిస్థాయి ఏఐ ఇంజినీర్‌లా పనిచేస్తోంది.

దీంతో ఇది “వైబ్ కోడింగ్”లోకి వస్తుంది. ప్రతి ఫంక్షన్‌ను ఇది మనిషిలా చేయదు. యాప్‌ డెవలపర్లు తమ ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎక్స్‌పీరియన్స్‌ల గురించి ఏఐకి వివరిస్తారు. దాని ద్వారా ఈ ఏఐ వాటిని అమలు చేస్తుంది.