Jio Offer: జియో ఆఫర్.. రూ.1కే 100ఎంబీ మొబైల్ డేటా
వొడాఫోన్ ఐడియా (Vi), ఎయిర్‌టెల్ లను ఫాలో అవుతూ.. రిలయన్స్ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను 25శాతం పెంచింది. దాంతో పాటు ఆల్ ఇన్ వన్ ప్యాక్ ను కూడా పెంచింది. వీటితో పాటుగా జియో...

Jio Recharge
Jio Offer: వొడాఫోన్ ఐడియా (Vi), ఎయిర్‌టెల్ లను ఫాలో అవుతూ.. రిలయన్స్ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను 25శాతం పెంచింది. దాంతో పాటు ఆల్ ఇన్ వన్ ప్యాక్ ను కూడా పెంచింది. వీటితో పాటుగా జియో మరో అత్యంత చౌకైన ప్యాక్ ను తీసుకొచ్చింది. కేవలం రూ.1తో హై స్పీడ్ 4జీ డేటా పొందొచ్చు.
కంపెనీ అధికారిక అనౌన్స్‌మెంట్ ఇవ్వనప్పటికీ.. మైజియో యాప్ లో ఈ ఆఫర్ అందుబాటులోనే ఉంది. పైగా ఇలా వచ్చే 100ఎంబీ డేటా 30రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. వేరే ప్యాక్ వాడుతూ దాని వాలిడిటీ అయిపోయాక వాడాలని లేదు. కావాలనుకుంటే ముందుగానే క్యూలో ఉంచుకోవచ్చు.
* మీరు జియో యూజర్ అయి ఉండి.. రూ.1రీఛార్జ్ ప్లాన్ పొందాలనుకుంటే..
* MyJio app ఓపెన్ చేసి లాగిన్ అవండి.
* Recharge sectionకు వెళ్లి.. కుడివైపు పైన ఉన్న More ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత Value ఆఫ్షన్ ఎంచుకోండి.
* Affordable Packs ఆప్షన్ కింద Other Plans ఆప్షన్ ఉంటుంది.
* అక్కడే రూ. జియో రీఛార్జ్ ప్లాన్ కనిపిస్తుంది.