Jio OTT Plans : ఫైబర్ యూజర్ల కోసం జియో సరికొత్త అన్‌లిమిటెడ్ ఓటీటీ ప్లాన్లు.. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఫ్రీగా చూడొచ్చు!
Jio OTT Plans : జియో ఇటీవల ఓటీటీ ప్లాన్‌కి అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. జియోసినిమా ప్రీమియం మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌కు లేటెస్ట్ యాడ్ ఫ్రీ టైర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆవిష్కరణతో రూ. 89 ఫ్యామిలీ ప్లాన్‌తో పాటు రూ. 29 ప్లాన్‌ను కూడా అందిస్తోంది.

Jio unlimited OTT plans ( Image Credit : Google )
Jio OTT Plans : భారతీయ ప్రముఖ టెలికాం దిగ్గజం, రిలయన్స్ జియో, వివిధ ఓటీటీ సర్వీసులపై అదనపు ఖర్చు లేకుండా యూజర్ల కోసం కొత్త బండిల్ స్ట్రీమింగ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ‘అల్టిమేట్ స్ట్రీమింగ్ ప్లాన్’ని తీసుకొచ్చింది. ఈ పోస్ట్‌పెయిడ్ ఆప్షన్ నెలకు ధర రూ. 888 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా జియోఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ సబ్‌స్క్రైబర్‌లు సులభంగా యాక్సస్ చేసుకోవచ్చు.
Read Also : Reliance Jio Number : కొత్త జియో నెంబర్ ఏంటో మర్చిపోయారా? ఈ 5 పద్ధతుల్లో మీ నెంబర్ ఈజీగా తెలుసుకోవచ్చు!
జియో ప్రకారం.. ఈ ప్లాన్ 30ఎంబీపీఎస్ స్పీడ్ లిమిట్ ఉన్నప్పటికీ, స్ట్రీమింగ్, అన్‌లిమిటెడ్ కంటెంట్ యాక్సెస్‌ను కోరుకునే యూజర్లకు అందిస్తుంది. బఫరింగ్ సమస్యలు లేకుండా స్పీడ్ స్ట్రీమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, 15 ప్రీమియం ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను చేర్చగా అన్నీ ఒకే ప్లాన్‌లోనే పొందవచ్చు.
జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్ :
ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ (బేసిక్ ప్లాన్), ప్రైమ్ వీడియో (లైట్), జియోసినిమా ప్రీమియం వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో విస్తారమైన కంటెంట్ లైబ్రరీకి యాక్సెస్‌ను అందిస్తుంది. అదనంగా, సబ్‌స్క్రైబర్‌లు డిస్నీ+ హాట్‌స్టార్, సోనీలైవ్, జీ5, సన్ నెక్స్ట్, Hoichoi, డిస్కవరీ ప్లస్, ఆల్ట్ బాలాజీ, ఎరోస్ నౌ, లయన్స్ గేట్ ప్లే, ShemarooMe, DocuBay, EPICON, ETV WIN వంటి అనేక ఇతర ప్రాంతీయ, ఓటీటీ సర్వీసులకు జియోటీవీ ప్లస్ ద్వారా యాక్సెస్‌ను పొందవచ్చు.
ఈ ప్లాన్ కొత్తది అయినప్పటికీ, జియో ప్రస్తుత యూజర్ల సంఖ్యపై ఫోకస్ చేయలేదు. ప్రస్తుతం ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఉన్నా లేదా తక్కువ బ్యాండ్‌విడ్త్ జియోఫైబర్/ఎయిర్ ఫైబర్ ప్లాన్‌లో ఉన్నా (10 ఎంబీపీఎస్ లేదా 30ఎంబీపీఎస్) యూజర్లు ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఓటీటీ కంటెంట్‌ను కూడా అన్‌లాక్ చేయవచ్చు. జియో ఇటీవల ప్రకటించిన ఐపీఎల్ ధన్ ధన్ ధన్ ఆఫర్ కూడా ఈ ప్లాన్‌కు వర్తిస్తుంది. అర్హత ఉన్న సబ్‌స్క్రైబర్‌లు తమ జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌పై 50-రోజుల తగ్గింపు క్రెడిట్ వోచర్‌ను పొందవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 సీజన్‌లో అన్నింటిపై ఆఫర్లను పొందవచ్చు.
జియోసినిమా ప్లాన్ :
జియో ఇటీవల ఓటీటీ ప్లాన్‌కి అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. జియోసినిమా ప్రీమియం మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌కు లేటెస్ట్ యాడ్ ఫ్రీ టైర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆవిష్కరణతో రూ. 89 ఫ్యామిలీ ప్లాన్‌తో పాటు రూ. 29 ప్లాన్‌ను కూడా అందిస్తోంది. జియో యూజర్ల వ్యూ ఎక్స్‌పీరియన్స్ కోసం మరిన్ని ఆప్ష్లను అందిస్తుంది. జియోసినిమా రూ. 29 ప్రీమియం ప్లాన్‌తో ప్రారంభించి సబ్‌స్క్రైబర్‌లు అనేక పెర్క్‌లను అందించే నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌కు యాక్సెస్‌ను పొందవచ్చు.
వీటిలో 4కె కంటెంట్‌కి యాక్సెస్, యాడ్-ఫ్రీ వ్యూ, ఆఫ్‌లైన్ వ్యూ కోసం కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయగల సామర్థ్యం, విభిన్న రేంజ్ ప్రత్యేకమైన సిరీస్, సినిమాలు, హాలీవుడ్ హిట్‌లు, కిడ్స్ కంటెంట్, టీవీ ఎంటర్‌టైన్మెంట్ ఉన్నాయి. యాడ్ ప్రీ వ్యూ ద్వారా ఈ పెర్క్ క్రీడలు, లైవ్ స్ట్రీమింగ్ ఛానెల్‌లకు మినహాయింపు ఉందని గమనించడం ముఖ్యం. ఈ ప్లాన్ ఒకేసారి ఒకే డివైజ్ వినియోగానికి రూపొందించారు. మొబైల్ యాప్‌లు, వెబ్ బ్రౌజర్‌లు, టీవీ వంటి వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో అనుకూలంగా ఉంటుంది.
జియోసినిమా రూ. 89 ప్రీమియం ప్లాన్‌తో సబ్‌స్ర్కైబర్లు రూ. 29 ప్లాన్‌కు సమానమైన బెనిఫిట్స్ పొందవచ్చు. ఇందులో 4కె కంటెంట్, యాడ్-ఫ్రీ వ్యూ, ఆఫ్‌లైన్ వ్యూ సామర్థ్యాలు, ప్రత్యేకమైన కంటెంట్‌కి యాక్సెస్ పొందవచ్చు. ఈ యాడ్ ఫ్రీ వ్యూ బెనిఫిట్స్ క్రీడలు, లైవ్ స్ట్రీమింగ్ ఛానెల్‌లకు వర్తించదు. అయితే, రూ. 89 ప్లాన్‌లో నాలుగు డివైజ్‌లలో ఏకకాలంలో స్ట్రీమింగ్ యాక్సస్ పొందవచ్చు. ఈ ఫీచర్ మల్టీ యూజర్లతో ఫ్యామిలీ యూజర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.