Jio Phone Next : జియో ఫోన్ నెక్స్ట్ సేల్స్ షురూ..రిజిస్ట్రేషన్ తప్పనిసరి
జియో మరియు గూగుల్ కంపెనీలు సంయుక్తంగా తయారుచేసిన స్మార్ట్ ఫోన్ "జియో ఫోన్ నెక్ట్స్"మార్కెట్ లోకి

Jio
Jio Phone Next జియో మరియు గూగుల్ కంపెనీలు సంయుక్తంగా తయారుచేసిన స్మార్ట్ ఫోన్ “జియో ఫోన్ నెక్ట్స్”మార్కెట్ లోకి వచ్చింది. ఇటీవలి కాలంలో అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ఫోన్ నెక్ట్స్ అమ్మకాలు దీపావళి పండుగ సందర్భంగా గురువారం(నవంబర్-4,2021)నుంచి ప్రారంభమయ్యాయి.
దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్ ఫోన్ లభ్యం అవుతోంది. అయితే స్టోర్ కి వెళ్లే ముందు తమ ఆసక్తిని వాట్సాప్ లేదా కంపెనీ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని రిలయన్స్ వినియోగదారులను కోరుతోంది. ఆసక్తి గల యూజర్లు వాట్సాప్ నంబర్ 7018270182 నంబర్‌కు వివరాలు పంపి తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఆ సమాచారాన్ని యూజర్ సమీపంలోని రిటైల్ స్టోర్‌కు పంపుతారు. అక్కడికి వెళ్లి సదరు యూజర్ జియోఫోన్ నెక్ట్స్ కొనుగోలు చేయవచ్చు.
అయితే ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా ఫోన్ కొనుగోలు చేయలేరు. జియో ఫోన్ నెక్ట్స్ ధరను రూ.6,499గా నిర్ణయించారు. ఇక,ఈజీ ఈఎమ్ఐ లేదా ఫైనాన్స్ కింద ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.1999గా ఉంది.
కాగా,భారతీయత కేంద్రబిందువుగా రూపుదిద్దుకున్న ఈ నూతన ఫోన్ ఇప్పటికే యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
జియో ఫోన్ నెక్ట్స్ యొక్క కొన్ని విశిష్ట ఫీచర్లు:
వాయిస్ అసిస్టెంట్
ఈ ఉపకరణాన్ని వినియోగించడంలో వినియోగదారులకు వాయిస్ అసిస్టెంట్ తోడ్పడుతుంది. తమకు బాగా తెలిసిన భాషలో ఇంటర్నెట్ నుంచి సులభంగా సమాచారాన్ని, కంటెంట్ ను పొందడంలో సహకరిస్తుంది.
రీడ్ అలౌడ్
ఏ స్క్రీన్ పై అయినా సరే, కంటెంట్ ను బయటకు చదివి వినిపించేందుకు ‘లిజన్’ అనేది వినియోగదారులకు తోడ్పడుతుంది. తాము అర్థం చేసుకోగల భాషలో కంటెంట్ ను ఉపయోగించుకునేందుకు ఇది వినియోగదారు లకు వీలు కల్పిస్తుంది.
ట్రాన్స్ లేట్
‘ట్రాన్స్ లేట్’ అనేది ఏ స్క్రీన్ పై అయినా కూడా తాము ఎంచుకున్న భాషలోకి కంటెంట్ అనువాదం అయ్యేందుకు వినియోగదారులకు తోడ్పడుతుంది. వినియోగదారులు తాము ఎంచుకున్న భాషలో కంటెంట్ ను చదివేందుకు తోడ్పడుతుంది.
సులభమైన స్మార్ట్ కెమెరా
ఈ ఉపకరణం స్మార్ట్, శక్తివంతమైన కెమెరాతో ఉంటుంది. పోట్రయిడ్ మోడ్ వంటి వివిధ ఫోటోగ్రఫీ మోడ్స్ ను ఇది సపోర్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ గా బ్లర్డ్ బ్యాక్ గ్రౌండ్ తో ఫోటోలను చక్కగా తీసేందుకు వీలు కల్పిస్తుంది. తక్కువ కాంతి ఉన్న సమయంలోనూ ఫోటోలను బాగా తీసేందుకు నైట్ మోడ్ వీలు కల్పిస్తుంది.కెమెరా యాప్ కూడా ప్రీలోడెడ్ గా వస్తుంది. కస్టమ్ ఇండియన్ అగుమెంటెడ్ రియాలిటీ ఫీచర్లు ఆయా ఫోటోలను మరింతగా మెరుగుపరుస్తాయి. భావోద్వేగాలతో, వేడుకలతో జోడిస్తాయి.
ముందుగానే లోడ్ చేయబడిన జియో, గూగుల్ యాప్స్
గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకొని, ఉపయోగించగలిగిన అందుబాటులో ఉన్న అన్ని ఆండ్రాయిడ్ యాప్స్ ను ఈ ఉపకరణం సపోర్ట్ చేస్తుంది. తద్వారా వారికి ప్లే స్టోర్ లో అందుబాటులో ఉండే లక్షలాది యాప్స్ ను ఎంచుకునే స్వేచ్ఛను అందిస్తుంది. జియో, గూగుల్ యాప్స్ ఇందులో ముందుగానే లోడ్ చేయబడి ఉంటాయి.
ఆటోమేటిక్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్
జియో ఫోన్ నెక్ట్స్ ఆటోమేటిక్ సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ తో ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉంటుంది. దీన్ని వినియోగిస్తున్న కొద్దీ, ఆటోమేటిక్ గా అందించబడే అధునాతన ఫీచర్లతో అది మరింత మెరుగైన పనితీరును అందిస్తుంది. ఇబ్బందిరహిత అనుభూతిని అందించేందుకు వీలుగా సెక్యూరిటీ అప్ డేట్స్ కూడా వస్తాయి.
అద్భుతమైన బ్యాటరీ లైఫ్
ఆండ్రాయిడ్ తో శక్తివంతమైన, నూతనంగా డిజైన్ చేయబడిన ప్రగతి ఓఎస్ చక్కటి పనితీరుకు, అదే సమయంలో దీర్ఘకాలం ఉండే బ్యాటరీ జీవితానికి వీలు కల్పిస్తుంది.