JioHotstar: జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? ప్లాన్‌లు ఎలా ఉన్నాయంటే? ఫ్రీగానూ చూడొచ్చు.. పూర్తి వివరాలు
జియోహాట్‌స్టార్ ప్లాన్ల గురించి పూర్తి వివరాలు చూడండి..

JioHotstar Subscription Plans
ఓటీటీ ప్లాట్‌ఫాంలు జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ కలిసి ఇప్పుడు జియోహాట్‌స్టార్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ప్లాట్‌ఫాంలో వెబ్ సిరీస్‌లు, సినిమాలను చూడొచ్చు. కస్టమర్‌ల కోసం పలు రకాల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందిస్తామని కంపెనీ వెల్లడించింది.
అంతేకాకుండా, బ్రాండ్ స్ట్రీమింగ్ సర్వీస్ కోసం ఉచితంగానూ కొన్ని రకాల కంటెంట్‌ను కూడా చూడొచ్చు. ఓటీటీని బాగా చూసేవారు జియోహాట్‌స్టార్ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల గురించి వివరాల గురించి తెలుసుకోవాల్సిందే.
సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల గురించి, వాటి ధరలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఇప్పటికే జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ వద్ద దాదాపు 3 లక్షల గంటలకుపైగా కంటెంట్‌తో పాటు 50 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ధరలు రూ.149-రూ1,499 మధ్య ఉన్నాయి.
ఇప్పటికే మీరు జియో సినిమా లేదా హాట్‌స్టార్ యాప్‌లకు సబ్స్ర్కైబర్లుగా ఉంటే మీరు ఆటోమేటిక్‌గా కొత్త యాప్‌కు మారుతారు. ఈ యాప్‌లో ఐసీసీతో పాటు ఐపీఎల్ వంటి స్పోర్ట్స్ఈవెంట్లను కూడా చూడవచ్చు. ఐపీఎల్ మ్యాచుల కోసం రూ.149 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు
జియోహాట్‌స్టార్ ప్రస్తుతం తమ కస్టమర్‌లకు మూడు రకాల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందిస్తోంది. మొబైల్ ప్లాన్‌ల విషయానికి వస్తే.. బేసిక్ మొబైల్ ప్లాన్ మూడు నెలలకు రూ.149గా ఉంటుంది.
ఈ ప్లాన్ సంవత్సరానికి అందుకోవాలంటే రూ.499 చెల్లించాలి. ఈ యాడ్-సపోర్ట్డ్ ప్లాన్లను వేసుకుంటే యూజర్లు ఒకేసారి ఒక మొబైల్ నుంచి జియోహాట్‌స్టార్‌లోని అన్ని రకాల కంటెంట్‌ను చూడొచ్చు. 720పీ నాణ్యతలో కంటెంట్‌ను చూడవచ్చు.
సూపర్ ప్లాన్
రెండోది జియోహాట్‌స్టార్ సూపర్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్. ఈ ప్లాన్ మూడు నెలలకు రూ.299 ధరతో తీసుకోవచ్చు. ఈ ప్లాన్ సంవత్సరానికి కావాలనుకునేవారు రూ.899తో వార్షిక సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. మొబైల్ ప్లాన్ లాగానే, ఈ ప్లాన్ కూడా యాడ్-సపోర్ట్ తో అందుబాటులో ఉంది.
కస్టమర్‌లు ఒకేసారి ఏదైనా రెండు డివైజ్‌లలో అన్ని రకాల కంటెంట్‌ను చూడవచ్చు. అంతేకాకుండా, మొబైల్, వెబ్, స్మార్ట్ టీవీలు సహా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను చూడవచ్చు. కస్టమర్లు పూర్తి హెచ్‌డీ 1080పీ నాణ్యతలో కంటెంట్‌ను చూడొచ్చు.
Also Read: మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ ఓపెన్.. మొత్తం గుట్టు రట్టు..
ప్రీమియం ప్లాన్
మూడోది ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్. ఈ టాప్-ఎండ్ ప్లాన్ నెలవారీ, వార్షిక సబ్‌స్క్రిప్షన్‌లతో అందుబాటులో ఉంది. దీని ధర నెలకు రూ. 299, సంవత్సరానికి రూ.1,499తో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు.
టాప్-టైర్ మోడల్లో ఒకేసారి నాలుగు డివైజ్‌లలో కంటెంట్‌కు యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. సూపర్ ప్లాన్ లాగానే అన్ని ప్లాట్‌ఫాంలలో కంటెంట్‌ను చూడవచ్చు. అంతేకాకుండా, లైవ్ కంటెంట్ మినహా, ఈ ప్లాన్‌తో వినియోగదారులు యాడ్లు లేకుండా కంటెంట్ చూడొచ్చు. కస్టమర్లకు 4కే 2160పీ నాణ్యతతో కంటెంట్‌ను చూసే అవకాశం ఉంది. ఈ ప్లాన్ డాల్బీ విజన్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
కొత్త జియోహాట్‌స్టార్ అప్లికేషన్‌లో టీవీలో ప్రీమియర్‌కు ముందు స్టార్ సీరియల్‌లను చూడవచ్చు. వినియోగదారులు కొత్త ఓటీటీ ప్లాట్‌ఫాంలో అన్ని డిస్నీ ఒరిజినల్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు, మరికొన్ని రకాల కంటెంట్‌ను కూడా చూడవచ్చు. హెచ్‌బీఓ, పిక్సర్, స్టార్ వార్స్, పికాక్, నేషనల్ జియోగ్రాఫిక్ వంటి అంతర్జాతీయ చానెళ్ల యాక్సెస్ కూడా పొందవచ్చు.
ఉచితంగా చూడవచ్చా?
జియోహాట్‌స్టార్ వినయోగదారుల కోసం ఫ్రీ-టైర్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. కంటెంట్‌ను ఉచితంగా చూడవచ్చు. కానీ, ఇది ఫ్రీమియం మోడల్ లాగా పనిచేస్తుంది. యాడ్స్ వస్తాయి.