Lava Blaze Pro 5G Launch : లావా బ్లేజ్ ప్రో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 26నే లాంచ్.. డిజైన్, కలర్ ఆప్షన్లు ఇవే.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Lava Blaze Pro 5G Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? లావా నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెల (సెప్టెంబర్ 26)న లావా బ్లేజ్ ప్రో 5G ఫోన్ లాంచ్ కానుంది. ధర ఎంత ఉండొచ్చుంటే?

Lava Blaze Pro 5G Launch : లావా బ్లేజ్ ప్రో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 26నే లాంచ్.. డిజైన్, కలర్ ఆప్షన్లు ఇవే.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Lava Blaze Pro 5G Confirmed to Launch in India on September 26, Design, Colour Options Teased

Lava Blaze Pro 5G Launch Date : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే, మరికొద్ది రోజులు ఆగాల్సిందే.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ లావా బ్లేజ్ ప్రో 5G (Lava Blaze Pro 5G) స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ త్వరలో ఆవిష్కరించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లావా బ్లేజ్ ప్రో 5G వేరియంట్, గత ఏడాది సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో లాంచ్ అయింది.

ఇప్పుడు, రాబోయే కొత్త 5G లావా ఫోన్.. యూట్యూబ్ టీజర్ ద్వారా లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. (Lava) డిజైన్, Blaze ప్రో 5G మోడల్ స్పెసిఫికేషన్‌లను కూడా షేర్ చేసింది. ఈ ఫోన్ LED ఫ్లాష్‌తో పాటు డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. కెమెరా సెన్సార్‌లు బ్యాక్ ప్యానెల్‌పై నిలువుగా ఉంచిన 2 వృత్తాకార కెమెరా మాడ్యూల్స్‌లో ఉంచినట్టుగా కనిపిస్తోంది. టీజర్ వీడియోను కంపెనీ రిలీజ్ చేసింది.

Read Also : Lava Blaze 2 Pro : కొత్త ఫోన్ కావాలా? లావా బ్లేజ్ 2 ప్రో ఫోన్ వచ్చేసిందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?

రెండు కలర్ ఆప్షన్లలో లావా బ్లేజ్ ప్రో :
లావా బ్లేజ్ ప్రో 5జీ వేరియంట్.. భారత మార్కెట్లో సెప్టెంబర్ 26 మధ్యాహ్నం 12 గంటలకు యూట్యూబ్ వీడియో ద్వారా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే హ్యాండ్‌సెట్ డిజైన్, స్పెసిఫికేషన్‌లను వెల్లడించే ఈ ఫోన్ బ్లాక్, ఆఫ్-వైట్ షేడ్ అనే 2 కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

Lava Blaze Pro 5G Confirmed to Launch in India on September 26, Design, Colour Options Teased

Lava Blaze Pro 5G Launch Date in India

డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, LED ఫ్లాష్‌తో 2 వృత్తాకార కెమెరా మాడ్యూల్స్‌లో ఉండనుంది. యూనిట్ 50MP ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ దిగువన Lava 5G బ్రాండింగ్ ఉంటుంది. అదనంగా, టీజర్‌లో లావా బ్లేజ్ ప్రో 5G డిజైన్ వివరాలు, ఫ్లాట్ ఎడ్జ్‌లు, 3.5mm ఆడియో జాక్, మైక్రోఫోన్, USB టైప్-C పోర్ట్, దిగువన స్పీకర్ గ్రిల్ ఉన్నాయి. కంపెనీ ఇంకా మరిన్ని వివరాలను వెల్లడించలేదు.

లావా బ్లేజ్ ధర (అంచనా) :
అయితే, హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 6020 SoC వంటి స్పెసిఫికేషన్‌లు ఇటీవల లీక్ అయ్యాయి. లావా బ్లేజ్ ప్రో 5G కూడా రూ. 15వేల ధరలో ఉండే అవకాశం ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో లావా బ్లేజ్ ప్రో 4G వేరియంట్ 4GB RAM + 64GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర 10,499కు రిలీజ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ HD+ (720×1,600 పిక్సెల్‌లు) రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల 2.5D కర్వ్డ్ IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆక్టా-కోర్ MediaTek Helio G37 SoC ద్వారా పవర్ అందిస్తుంది. 5,000mAh బ్యాటరీతో వచ్చింది.

Read Also : Elon Musk Video Game : ఎలన్ మస్క్ గేమర్ కూడా.. 13ఏళ్లకే వీడియో గేమ్స్ క్రియేట్ చేశాడు.. మ్యాగజైన్‌కు గేమ్ ఎంతకు అమ్మేశాడంటే..?