Maruti Suzuki Swift CNG : కొత్త కారు కావాలా? మారుతి కొత్త స్విఫ్ట్ సీఎన్‌జీ వచ్చేసింది.. ఫీచర్లు, ధర వివరాలివే..!
Maruti Suzuki Swift CNG Launch : కొత్త స్విఫ్ట్ సీఎన్‌జీ గత మోడల్ కన్నా 32.85 కిలోమీటర్/కిలోగ్రామ్ వద్ద 6శాతం మెరుగైన మైలేజీని అందిస్తుంది. భారత అత్యంత ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా మారిందని మారుతి కంపెనీ పేర్కొంది.

Maruti Suzuki Swift CNG launched in India at Rs 8.19 lakh
Maruti Suzuki Swift CNG Launch : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం, దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా స్విఫ్ట్ సీఎన్‌జీ కారును లాంచ్ చేసింది. భారత మార్కెట్లో ఈ మోడల్ కారు రూ. 8.19 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రవేశపెట్టింది. ఈ కొత్త అవతార్‌లో, స్విఫ్ట్ సీఎన్‌జీ మెరుగైన ఇంధన సామర్థ్యం, అదనపు వేరియంట్‌ను కలిగి ఉంది. స్విఫ్ట్ సీఎన్‌జీతో ఇప్పుడు పోర్ట్‌ఫోలియోలో 14 సీఎన్‌జీ మోడల్‌లను కలిగి ఉంది.
Read Also : Honor 200 Lite Launch : హానర్ నుంచి సరికొత్త ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 19నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
మారుతి సుజుకి స్విఫ్ట్ పెట్రోల్‌ను లాంచ్ చేసిన 4 నెలల తర్వాత మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ మార్కెట్లోకి ప్రవేశించింది. నాల్గో జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ మే 2024లో మార్కెట్లో ప్రవేశపెట్టింది. కొత్త స్విఫ్ట్ సీఎన్‌జీ 1.2-లీటర్ జెడ్-సిరీస్ డ్యూయల్ వివిటీ ఇంజన్ ఉంది. గరిష్టంగా 69.75పీఎస్ పవర్, 101.8ఎన్ఎమ్ పీక్ ట్విస్టింగ్ ఫోర్స్‌ను అభివృద్ధి చేస్తుంది. పాత స్విఫ్ట్ సీఎన్‌జీ 77.5పీఎస్, 98.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ ఎంటీతో ట్రాన్స్మిషన్ ఆప్షన్ మునుపటి మాదిరిగానే ఉంటుంది.
కొత్త స్విఫ్ట్ సీఎన్‌జీ గత మోడల్ కన్నా 32.85 కిలోమీటర్/కిలోగ్రామ్ వద్ద 6శాతం మెరుగైన మైలేజీని అందిస్తుంది. భారత అత్యంత ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా మారిందని మారుతి కంపెనీ పేర్కొంది. పాత స్విఫ్ట్ సీఎన్‌జీ విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ వేరియంట్‌లను కలిగి ఉండగా, కొత్త స్విఫ్ట్ అదనపు విఎక్స్ఐ (ఓ) వేరియంట్‌ను కలిగి ఉంది. వేరియంట్-టు-వేరియంట్, స్విఫ్ట్ సీఎన్‌జీ పెట్రోల్ కౌంటర్ కన్నా రూ. 90వేలు ఎక్కువ. ఈ వేరియంట్‌ల వారీగా మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్‌జీ ధరలు (ఎక్స్-షోరూమ్) కింది విధంగా ఉన్నాయి.
వేరియంట్ ధర
స్విఫ్ట్ విఎక్స్ఐ సీఎన్‌జీ రూ.8.19 లక్షలు
స్విఫ్ట్ విఎక్స్ఐ (ఓ) సీఎన్‌జీ రూ.8.46 లక్షలు
స్విఫ్ట్ జెడ్‌ఎక్స్ఐ సీఎన్‌జీ రూ.9.19 లక్షలు
స్విఫ్ట్ సీఎన్‌జీ 7-అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, సుజుకి కనెక్ట్ సూట్, బ్యాక్ ఏసీ వెంట్‌లు, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు, 6ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్+ (ESP), హిల్ హోల్డ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. పండుగ సీజన్ డిమాండ్‌ను తీర్చే ఈ కారును ఫస్ట్ గుజరాత్‌లో అందించనున్నారు. స్విఫ్ట్ సీఎన్‌జీని మారుతి సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ కింద అన్నీ కలిపి నెలవారీ రుసుముతో పొందవచ్చు.
దీని ధర రూ. 21,628 నుంచి ప్రారంభమవుతుంది. థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ మొత్తం అమ్మకాలలో సీఎన్‌జీ వేరియంట్‌లు 15శాతం వాటాను కలిగి ఉండగా, మారుతి కొత్త స్విఫ్ట్‌లోని సీఎన్‌జీ వేరియంట్‌ల నుంచి అధిక వాటాను ఆశిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం సీఎన్‌జీ విక్రయాలను 6లక్షల యూనిట్లకు చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.