Maruti Suzuki Swift : 2023లో దుమ్మురేపిన మారుతి సుజుకి.. భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన స్విఫ్ట్ కారు..!
Maruti Suzuki Swift : 2023 ఏడాదిలో మారుతి సుజుకి అమ్మకాల్లో ముందంజలో నిలిచింది. ప్రత్యేకించి భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో మారుతి స్విఫ్ట్ మోడల్స్ 203,500 యూనిట్లను విక్రయించింది.

Maruti Suzuki Swift was the largest selling car in India in 2023
Maruti Suzuki Swift : దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి స్విఫ్ట్ క్యాలెండర్ ఇయర్ (CY) 2023లో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి సుజుకి వ్యాగన్ఆర్, మారుతి సుజుకి బాలెనో వంటి వాటిని అధిగమించింది. మారుతి సుజుకి ఇండియా (CY23)లో 203,500 యూనిట్ల స్విఫ్ట్‌లను విక్రయించింది. మారుతి స్విఫ్ట్ ధర రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.03 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు పొందవచ్చు. ఏది ఏమైనప్పటికీ, జనవరిలో మారుతి మొత్తం పోర్ట్‌ఫోలియోలో పెంపును ఇప్పటికే ప్రకటించినందున కార్ల ధరలు పెరగనున్నాయి.
Read Also : Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15పై న్యూ ఇయర్ డిస్కౌంట్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధర ఎంతంటే?
త్వరలో మరో కొత్త స్విప్ట్ మోడల్ :
మారుతి స్విఫ్ట్ 1.2-లీటర్ కె-సిరీస్ డ్యూయల్-జెట్ డ్యూయల్-వివిటీ పెట్రోల్ ఇంజన్ ఉంది. 89.7పీఎస్ గరిష్ట శక్తిని 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. 5-స్పీడ్ ఎంటీ లేదా 5-స్పీడ్ ఎఎంటీతో జత చేయవచ్చు. 5-స్పీడ్ ఎంటీతో సీఎన్జీ ఆప్షన్ (77.5పీఎస్ 98.5ఎన్ఎమ్) కూడా ఉంది. మారుతి ఇండియా కొత్త స్విఫ్ట్‌ను 2024లో లాంచ్ చేయనుంది. ఈ కారు ఇప్పటికే టెస్టింగ్ దశలో ఉంది.
కొత్త మోడల్‌ను మొదట జపాన్ మొబిలిటీ షో 2023లో ‘కాన్సెప్ట్’గా ప్రదర్శించారు. అయితే, ఈ కారు ఉత్పత్తికి దాదాపు సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. భారత మార్కెట్లో కార్ల తయారీదారు కొత్త ఉత్పత్తులు, చిన్న మోడల్ మార్పులు, అప్గ్రేడ్ల పరంగా 2024లో ఆవిష్కరించనున్నట్టు మారుతి మార్కెటింగ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.

Maruti Suzuki Swift
త్వరలో భారతీయ మార్కెట్లోకి :
ఈ ఏడాదిలో మారుతి సుజుకి కొత్త కార్లను ఆవిష్కరించనుంది. మారుతి సుజుకి స్విఫ్ట్ నెక్స్ట్ జనరేషన్ మోడల్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ కారు ఇప్పటికే జపాన్ మార్కెట్లో లాంచ్ అయింది. భారతీయ కస్టమర్ల కోసం మారుతి సుజుకీ స్విఫ్ట్ త్వరలో రానుంది. స్వల్ప మెకానికల్ మార్పులతో ఎక్స్టీరియర్ డిజైన్, ఇంటీరియర్ ఉండనున్నాయి.
డ్యూయల్ సెన్సార్ బ్రేక్ సపోర్ట్, కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉండనున్నాయి. జెడ్-సిరీస్ ఇంజిన్‌తో రానుంది. ప్రస్తుతం 1.2-లీటర్ కె-సిరీస్ పవర్ ట్రెయిన్ కు ప్రత్యామ్నాయంగా వస్తోంది.
Read Also : Apple Watch Series 9 : ఆపిల్ వాచ్ సిరీస్ 9పై రూ. 6వేలు తగ్గింపు.. ఈ డీల్ ఎలా పొందాలంటే?