Mark Zuckerberg Phone : మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వాడే ఫోన్ ఇదేనట.. ఐఫోన్ మాత్రం కాదు.. అదేంటో తెలుసా? చెప్పుకోండి చూద్దాం..!

Mark Zuckerberg Phone : మెటా సీఈఓ (Facebook) CEO మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల సంగీత కచేరీకి ముందు ఫోన్‌లో ఇమెయిల్‌లను చెక్ చేస్తూ కనిపించాడు. ఇంతకీ జుకర్‌బర్గ్ ఏ ఫోన్ వాడుతాడు అనేది అందరిలో ఆసక్తి నెలకొంది.

Mark Zuckerberg Phone : మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ వాడే ఫోన్ ఇదేనట.. ఐఫోన్ మాత్రం కాదు.. అదేంటో తెలుసా? చెప్పుకోండి చూద్దాం..!

Meta CEO Mark Zuckerberg uses this smartphone, and it is not an iPhone

Mark Zuckerberg Phone : సాధారణంగా స్మార్ట్‌ఫోన్ ప్రతిఒక్కరూ వాడుతుంటారు. అయితే, టెక్ దిగ్గజ కంపెనీల సీఈఓలు ఏయే ఫోన్లను వాడుతారు అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ నుంచి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కాస్టలీ ఫోన్లను వాడుతారని తెలుసు. అయితే, అందులో ఏ బ్రాండ్ ఫోన్ వాడుతారు అనేది తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంటుంది. అది ఆపిల్ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్లను వాడుతారా? రెండింటిలో ఏది బెటర్ అనేది ప్రతి ఒక్కరి మనసులో ఆసక్తిని రేకెత్తించే ప్రశ్న..

టాప్ టెక్ సీఈఓలు ఏ ఫోన్‌ని ఉపయోగిస్తున్నారు? ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ సొంత బ్రాండ్ ఐఫోన్ వాడుతారని అనుకుంటారు. అలాగే, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కంపెనీ సొంత బ్రాండ్ పిక్సెల్‌ ఫోన్ తీసుకువెళతాడు. ఎందుకంటే.. ఇద్దరు సీఈఓలకు సొంత బ్రాండ్ ఫోన్లు ఉన్నాయి. కానీ, ఇప్పటివరకూ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలో ప్రత్యక్షంగా ఎంట్రీ ఇవ్వని ఇతర ఎగ్జిక్యూటివ్‌ల విషయానికి వస్తే.. వారు ఏ ఫోన్‌ను ఇష్టపడతారో తెలుసుకోవడం ఆసక్తికరంగానే ఉంటుంది.

Read Also : Lava Yuva 2 : రూ. 6,999కే లావా యువా 2 కొత్త ఫోన్.. ఏఐ కెమెరా ఫీచర్లు.. కొంటే ఈ ఫోన్ కొనాలి!

ఇటీవల, (Meta CEO) మార్క్ జుకర్‌బర్గ్ ఒక పబ్లిక్ ఈవెంట్‌లో తన స్మార్ట్‌ఫోన్‌తో బిజీగా కనిపించాడు. అతని చేతుల్లో ఏ బ్రాండ్ ఫోన్ ఉందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం.. జుకర్‌బర్గ్ ఆండ్రాయిడ్ OS పట్ల తన ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. అతను శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించినట్లు పేర్కొన్నాడు. చాలా ఇంటర్వ్యూలలో, జుకర్‌బర్గ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లపై తన ఆసక్తిని కూడా వెల్లడించాడు.

దాంతో శాంసంగ్ ఫోన్లను జుకర్‌బర్గ్ వాడుతాడనే విషయం ప్రపంచానికి తెలిసింది. వాస్తవానికి, 2020లో, MKBHD అని పిలిచే యూట్యూబర్ మార్క్వెస్ బ్రౌన్లీకి జుకర్‌బర్గ్ కాల్ చేసాడు. ఆ ఫోన్ కాల్ సమయంలో తన జేబులో ఏ ఫోన్ ఉంది అని అడిగారు. దానికి, ఫేస్‌బుక్ సీఈఓ ఇలా బదులిచ్చారు. ‘నేను కొన్ని ఏళ్లుగా శాంసంగ్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నాను. శాంసంగ్ ఫోన్లకు పెద్ద అభిమానిని. అలాంటి ఫోన్లను తీసుకురావాలని భావిస్తున్నాను’ అని అన్నారు.

Meta CEO Mark Zuckerberg uses this smartphone, and it is not an iPhone

Mark Zuckerberg Phone : Mark Zuckerberg uses this smartphone, and it is not an iPhone

అయితే, మెటా సీఈఓ మార్క్.. ప్రస్తుత రోజువారీ ఫోన్ విషయానికి వస్తే.. ఇప్పటికీ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లపై ఇష్టం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇటీవల, జుకర్‌బర్గ్ టేలర్ స్విఫ్ట్ కచేరీకి వెళుతున్నప్పుడు తన ఫోన్‌ని చెక్ చేస్తున్న ఫొటోను పోస్ట్ చేశాడు. ‘కచేరీకి వెళ్లే మార్గంలో 13 ఇమెయిల్‌లను చెక్ చేస్తున్నాను’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

ఆ ఫొటోలో టెక్ బిలియనీర్ బ్లాక్ కలర్ వేరియంట్‌లో ప్రీమియం శాంసంగ్ S సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నట్లు కనిపించింది. ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని పూర్తి చేసిన తర్వాత జుకర్‌బర్గ్ కొన్ని వారాల క్రితం మరో ఫొటోను షేర్ చేశాడు. అందులో మిర్రర్ సెల్ఫీని పోస్ట్ చేశాడు. అందులో వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్న అదే (Samsung S) సిరీస్ ఫోన్‌ని ఉపయోగించి తన ఫొటో తీయడం కనిపించింది.

అతను శాంసంగ్‌లో ఏ సిరీస్‌ని ఉపయోగిస్తున్నాడో స్పష్టంగా తెలియదు.. స్మార్ట్‌ఫోన్ కలర్, కర్వడ్ ఎడ్జ్ ఆధారంగా అది (Samsung Galaxy S21) లేదా (Samsung Galaxy S21+) లేదా (Samsung S22)గా కనిపిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మరింత ప్రత్యేకంగా (Samsung Galaxy S22) సిరీస్‌కు చెందినది కావచ్చు. ఎందుకంటే.. S21లో కనిపించే కలర్, కర్వడ్ ఎడ్జ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ S21 ఫొటో మాదిరిగా అనిపించినప్పటికీ, S22 సిరీస్ ప్రస్తుత టైమ్‌లైన్‌కు అనుగుణంగా ఉంటుంది.

Read Also : OnePlus Nord CE 3 5G Sale : ఆగస్టు 4 నుంచి వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫస్ట్ సేల్.. తక్కువ ధరకు కొత్త ఫోన్ పొందాలంటే..!