PAN Aadhaar Linking : మీ పాన్-ఆధార్ కార్డుతో ఇంకా లింక్ చేయలేదా? పాన్ కార్డు ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్!
PAN Aadhaar linking : మీ ఆధార్‌తో పాన్ లింక్ చేశారా? గడువు తేదీ జూన్ 30 ముగిసిన తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్ కార్డ్‌లు పని చేయవు. పాన్ కార్డు నిర్దిష్ట సర్వీసులను యాక్సస్ చేయలేదని గమనించాలి. పాన్ కార్డు ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?

Missed due date for PAN Aadhaar linking_ Here’s what you should do next
PAN Aadhaar Linking : ఆధార్ కార్డు, పాన్ కార్డులను లింక్ చేసే గడువు తేదీ జూన్ 30, 2023తో ముగిసింది. కేంద్ర ప్రభుత్వం ఈసారి పాన్ ఆధార్ లింక్ గడువును పొడిగించే విషయాన్ని ప్రకటించలేదు. వినియోగదారులు తమ పాన్ కార్డుతో ఆధార్‌ను లింక్ చేయడంలో విఫలమైతే.. ఇకపై తమ పాన్‌ను ఉపయోగించలేరు. ఎందుకంటే.. మీ పాన్ కార్డు పని చేయదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) మార్గదర్శకాల ప్రకారం.. గడువు తేదీలోపు పాన్ హోల్డర్లందరూ ఆధార్ నెంబర్లతో లింక్ చేయడం తప్పనిసరి. ఆధార్‌తో లింక్ చేయని పాన్ కార్డులు జూలై 1, 2023 నుంచి పనిచేయవు.
పాన్ కార్డు పనిచేయకపోతే ఏమవుతుంది? :
* ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక సర్వీసులకు సంబంధించిన అనేక కార్యకలాపాలను చేయలేరు. మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే మరిన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..
* ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ (ITR) ఫైలింగ్ చేసేందుకు పనిచేయని పాన్ కార్డుకు అనుమతి ఉండదు.
* డిఫాల్టర్ పెండింగ్ రిటర్న్‌లు ప్రాసెస్ చేయడం కుదరదు.
* పని చేయని పాన్ కార్డులతో పెండింగ్‌లో ఉన్న రీఫండ్ అమౌంట్ జారీ కాదు.
* పనిచేయని పాన్‌తో మీరు బ్యాంకు లావాదేవీలు, రుణాలను పొందడంలో అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు.
* పాన్ ఆధార్ లింక్ గడువును దాటినప్పటికీ.. మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసేందుకు, మీ పనికిరాని పాన్‌ను మళ్లీ యాక్టివేట్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
పనిచేయని పాన్‌ని మళ్లీ యాక్టివేట్ చేయడం ఎలా? :
ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి గడువు ముగిసిన తర్వాత కూడా మీ పాన్ కార్డును మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ, ఇందుకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. పేర్కొన్న అథారిటీకి ఆధార్‌ను బహిర్గతం చేసి రూ. 1,000 అపరాధ రుసుము చెల్లించిన తర్వాత 30 రోజుల్లో పాన్ మళ్లీ యాక్టివ్ చేసుకోవచ్చు. అందువల్ల, ఎవరైనా జూలై 3న అభ్యర్థనను పెడితే.. రుసుము చెల్లించిన తర్వాత ఆగస్టు 2 నాటికి PAN మళ్లీ పనిచేస్తుంది. అంతేకాదు.. రెండు డాక్యుమెంట్లను లింక్ చేసినందుకు వినియోగదారులు పెనాల్టీ చెల్లించిన సందర్భాల్లో పాన్ పనిచేయకపోతే ఆయా అభ్యర్థనలను పరిశీలిస్తామని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది.
పాన్, ఆధార్ లింక్ పెనాల్టీ ఎలా చెల్లించాలి? :
1. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయండి.
2. డాష్‌బోర్డ్‌లో, ప్రొఫైల్ సెక్షన్‌లో లింక్ ఆధార్‌పై క్లిక్ చేయండి.
3. మీ పాన్, ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
4. ఈ-పే ట్యాక్స్ ద్వారా చెల్లించడానికి Continue క్లిక్ చేయండి.
5. OTPని పొందడానికి మీ PAN, మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
6. OTP వెరిఫై తర్వాత e-Pay Tax పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. Continue బటన్‌పై Click చేయండి.
7. AY 2024-25, ఇతర రసీదులు (500)గా పేమెంట్ టైప్ ఎంచుకోండి. ఇప్పుడు Continue పై క్లిక్ చేయండి.
8. ఫీజు చెల్లింపు తర్వాత మీరు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయవచ్చు.

Missed due date for PAN Aadhaar linking
పాన్-ఆధార్ లింక్ ఎందుకు తప్పనిసరి? :
భారత ప్రభుత్వం కొన్ని సర్వీసులకు పాన్, ఆధార్ లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. పాన్-ఆధార్ అనుసంధానం పన్ను ఎగవేతను నిరోధించడానికి సాయపడుతుంది. పాన్, ఆధార్‌లను లింక్ చేయడం ద్వారా, పన్ను చెల్లింపుదారులందరిని వెంటనే గుర్తించవచ్చు. వారి పన్నులు సరిగ్గా చెల్లిస్తున్నారని ప్రభుత్వం నిర్ధారించవచ్చు.
పాన్-ఆధార్ లింకింగ్ మోసాన్ని కూడా నివారించవచ్చు. ఈ రెండు గుర్తింపు సంఖ్యలను లింక్ చేయడం ద్వారా, వ్యక్తులు తమ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. స్కామర్‌లు మల్టీ బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేయకుండా నిరోధించవచ్చు లేదా ఫేక్ ఐడీలను ఉపయోగించి మల్టీ పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయవచ్చు. చివరగా పాన్-ఆధార్ లింక్‌తో ప్రభుత్వం పన్నుల దాఖలు, పన్ను చెల్లింపుల ప్రక్రియను క్రమబద్ధీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పాన్, ఆధార్ లింక్ చేయకపోతే కలిగే పరిణామాలివే :
ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం.. మినహాయింపు వర్గంలోకి రాని పాన్ హోల్డర్లందరూ తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. అలా చేయడంలో విఫలమైతే పాన్ పనిచేయదు. అదనంగా, పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోవడం వల్ల అనేక పరిణామాలు ఉంటాయి. ఉదాహరణకు, మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITRలు) ఫైల్ చేయలేరు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేరు. నిర్దిష్ట ఆర్థిక ఉత్పత్తులలో పెట్టుబడి పెట్టలేరు. అదనంగా, మీ సేవింగ్స్ వడ్డీపై అధిక పన్ను మినహాయింపు రేటును కూడా పొందవచ్చు.