మొబైల్స్ బొనాంజా సేల్ : స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు.. డిస్కౌంట్లు
సమ్మర్ స్పెషల్ గా స్మార్ట్ మొబైల్ సేల్స్ సందడి జోరుగా కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ లవర్స్ అంతా కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన బ్రాండ్ ఫోన్లు కొనేందుకు ఎగబడుతున్నారు.

సమ్మర్ స్పెషల్ గా స్మార్ట్ మొబైల్ సేల్స్ సందడి జోరుగా కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ లవర్స్ అంతా కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన బ్రాండ్ ఫోన్లు కొనేందుకు ఎగబడుతున్నారు.
సమ్మర్ స్పెషల్ గా స్మార్ట్ మొబైల్ సేల్స్ సందడి జోరుగా కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ లవర్స్ అంతా కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన బ్రాండ్ ఫోన్లు కొనేందుకు ఎగబడుతున్నారు. ఇప్పటికే మొబైల్ స్టోర్లు, ఆన్ లైన్ ఈ కామర్స్ వెబ్ సైట్లలో భారీ సేల్స్ నడుస్తోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న కొత్త స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తున్నారు. ప్రముఖ ఆన్ లైన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, MI అధికారిక వెబ్ సైట్లో కొత్త స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తున్నాయి.
మార్చి 25 (మధ్యాహ్నం 2 గంటల నుంచి మార్చి 28వరకు (నాలుగు రోజుల పాటు) మొబైల్ బొనాంజా సేల్ కొనసాగనుంది. ఈ సందర్భంగా స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులు EMI పై కొనుగొలు చేస్తే.. 5 శాతం అదనంగా ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. యాక్సస్ బ్యాంకు క్రెడిట్ కార్డు యూజర్లకు ఈఎంఐ స్కీమ్ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాదండోయ్.. మీ పాత మొబైల్ ఎక్సేంజ్ చేసుకుంటే.. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై అదనంగా రూ.500 తగ్గింపు ఉంటుంది.
Flipkart, mi.com వెబ్ సైట్లో.. ఏ స్మార్ట్ ఫోన్ కొంటే ఎంత ఆఫర్.. డిస్కౌంట్ ఉందంటే..?
షియోమీ రెడ్ మి నోట్ 6 ప్రొ : ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.10వేల 999 గా ఉంది. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. షియోమీ ప్లాగ్ షిప్ షియోమీ పోకో ఎఫ్1 డివైజ్ పై.. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ అందిస్తోంది. ఈ ఫోన్ రిటైలర్ ధర రూ.20వేల 999 నుంచి అందుబాటులో ఉంది. షియోమీ రెడ్ మి 6 ఫోన్ ప్రారంభ ధర రూ.7వేల 499 నుంచి అందుబాటులో ఉంది.
రియల్ మి స్టార్ట్ ఫోన్ : ఫ్లిప్ కార్ట్ అందించే ఈ సేల్ ఆఫర్లలో రియల్ మి సిరీస్ ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
* అందులో ఒకటి.. రియల్ మి2 ప్రొ, రియల్ మి సి1 (2019),రియల్ మి3. రియల్ మి2 ప్రొ.. ఫోన్ ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునే ఉన్నాయి.
* ఈ డివైజ్ పై స్నాప్ డ్రాగన్ 660 ప్రాసిసెర్, డ్యుయల్ రియర్ కెమెరా ఆప్షన్ ఉంది. దీని ప్రారంభ ధర రూ.11వేల 990 నుంచి అందుబాటులో ఉంది.
* రియల్ మి సి1 (2019) స్మార్ట్ ఫోన్ 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీతో ధర రూ.7వేల 499లకే సొంతం చేసుకోవచ్చు.
రియల్ మి3 ఫ్లాష్ సేల్ : ఇటీవలే ఇండియన్ మార్కెట్ లో 4230 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగిన రియల్ మి3 కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేశారు. ఈ డివైజ్ కూడా మొబైల్ బొనాంజా సేల్ లో ఉంది. అయితే ఈ ఫోన్ మార్చి 26 నుంచి మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో సేల్ ప్రారంభం కానుంది. దీని ప్రారంభ ధర రూ.8వేల 999.
హానర్ 9ఎన్ : ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఫీచర్లలో 4జీబీ ర్యామ్, 16ఎంపీ సెల్ఫీ కెమెరా స్పెషల్ ఎట్రాక్షన్. హానర్ సిరీస్ అందించే ఈ కొత్త ఫోన్ ధర రూ.8వేల 499కే సొంతం చేసుకోవచ్చు. అసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1, జెన్ ఫోన్ మ్యాక్స్ ఎం2 ఫోన్లు కొనుగోలు చేస్తే.. డిస్కౌంట్ పై రూ.7వేల 999కే పొందొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎ50 : గెలాక్సీ ఎ30, గెలాక్సీ ఎ10 సిరీస్ ఫోన్లను సొంతం చేసుకోవాలంటే.. అల్ట్రా వైడ్ వీడియో, ఇన్ఫినిటీ యూ-డిసిప్లే తో పొందొచ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.8వేల 490 నుంచి బొనాంజా సేల్స్ లో అందుబాటులో ఉంది.
ఫ్లిప్ కార్ట్ సేల్స్ లో హానర్ 9 లైట్, హానర్ 10 లైట్ స్మార్ట్ ఫోన్లను కూడా రూ.7వేల 999, రూ.11వేల 999 నుంచి అందుబాటులో ఉన్నాయి.
గమనిక : రెడ్ మి గో కొత్త స్మార్ట్ ఫోన్ కూడా ఈ సేల్ లో సొంతం చేసుకోవచ్చు. అయితే.. ఈ ఫోన్ ఫ్లాష్ సేల్ ఫ్లిప్ కార్ట్ పై మధ్యాహ్నం 2 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది.