Moto E32 : Moto కొత్త E-Series వస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

Moto E32 Smartphone : మోటోరోలా నుంచి మరో కొత్త E-Series స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఈ ఫోన్ మోడల్ లాంచ్ కావడానికి ముందే ఫీచర్లు, ధర ఎంతో లీకయ్యాయి.

Moto E32 : Moto కొత్త E-Series వస్తోంది.. లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్..!

Moto E32 Price, Renders, Specifications Leaked, Triple Rear Camera Setup And 5,000mah Battery Tipped (1)

Updated On : April 21, 2022 / 12:05 PM IST

Moto E32 Smartphone : ప్రముఖ అమెరికా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం మోటోరోలా నుంచి మరో కొత్త E-Series స్మార్ట్ ఫోన్ రాబోతోంది. అతి త్వరలో మొబైల్ మార్కెట్లోకి Moto E32 కొత్త ఫోన్ లాంచ్ చేసేందుకు మోటోరోలో కంపెనీ ప్లాన్ చేస్తోంది. అయితే లాంచింగ్ ముందే ఈ కొత్త ఫోన్ ఫీచర్లు, ధర ఆన్ లైన్‌లో లీకయ్యాయి. ఈ ఏడాది 2022లో దాదాపు 20 స్మార్ట్ ఫోన్ లాంచడమే లక్ష్యంగా కంపెనీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే Motorola ఇటీవలే G సిరీస్‌కి G22, G52 మోడల్ ఫోన్లను రిలీజ్ చేసింది. భారత్ సహా ఇతర దేశాల మార్కెట్లో మరో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది. అందులో ఒకటి Moto E-Series స్మార్ట్ ఫోన్.. Moto E32 పేరుతో రానున్న ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధరకు సంబంధించి వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

ప్రస్తుతం మోటోరోలా కంపెనీ.. Moto E32, Motorola Edge 30ని కూడా లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు టిప్‌స్టర్ సుధాన్షు ఆంబోర్, బెస్టోపీడియా (Bestopedia)తో కలిసి Moto E32 ఫీచర్లను లీక్ చేసింది. లీకైన డేటా ప్రకారం.. Moto E32 ఫోన్ డిజైన్ పరంగా Moto G22ని మాదిరిగా ఉంటుంది. మొబైల్ మోడల్ చూస్తే.. వెనుక ప్యానెల్ దీర్ఘచతురస్రాకార కెమెరాతో రానుంది. ఇక మాడ్యూల్‌లో LED ఫ్లాష్‌లైట్‌తో పాటు 3 కెమెరా సెన్సార్లు ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ డిస్‌ప్లే పరిశీలిస్తే.. సెల్ఫీల కోసం కెమెరా పంచ్-హోల్ కటౌట్‌ అమర్చారు. సన్నని బెజెల్‌ మాదిరిగా ఉన్నప్పటికీ కాస్తా మందంగా బరువుగా ఉంటుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండే అవకాశం ఉంది. వాల్యూమ్ రాకర్ పవర్ బటన్ డివైజ్ కుడి వైపున కనిపిస్తున్నాయి. USB టైప్ C పోర్ట్ స్పీకర్ గ్రిల్ కూడా కిందిభాగంలో కనిపిస్తున్నాయి.

Moto E32 Price, Renders, Specifications Leaked, Triple Rear Camera Setup And 5,000mah Battery Tipped (2)

Moto E32 Price, Renders, Specifications Leaked, Triple Rear Camera Setup And 5,000mah Battery Tipped

Moto E32 ఫీచర్లు (అంచనా) :
టిప్‌స్టర్ ప్రకారం.. Moto E32 6.6-అంగుళాల FULL HD+ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 12nm ఆర్కిటెక్చర్‌తో MediaTek Helio G85 ఉండొచ్చు. స్మార్ట్‌ఫోన్ Android 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుందని భావిస్తున్నారు. Moto E32 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీతో రానుంది. ఇక కెమెరా విభాగంలో.. Moto E32 50-MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ స్నాపర్ 2MP మాక్రో లేదా డెప్త్ సెన్సార్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇక ధర విషయానికి వస్తే రూ.11వేల రేంజ్ లో ఉంటుందని అంచనా..

ఐరోపా మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అధికారికంగా లాంచ్ కానుంది. మోటరోలా ఇటీవలి కాలంలో యూరప్‌లో రిలీజ్ చేసిన అన్ని ఫోన్లను భారత మార్కెట్లోనూ లాంచ్ చేస్తోంది. ఈ కొత్త Moto E32 స్మార్ట్ ఫోన్ భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. Moto E32 ఫోన్ మాత్రమే కాకుండా Motorola Edge 30 కూడా లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. Motorola Edge 30 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778 ప్లస్ ప్రాసెసర్‌తో రానుంది. ఇక ఫోన్ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు చేసేలా ఉంది.

Read Also :   Top 5 Smartphones : మార్కెట్లో ఈ ఫోన్లకే ఫుల్ డిమాండ్.. టాప్‌ 5 స్మార్ట్‌ ఫోన్‌లు మీకోసం.. ఏ ఫోన్ బెస్ట్ అంటే?