Moto G04 and G24 Series : కొత్త ఫోన్ కొంటున్నారా? భారీ బ్యాటరీతో మోటో జీ04, జీ24 సిరీస్ లాంచ్.. ధర, స్పెషిఫికేషన్లు వివరాలివే..!
Moto G04 and G24 Series Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మోటోరోలా నుంచి రెండు సరికొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 5000ఎంఎహెచ్ బ్యాటరీతో వచ్చాయి. ధర, స్పెషిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Moto G04 And G24 With 90Hz Refresh Rate Display
Moto G04 and G24 Series Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా కంపెనీ నుంచి రెండు సరికొత్త మోడల్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. మోటో జీ04, మోటో జీ24 మోడల్ లెనోవో యాజమాన్యంలోని బ్రాండ్ నుంచి లేటెస్ట్ జీ-సిరీస్ హ్యాండ్‌సెట్‌లుగా యూరప్‌లో లాంచ్ అయ్యాయి.
ఈ కొత్త హ్యాండ్‌సెట్‌లు హోల్-పంచ్ డిస్‌ప్లే డిజైన్, 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్‌లతో వస్తాయి. మోటో జీ04 ఫోన్ యూనిసోక్ టీ606 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. అయితే, మోటో జీ24లో మీడియాటెక్ హెలియో జీ85 చిప్‌సెట్ అమర్చి ఉంటుంది. రెండు హ్యాండ్‌సెట్‌లు 5,000ఎంఎహెచ్ బ్యాటరీ యూనిట్‌ల ద్వారా అందిస్తాయి.
మోటో జీ04, మోటో జీ24 ధర, లభ్యత :
మోటో జీ04 ఫోన్ ధర బేస్ 4జీబీ+ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ఈయూఆర్ 119 (దాదాపు రూ. 10,600) నుంచి ప్రారంభమవుతుంది. కాంకర్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ, సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. మోటో జీ24 ఫోన్ 4జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ఈయూఆర్ 129 (దాదాపు రూ. 11,600)గా ఉంది. బ్లూబెర్రీ, మ్యాట్ చార్‌కోల్, ఐస్ గ్రీన్, పింక్ లావెండర్ షేడ్స్‌లో లభిస్తుంది. మోటోరోలా మోటో జీ04, మోటో జీ24 మోడల్ రాబోయే వారాల్లో లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆసియా-పసిఫిక్‌లలో మార్కెట్లలోకి కంపెనీ వస్తాయని ధృవీకరించింది. భారత్ లాంచ్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
మోటో జీ24 స్పెసిఫికేషన్లు :
డ్యూయల్ సిమ్ (నానో) మోటో జీ24 మోడల్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత (My UX)తో అందిస్తోంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 537 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.6-అంగుళాల హెచ్‌డీ+ (720×1,600 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. సెల్ఫీ షూటర్ కోసం డిస్‌ప్లే పైభాగంలో హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంది. 4జీబీ ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియోజీ85 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. ఉపయోగించని స్టోరేజీని ఉపయోగించి అందుబాటులో ఉన్న మెమరీని వాస్తవంగా 8జీబీ వరకు విస్తరించవచ్చు.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. మోటో జీ24 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో కూడిన 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ మాక్రో సెన్సార్‌తో పాటు ఒకే ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌లు 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ద్వారా రన్ అవుతాయి. ఈ హ్యాండ్‌సెట్ 128జీబీ (eMMC 5.1) ఆన్‌బోర్డ్ స్టోరేజీని కలిగి ఉంది. దీనిని మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా 1టీబీ వరకు విస్తరించవచ్చు.

Moto G04 And G24 Launch
మోటో జీ24లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 4జీ వోల్ట్ (VoLTE), వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్/ఎ-జీపీఎస్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఐపీ52 స్ప్లాష్ రెసిస్టెన్స్‌ని కలిగి ఉంది. మోటో జీ24 15డబ్ల్యూ టర్బోపవర్ ఛార్జింగ్‌తో కూడిన 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 163x75x7.99ఎమ్ఎమ్ కొలతలు, 180 గ్రాముల బరువు ఉంటుంది.
మోటో జీ04 స్పెసిఫికేషన్లు :
మోటో జీ04 డ్యూయల్ సిమ్ స్లాట్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత మై యూఎక్స్ రన్ అవుతుంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల హెచ్‌డీ+ (720×1,600 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ప్యానెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ హోల్ కటౌట్‌ను పొందుతుంది. హుడ్ కింద హ్యాండ్‌సెట్ యూనిసోక్ టీ606 ఎస్ఓసీ కలిగి ఉంది. మాలి జీ57 జీపీయూ, 4జీబీ ర్యామ్ కలిగి ఉంది. ఇంటర్నల్ ర్యామ్ అదనపు ఉపయోగించని స్టోరేజీని కూడా వర్చువల్‌గా 8జీబీ వరకు విస్తరించవచ్చు.
ఆప్టిక్స్ విషయానికి వస్తే.. మోటో జీ04 ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఒకే 16ఎంపీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం హ్యాండ్‌సెట్ ముందు భాగంలో 5ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది. అంతేకాదు.. 64జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీని అందిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో మోటో జీ24కి సమానంగా ఉంటాయి.
మోటో జీ04 కూడా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఐపీ52 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ డిజైన్‌ను కలిగి ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్‌లను కూడా కలిగి ఉంది. మోటో జీ04 మోడల్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో 10డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. దీని కొలతలు 163.49×74.53×7.99ఎమ్ఎమ్, బరువు 180 గ్రాములు ఉంటుంది.