Moto G64 5G Launch : రూ.15వేల లోపు ధరలో భారీ బ్యాటరీతో మోటో G64 5జీ ఫోన్ వచ్చేసింది..!

Moto G64 5G Launch : కొత్త మోటో జీ64 5జీ ఫోన్‌లో మీడియాటెక్ డైమన్షిటీ 7025 ప్రాసెసర్, 6000ఎంఎహెచ్ బ్యాటరీ, 50ఎంపీ బ్యాక్ ప్రైమరీ కెమెరా ఉన్నాయి. లేటెస్ట్ మోటో G64 5జీ ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లను వివరంగా ఓసారి పరిశీలిద్దాం.

Moto G64 5G Launch : రూ.15వేల లోపు ధరలో భారీ బ్యాటరీతో మోటో G64 5జీ ఫోన్ వచ్చేసింది..!

Moto G64 5G with Dimensity 7025 processor and 6,000mAh battery launched

Moto G64 5G Launch : రూ. 15వేల లోపు కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మోటోరోలా తన పోర్ట్‌ఫోలియోలో ఇప్పుడు కొత్త మోటో G64 5జీ ఫోన్ లాంచ్ చేసింది. మోటరోలా తమ కస్టమర్ల కోసం అన్ని ధరల విభాగాలలో కొత్త ఫోన్లను లాంచ్ చేస్తోంది. గత ఫిబ్రవరిలో వేగవంతమైన ప్రాసెసర్‌తో కూడిన సరసమైన ఆండ్రాయిడ్ ఫోన్ ఎంట్రీ-లెవల్ G04 ప్రవేశపెట్టింది.

గత మార్చిలో కంపెనీ ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను కోరుకునే యూజర్ల కోసం మోటో ఎడ్జ్ 50 ప్రోని కూడా లాంచ్ చేసింది. కొత్త మోటో జీ64 5జీ ఫోన్‌లో మీడియాటెక్ డైమన్షిటీ 7025 ప్రాసెసర్, 6000ఎంఎహెచ్ బ్యాటరీ, 50ఎంపీ బ్యాక్ ప్రైమరీ కెమెరా ఉన్నాయి. లేటెస్ట్ మోటో G64 5జీ ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లను వివరంగా ఓసారి పరిశీలిద్దాం.

Read Also : Apple iPhone 15 Sale : ఆపిల్ ఐఫోన్ 15పై ఏకంగా రూ.50వేలు తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

మోటో జీ64 5జీ ధర ఎంతంటే? :
మోటోరోలా కొత్త మోటో జీ64 5జీ ఫోన్ మొత్తం 2 ధరల వేరియంట్లలో వస్తుంది. 8జీబీ ర్యామ్/128జీబీ వేరియంట్ ధర రూ. 14,999 కాగా, 12జీబీ ర్యామ్/ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999కు పొందవచ్చు. అయితే, మోటో కూడా లాంచ్ ఆఫర్లను అందిస్తోంది. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 1,100 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, ఫుల్ స్వైప్ లావాదేవీలు లేదా ఈఎంఐ లావాదేవీల ద్వారా పొందవచ్చు.

ఈ నెల 16 నుంచి అందుబాటులోకి :
ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్ఛేంజ్ విలువపై రూ. వెయ్యి అదనపు ఆఫర్లు పొందవచ్చు. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ. 13,999, 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.15,999కు పొందవచ్చు. అదనంగా, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్/డెబిట్ కార్డ్ యూజర్లు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కింద నెలకు రూ. 2,317 చొప్పున 6 నెలల వరకు పొందవచ్చు. మోటో జీ64 5జీ ఫోన్ ప్రత్యేకంగా Flipkart, Motorola.in, ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఏప్రిల్ 16 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ మొత్తం ఐస్ లిలక్, పెరల్ బ్లూ, మింట్ గ్రీన్ అనే మూడు కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.

మోటో జీ64 5జీ స్పెసిఫికేషన్లు :
మోటో జీ64 5జీ ఫోన్ 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. మృదువైన 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. మోటో జీ64 5జీ ఫోన్ కొలతలు 161.56 x 73.82 x 8.89ఎమ్ఎమ్, బరువు 192 గ్రాములు ఉంటుంది. హుడ్ కింద మోటో జీ64 ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 7025 చిప్‌సెట్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. 2.5 జీహెచ్‌జెడ్ ఆక్టా-కోర్ సీపీయూని కలిగి ఉంది. హుడ్ కింద జీ64 ఫోన్ 6000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 1టీబీ వరకు మైక్రో ఎస్‌డీ కార్డ్ స్టోరేజీ పెంచుకునేందుకు సపోర్టు ఇస్తుంది.

మొత్తం రెండు వేరియంట్లలో :
ఈ ఫోన్ మొత్తం 2 వేరియంట్‌లలో వస్తుంది. అందులో ఒకటి 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ఉన్నాయి. మరొకటి 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో వస్తుంది. ఆండ్రాయిడ్ 14లో ఆపరేటింగ్, మోటోరోలా 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఫోటోగ్రఫీ విషయానికొస్తే.. మోటో జీ64 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50ఎంపీ సెన్సార్ ఎఫ్/1.8 ఎపర్చరు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో పాటు 118-డిగ్రీ యాంగిల్‌ని అందించే 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంటుంది.

సెకండరీ సెన్సార్ మాక్రో, డెప్త్ ఫోటోగ్రఫీకి సపోర్టు ఇస్తుంది. అదనంగా, మోటో జీ64 స్పోర్ట్స్ స్టీరియో స్పీకర్లు, రెండు మైక్రోఫోన్‌లు, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ పోర్ట్ ఉన్నాయి. కనెక్టివిటీ ఆప్షన్లలో 14 5జీ బ్యాండ్‌లు, బ్లూటూత్ 5.3, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఐపీ52 వాటర్-రిపెల్లెంట్ డిజైన్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ మొత్తం మింట్ గ్రీన్, పెర్ల్ బ్లూ, ఐస్ లిలక్ అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ 5జీ ఫోన్‌లో NFC, వై-ఫై 802.11 a/b/g/n/ac, వాయిస్ కంట్రోల్ కోసం గూగుల్ అసిస్టెంట్ కూడా ఉన్నాయి.

Read Also : WhatsApp Online Status : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ కాంటాక్టుల్లో ఆన్‌లైన్‌లో ఉన్నవారిని ఒకేచోట చూడొచ్చు!