Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే..? ఇలాంటి ఆఫర్ మళ్లీ జన్మలో రాదు..!

Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది. భారీ ధర తగ్గింపుతో పొందవచ్చు.

Motorola Edge 50 Pro : మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే..? ఇలాంటి ఆఫర్ మళ్లీ జన్మలో రాదు..!

Motorola Edge 50 Pro

Updated On : August 3, 2025 / 4:57 PM IST

Motorola Edge 50 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా అనేక మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో (Motorola Edge 50 Pro) అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అందరి యూజర్లను ఆకట్టకునేలా ఉంది. 50MP ఫ్రంట్ కెమెరా, మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 256GB వేరియంట్ దాదాపు రూ. 30వేల ధరకు లభ్యమవుతుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ రూ. 21వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో డిస్కౌంట్ :
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో (Motorola Edge 50 Pro) రూ.41,999 ధరకు అందుబాటులో ఉంది. అయితే, ఆసక్తిగల కొనుగోలుదారులకు ప్రస్తుతం 33 శాతం తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపుతో పండుగ సీజన్‌లో కేవలం రూ.27,999కి మోటోరోలా ఫోన్‌ కొనుగోలు చేయవచ్చు. దాంతో రూ.14వేలు నేరుగా సేవ్ చేసుకోవచ్చు.

Read Also : BSNL Freedom Offer : BSNL యూజర్లకు బంపర్ ఆఫర్.. జస్ట్ రూ. 1తో రోజుకు 2GB హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, 28 రోజుల వ్యాలిడిటీ..!

పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసుకోవాలంటే అదనపు మొత్తాన్ని ఆదా చేయవచ్చు. రూ.27,150 కన్నా ఎక్కువ. ఉదాహరణకు.. మీ పాత స్మార్ట్‌ఫోన్ రూ.7వేలు ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందితే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర రూ.21వేలకి తగ్గవచ్చు. కచ్చితమైన ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, ఫిజికల్ స్టేటస్‌పై ఆధారపడి ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఫీచర్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో, ఐఫోన్‌ (Motorola Edge 50 Pro) మాదిరిగా అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంది. దుమ్ము, నీటి నిరోధకతకు IP68 రేటింగ్‌తో కూడా వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ద్వారా ప్రొటెక్ట్ చేసిన 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. బాక్స్ వెలుపల ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్ 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 50MP, 10MP, 13MP సెన్సార్‌లతో కూడిన మల్టీఫేస్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ అందిస్తుంది. స్టేబుల్ షాట్స్ కోసం ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) నుంచి పొందుతుంది.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం హై రిజల్యూషన్ 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4500mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ 125W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. అదనంగా, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ కూడా కలిగి ఉంది.