Netflix Screenshots Feature : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీకు ఇష్టమైన మూవీ సీన్ స్ర్కీన్‌షాట్ తీయొచ్చు..!
Netflix Screenshots Feature : మీరు ఏదైనా మూవీను చూస్తుంటే.. అందులో ఆసక్తికరమైన సీన్ మీకు నచ్చితే ఆ స్క్రీన్ దిగువన ఉన్న మూమెంట్స్ బటన్‌ను ట్యాప్ చేయండి. ఆ సీన్ మీ నా నెట్‌ఫ్లిక్స్ ట్యాబ్‌లో సేవ్ అవుతుంది.

Netflix will finally let you take screenshots
Netflix Screenshots Feature : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్.. మీరు చూసే ఏదైనా మూవీ సీన్ క్యాప్చర్ చేయాలనుకుంటున్నారా? మీకోసం నెట్‌ఫ్లిక్స్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. మూమెంట్స్ అనే కొత్త మొబైల్ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. మీరు ఇప్పుడు మీ ఫోన్ నుంచి సినిమాలు, షోల నుంచి మీకు ఇష్టమైన సీన్లను క్యాప్చర్ చేయవచ్చు. సేవ్ చేయవచ్చు. ఆపై షేర్ చేయవచ్చు.
ఇప్పటివరకు, నెట్‌ఫ్లిక్స్ యూజర్లు తమ డివైజ్‌లలో స్క్రీన్‌షాట్‌లను తీసుకోకుండా బ్లాక్ చేసింది. మీరు వ్యూను క్యాప్చర్ చేసేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ, మీరు బ్లాక్ స్క్రీన్‌ని పొందుతారు. ప్రపంచవ్యాప్తంగా ఐఓఎస్ యూజర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించే వీలుంది. ఇకపై ఆండ్రాయిడ్ యూజర్లు కూడా రాబోయే కొద్ది వారాల్లో ఈ ఫీచర్ యాక్సెస్‌ను పొందవచ్చు.
నెట్‌ఫ్లిక్స్ మూమెంట్స్ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే? :
మీరు ఏదైనా మూవీను చూస్తుంటే.. అందులో ఆసక్తికరమైన సీన్ మీకు నచ్చితే ఆ స్క్రీన్ దిగువన ఉన్న మూమెంట్స్ బటన్‌ను ట్యాప్ చేయండి. ఆ సీన్ మీ నా నెట్‌ఫ్లిక్స్ ట్యాబ్‌లో సేవ్ అవుతుంది. మీరు ఆ సీన్ మళ్లీ చూడవచ్చు. నెట్‌ఫ్లిక్స్ మీరు ఎపిసోడ్ లేదా మూవీని తిరిగి చూసినప్పుడల్లా మీరు సేవ్ చేసిన కచ్చితమైన మూవెంట్ నేరుగా చూసేలా సులభతరం చేసింది.
మూమెంట్స్ ఫీచర్ ద్వారా షేరింగ్ చాలా సులభం. మీరు ఒక సీన్ సేవ్ చేసిన తర్వాత దాన్ని నేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయవచ్చు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లేదా మరో ప్లాట్‌ఫారమ్ అయినా మై నెట్‌ఫ్లిక్స్ (My Netflix) ట్యాబ్ నుంచి నెట్‌ఫ్లిక్స్ మూవెంట్స్ ఫీచర్ ద్వారా వినియోగదారులకు అత్యంత ఇష్టమైన సీన్లను రీస్టోర్ చేయడం, షేర్ చేసేందుకు అనుమతిస్తుంది.
నెట్‌ఫ్లిక్స్ తదుపరి నిర్ణయం ఏంటి అనేది కచ్చితంగా సూచించలేదు. అయితే నెట్‌ఫ్లిక్స్ సేవ్ చేసిన సీన్లతో ఇంటరాక్ట్ అయ్యేలా ఫీచర్‌ను మరింతగా విస్తరించాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతానికి, మూమెంట్స్ ఒక మెయిన్ అప్‌డేట్.. నెట్‌ఫ్లిక్స్‌ను మరింత ఇంటరాక్టివ్‌గా మారుస్తుంది. మునుపెన్నడూ లేని విధంగా మీ టాప్ నెట్‌ఫ్లిక్స్ మూవెంట్స్ సేవ్ చేయడంతో పాటు షేర్ చేయొచ్చు.