iPhone 17: ఆపిల్ ఐఫోన్ 17 ప్రో డిజైన్ అదరహో.. మరిన్ని డమ్మీ ఫొటోలు చూశారా?
రెగ్యులర్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్ పూర్తిగా గ్లాస్ బ్యాక్స్ తో ఉన్నాయి కాబట్టి వాటికి ఈ ప్రత్యేక విండో డిజైన్ అవసరం లేదు.

ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబరులో విడుదల చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ లీక్‌ల ద్వారా ఐఫోన్ 17 ఫీచర్లు ఆన్‌లైన్‌లో కనపడుతున్నాయి. తాజాగా ఐఫోన్ 17 డమ్మీల ద్వారా విశ్లేషకులు పలు ఫీచర్ల గురించి వివరించి చెప్పారు.
ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌లో డిజైన్లలో అనేక రకాల మార్పులు ఉండొచ్చని దీని ద్వారా తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఐఫోన్ 17 మోడల్స్ డమ్మీస్ ఫొటోలు లీక్ అయ్యాయి. ఈ ఫోన్‌లలో ఎలాంటి డిజైన్లు రావచ్చనే విషయంపై వీటిద్వారా మరిన్ని వివరాలు తెలిశాయి.
ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్ మాగ్‌సెఫ్ ఏరియా చుట్టూ ప్రత్యేక కటౌట్ ఉంటుందని వీటి ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ల ఫ్రేమ్ అల్యూమినియంతో తయారవుతుంది. ఫ్రేమ్ ఏరియాలో ఓ గ్లాస్ సెక్షన్ కూడా ఉంటుంది. నాలుగు మోడళ్లలోనూ మాగ్‌సెఫ్ ఉంటుంది.
Also Read: అంతటా స్వర్ణమయం..! డోనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీస్‌ను ఎలా మార్చేశాడో చూడండి.. వీడియో వైరల్
ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్ వెనుక భాగంలో ఉన్న మెటల్‌ను గత ఐఫోన్‌ల కంటే ఎక్కువగా వాడుతున్నారు. దీంతో ఆ ఏరియా మరింత గట్టిగా ఉండే అవకాశం ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం గ్లాస్ సెక్షన్ అవసరం. ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్‌లో గ్లాస్ సెక్షన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి వైర్‌లెస్ చార్జింగ్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది.
రెగ్యులర్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్ పూర్తిగా గ్లాస్ బ్యాక్స్ తో ఉన్నాయి కాబట్టి వాటికి ఈ ప్రత్యేక విండో డిజైన్ అవసరం లేదు. గతంలో అన్ని ఐఫోన్‌లలో గ్లాస్ బ్యాక్‌లు ఉన్నాయి. వీటిని మీరు టియర్‌డౌన్ వీడియోలలో చూడవచ్చు.
టియర్‌డౌన్ వీడియోలంటే ఫోన్‌లకు సంబంధించిన అంతర్గత భాగాలను చూపించే వీడియోలు. వీటి ద్వారా ఫోన్లను ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకోవచ్చు. ఫోన్ రూపకల్పన, వాటి భాగాలు, మరమ్మతుల వంటి విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రజలకు ఇవి ఉపయోగపడతాయి.