Donald Trump: అంతటా స్వర్ణమయం..! డోనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీస్‌ను ఎలా మార్చేశారో చూడండి.. వీడియో వైరల్

డోనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీసును తన వ్యక్తిగత అభిరుచిని ప్రతిభింబించేలా వస్తువులను ప్రత్యేకంగా ఎంపిక చేసి..

Donald Trump: అంతటా స్వర్ణమయం..! డోనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీస్‌ను ఎలా మార్చేశారో చూడండి.. వీడియో వైరల్

Updated On : March 22, 2025 / 3:07 PM IST

Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నాటినుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. నిత్యం బిజీబిజీగా ఉంటూ.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో వాషింగ్టన్ డీసీలోని ఓవల్ ఆఫీసు స్వర్ణకాంతులీనుతోంది. తన వ్యక్తిగత అభిరుచిని ప్రతిభింబించేలా వస్తువులను ప్రత్యేకంగా ఎంపిక చేసిమరీ ట్రంప్ కార్యాలయంలో ఏర్పాట్లు చేయిస్తున్నారు.

Also Read: Donald Trump: ఎలాన్ మస్క్‌కు బిగ్ షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్.. ఆయనతో అవేమీ చర్చించం..

ఇటీవల ఫాక్స్ న్యూస్ యాంకర్ ఇన్ గ్రాహమ్ అధ్యక్ష కార్యాలయమైన ఓవల్ కార్యాలయంను సందర్శించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బంగారపు వస్తువులను ట్రంప్ చూపించారు. బంగారు ఫ్రేముల్లో మాజీ అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్, ఆండ్రూ జాక్సన్ వంటి ప్రముఖుల చిత్రాలున్నాయి. అంతేకాదు.. గోడలపై అబ్రహం లింకన్, ప్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్, థామస్ జెఫెర్సన్, రొనాల్డ్ రీగన్ వంటి వారి చిత్రాలు ఉంచారు. ఒవల్ కార్యాలయం ఇప్పుడు అమెరికన్ రాజనీతిజ్ఞుల చిత్రాలతో నిండిన విశాలమైన గ్యాలరీని పోలి ఉంది. ట్రంప్ వ్యక్తిగతంగా దాదాపు 20 చిత్రాలను ఎంచుకున్నాడు. జో బిడెన్ ఆరు, బరాక్ ఒబామా రెండు చిత్రాల కంటే ఇది చాలా ఎక్కువ.


స్వర్ణ కాంతులీనుతున్న అద్దాలు, సైడ్ టేబుల్స్ పై బంగారపు పక్షి బొమ్మలు, తలుపులు, టెలివిజన్ ను నియంత్రించే రిమోట్ పై కూడా పుత్తిడి తాపడం చేయించారు. తన కార్యాలయంలోని పేపర్ వెయిట్ పై కూడా ట్రంప్ పేరుతో గోల్డ్ స్టాంప్ ఉంది. తన డెస్క్ వెనుక భాగంలో టేబుల్ పై ఫిఫా ప్రపంచ కప్ టోర్నీ యొక్క బంగారు ప్రతిరూపం ఉంది. అంతేకాదు.. వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్ లో మార్పులు చేయించేందుకు కూడా ట్రంప్ సిద్ధమయ్యారట.