Nokia Feature Phones : బడ్జెట్లో బెస్ట్.. AI ఫీచర్లు, లాంగ్ బ్యాటరీతో 4 కొత్త నోకియా 4G ఫోన్లు వచ్చేశాయ్!
Nokia Feature Phones : కొత్త నోకియా 4జీ ఫీచర్లు ఫోన్లు వచ్చేశాయి.. భారీ బ్యాటరీ, ఏఐ ఫీచర్లతో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. HMD బ్రాండ్ నోకియా ఫోన్లలో కొత్తగా ఏమున్నాయంటే?
Nokia Feature Phones
- నోకియా 215 4జీ (2026) ఫోన్లో 2.8-అంగుళాల IPS డిస్ప్లే
- అన్ని నోకియా ఫోన్లలో 1,450mAh బ్యాటరీ సెటప్
- నోకియా ఫోన్లో FM ఫీచర్ సపోర్టు కూడా
Nokia Feature Phones : నోకియా ఫ్యాన్స్‌కు పండగే.. నోకియా మార్కెట్లో 4 కొత్త ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. కంపెనీ నోకియా 235 4జీ (2026), నోకియా 215 4జీ (2026), నోకియా 210 4జీ, నోకియా 200 4జీ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు 4జీ కనెక్టివిటీతో వస్తాయి. S30+ OSపై రన్ అవుతాయి.
ఈ ఫోన్లలో 1450mAh బ్యాటరీ ఉంది. స్పెషల్ ఫీచర్ ఏఐ అసిస్టెంట్ అందిస్తుంది. కంపెనీ ఇందులో ఏఐ (Nokia Feature Phones) అసిస్టెంట్ కోసం స్పెషల్ బటన్ కూడా అందిస్తుంది. తద్వారా వాయిస్ కమాండ్ కూడా ఇవ్వొచ్చు. కొత్తగా లాంచ్ అయిన ఈ నోకియా ఫీచర్ ఫోన్లలో స్పెషాలిటీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
నోకియా 235 4జీ (2026), నోకియా 215 4జీ (2026), నోకియా 210 4జీ, నోకియా 200 4జీ ఫోన్ల ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ మోడళ్లన్నీ కంపెనీ అధికారిక వెబ్సైట్లో లిస్ట్ అయ్యాయి. ఫోన్ స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
నోకియా 235 4G (2026) :
ఈ కొత్త 4జీ ఫోన్లో కంపెనీ 2.8-అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే అందించింది. ఈ ఫోన్ క్యూవీజీఏ రిజల్యూషన్ అందిస్తుంది. ఈ ఫోన్లో S30+ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. 64ఎంబీ ర్యామ్, 128ఎంబీ స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్లో 32జీబీ వరకు మైక్రో SD కార్డ్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ఈ ఫోన్లో ఎల్ఈడీ ఫ్లాష్‌తో 2ఎంపీ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్లో వీజీఏ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్లో 1,450mAh బ్యాటరీ ఉంది, 10 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఈ ఫోన్ 12 రోజుల పాటు స్టాండ్‌బై అందిస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. బ్లూటూత్ 5.0, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఆప్షన్ అందిస్తుంది. ఈ ఫోన్లో ఎఫ్ఎమ్ సపోర్ట్ కూడా ఉంది.
Read Also : Flipkart Goat Sale : ఐఫోన్ లవర్స్ ఎగిరిగంతేసే ఆఫర్.. ఐఫోన్ 17 ప్రోపై ఏకంగా రూ. 20,000 డిస్కౌంట్..!
నోకియా 215 4జీ (2026) :
ఈ నోకియా ఫోన్లో 2.8-అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే ఉంది. ఈ ఫోన్ క్యూవీజీఏ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇందులో S30+ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. 64ఎంబీ ర్యామ్, 128ఎంబీ స్టోరేజ్ అందిస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. బ్లూటూత్ 5.0, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఆప్షన్ అందించారు.
ఈ ఫోన్లో 1,450mAh బ్యాటరీ ఉంది. ఇందులో సింగిల్ కెమెరా కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ వీజీఏ కెమెరా ఉంది. ఈ ఫోన్లో 32GB వరకు మైక్రో SD కార్డ్ సపోర్ట్‌గా వాడవచ్చు. ఈ ఫోన్లో ఎఫ్ఎమ్ ఫీచర్ కూడా ఉంది. కొలతలు 128.8 x 55 x 12.8mm, బరువు 104 గ్రాములు ఉంటుంది.
నోకియా 210 :
ఈ 4జీ ఫీచర్ ఫోన్లో 2.4-అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే ఉంది. బ్యాక్, ఫ్రంట్ సైడ్ వీజీఏ కెమెరా ఉంది. ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ కూడా ఉంది. ఈ ఫోన్ S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. అలాగే, 64ఎంబీ ర్యామ్, 128ఎంబీ స్టోరేజ్ పొందవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే.. బ్లూటూత్ 5.0, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఆప్షన్ అందిస్తుంది. ఈ ఫోన్లో 1,450mAh బ్యాటరీ ఉంది. ఫోన్ కొలతలు 126.07 x 50.5 x 13.95mm, బరువు 92.7 గ్రాములు ఉంటుంది.
నోకియా 200 :
నోకియా 4జీ ఫోన్ 2.4-అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ S30+ OSపై రన్ అవుతుంది. 32GB వరకు స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు. ఈ ఫోన్లో 1,450mAh బ్యాటరీ ఉంది. 13 రోజుల వరకు స్టాండ్‌బై టైమ్ అందిస్తుంది.
కనెక్టివిటీ ఆప్షన్లలో బ్లూటూత్ 5.0, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ USB-C ఉన్నాయి. కొలతలు 126.07 x 50.5 x 13.95mm బరువు 92.3 గ్రాములు ఉంటుంది. అన్ని ఫోన్లు స్పెషల్ ఏఐ అసిస్టెంట్ బటన్‌తో వస్తాయి. టార్చ్, రిమైండర్లు, అలారాలు, కాలింగ్ వంటి ఫంక్షన్లను యాక్సస్ చేయొచ్చు. అలాగే, వాయిస్ కమాండ్లతో కూడా యాక్టివేట్ చేయొచ్చు.
