Noise Wireless EarBuds : రూ. 1500లకే నాయిస్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. ఒకసారి ఛార్జ్ చేస్తే.. 36 గంటల ప్లే బ్యాక్ టైమ్ పొందొచ్చు!

Noise Wireless EarBuds : కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కొనేందుకు చూస్తున్నారా? అయితే TWS ఇయర్‌బడ్‌లను అందించే నాయిస్ (Noise) నుంచి కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ భారత మార్కెట్లో రిలీజ్ అయింది. దేశంలోని టాప్ స్మార్ట్ వేరబుల్ బ్రాండ్‌లలో నాయిస్ ఒకటి.

Noise Wireless EarBuds : రూ. 1500లకే నాయిస్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. ఒకసారి ఛార్జ్ చేస్తే.. 36 గంటల ప్లే బ్యాక్ టైమ్ పొందొచ్చు!

Noise launches Rs 1500 wireless earbuds with up to 36 hours playback time

Updated On : January 25, 2023 / 9:45 PM IST

Noise Wireless EarBuds : కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కొనేందుకు చూస్తున్నారా? అయితే TWS ఇయర్‌బడ్‌లను అందించే నాయిస్ (Noise) నుంచి కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ భారత మార్కెట్లో రిలీజ్ అయింది. దేశంలోని టాప్ స్మార్ట్ వేరబుల్ బ్రాండ్‌లలో నాయిస్ ఒకటి. స్వదేశీ బ్రాండ్ వైర్‌లెస్ ఆడియో కేటగిరీలో కొత్త టెక్నాలజీని అందిస్తోంది. లేటెస్ట్ ఎడిషన్‌లో, నాయిస్ గేమింగ్ వైర్‌లెస్ ఆడియో యాక్సెసరీస్ సెగ్మెంట్లోకి ప్రవేశపెట్టింది. బ్రాండ్ మొదటి గేమింగ్ TWSగా నాయిస్ బడ్స్ కంబాట్‌ను ప్రారంభించింది.

Noice కొత్త నాయిస్ బడ్స్ కంబాట్‌తో Quad Mic ENC, 36 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తోంది. TWS ఇయర్‌బడ్‌లు ప్రత్యేకంగా ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు క్లారిటీ ఆడియోను కోరుకునే గేమర్ల కోసం రూపొందించింది. సరసమైన ధరలో నాయిస్ బడ్స్ కాంబాట్ గేమింగ్ ఆడియో డివైజ్‌లను కొనుగోలు చేయొచ్చు. మొబైల్ గేమ్‌ల కోసం TWSని కోరుకునే గేమర్‌లను లక్ష్యంగా చేసుకుని కంపెనీ రూపొందించింది.

నాయిస్ బడ్స్.. భారత్‌లో ధర ఎంతంటే? :
నాయిస్ బడ్స్ కాంబాట్ భారత మార్కెట్లో రూ. 1499 ధరతో లాంచ్ అయింది.TWS ఇయర్‌బడ్స్ స్టీల్త్ బ్లాక్, కోవర్ట్ వైట్, షాడో గ్రే అనే మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటాయి. కొనుగోలుదారులు Noise అధికారిక వెబ్‌సైట్, Flipkart నుంచి Noise Buds Combat TWSని కొనుగోలు చేయవచ్చు.

Noise launches Rs 1500 wireless earbuds with up to 36 hours playback time

Noise launches Rs 1500 wireless earbuds with up to 36 hours playback time

Read Also : Noise ColorFit Caliber Buzz : నాయిస్ కలర్‌ఫిట్ క్యాలిబర్ బజ్ స్మార్ట్‌వాచ్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

నాయిస్ బడ్స్ స్పెసిఫికేషన్లు ఇవే :
నాయిస్ బడ్స్ కంబాట్ అనేది 13mm ఆడియో డ్రైవర్‌లను కలిగిన హాఫ్-ఇన్-ఇయర్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్. ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) సపోర్ట్‌తో గేమింగ్ చేస్తున్నప్పుడు క్రిస్టల్-క్లియర్ ఆడియోను అందించడానికి నాయిస్ ఈ TWS ఇయర్‌బడ్‌లను డిజైన్ చేసింది. కొత్త బడ్స్ కాంబాట్ 36 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందించగలదని నాయిస్ వెల్లడించింది. ఛార్జింగ్ పనితీరులో ఒక ఛార్జ్‌పై గరిష్టంగా 8 గంటల పవర్, ఛార్జింగ్ కేస్‌తో అదనంగా 37 గంటలపాటు పొందవచ్చు.TWS ఇయర్‌బడ్‌లు ఫాస్ట్ ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్‌తో వస్తాయి.

పూర్తి ఛార్జింగ్ 90 నిమిషాల సమయంతో పాటు ఛార్జింగ్ కేస్‌ను ఛార్జింగ్ చేసేందుకు 120 నిమిషాల వరకు పడుతుంది. నాయిస్ బడ్స్ కంబాట్ బరువు 9.2 గ్రాములు, IPX5 రేటింగ్‌తో వస్తుంది. వాటర్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. Noise నుంచి కొత్త TWS వైర్‌లెస్ కనెక్టివిటీకి బ్లూటూత్ 5.3కి సపోర్టు ఇస్తుంది. వేక్, పెయిర్ ఫీచర్‌లను అందిస్తుంది. ఇయర్‌బడ్‌లు వాయిస్ కాల్‌లలో క్వాడ్-మైక్రోఫోన్ సెటప్‌తో కూడా వస్తాయి.

Android, iOS డివైజ్‌లకు అనుకూలంగా ఉంటాయి. యూజర్లు గూగుల్ అసిస్టెంట్, సిరి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ పొందవచ్చు. నాయిస్ బడ్స్ కంబాట్‌లో మ్యూజిక్ కంట్రోల్ చేయవచ్చు. వాల్యూమ్‌ని ఎడ్జెస్ట్ చేసేందుకు వాయిస్ అసిస్టెంట్‌ని యాక్టివేట్ చేయవచ్చు. కాల్‌లను స్వీకరించడానికి/తిరస్కరించడానికి టచ్ బటన్‌లు కూడా ఉన్నాయి. అదనంగా, ఇయర్‌బడ్‌లు 40ms వరకు అల్ట్రా-లో వాల్యూమ్ అందిస్తాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Noise Two Wireless Headphones : 50 గంటల బ్యాటరీతో నాయిస్ టూ వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు వచ్చేశాయి.. ధర ఎంతంటే?