Nokia 4G 2024 Phones : నోకియా నుంచి రెండు సరికొత్త 4G ఫీచర్ ఫోన్లు.. ఫీచర్లు అదుర్స్, భారత్‌లో ధర ఎంతంటే?
Nokia 4G 2024 Phones : ఈ రెండు ఫీచర్ ఫోన్లు దేశంలో అమెజాన్, హెచ్ఎండీ ఇండియా వెబ్సైట్ ద్వారా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లతో పాటు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
Nokia 4G 2024 Phones : ప్రముఖ హెచ్ఎండీ గ్లోబల్ సొంత బ్రాండ్ నోకియా నుంచి రెండు సరికొత్త ఫీచర్ ఫోన్లు వచ్చేశాయి. నోకియా 3210తో పాటు నోకియా 220 4జీ ఫోన్, నోకియా 235 4జీ 2024 వేరియంట్లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఫీచర్ ఫోన్లు 2.8-అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్లతో వస్తాయి.
9.8 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందజేస్తాయి. ఈ హ్యాండ్సెట్లు యూపీఐ లావాదేవీలతో పాటు క్లౌడ్ యాప్‌లకు కూడా సపోర్టు అందిస్తాయి. రెండోది వెబ్ ద్వారా వినోదం, వ్యాపారం లేదా విద్యా విషయాలను యాక్సెస్ చేయడంలో యూజర్లకు సాయపడుతుంది. నోకియా 220, నోకియా 235 ఫీచర్ ఫోన్లు కూడా క్లాసిక్ స్నేక్ గేమ్‌తో ప్రీ- ఇన్‌స్టాల్‌తో వచ్చాయి.
భారత్‌లో నోకియా 220 4జీ, నోకియా 235 4జీ ధర ఎంతంటే? :
నోకియా 220 4జీ 2024 భారత మార్కెట్లో ధర రూ. 3,249, నోకియా 235 4జీ 2024 ధర రూ. 3,749కు అందిస్తోంది. ఈ రెండు ఫీచర్ ఫోన్లు దేశంలో అమెజాన్, హెచ్ఎండీ ఇండియా వెబ్సైట్ ద్వారా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లతో పాటు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. నోకియా 220 4జీ 2024 ఫోన్ బ్లాక్, పీచ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అయితే, నోకియా 235 4జీ 2024 ఫోన్ మొత్తం బ్లాక్, బ్లూ, పర్పల్ అనే మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది.
నోకియా 220 4జీ 2024, నోకియా 235 4జీ 2024 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
నోకియా 220 4జీ, నోకియా 235 4జీ 2024 వేరియంట్లు 2.8-అంగుళాల క్యూవీజీఏ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్లను కలిగి ఉన్నాయి. 64ఎంపీ ర్యామ్, 128ఎంబీ ఇంటర్నల్ స్టోరేజీ సపోర్టుతో యూనిసోక్ టీ107 చిప్సెట్ల ద్వారా పవర్ పొందుతాయి. మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీ సామర్థ్యాన్ని 32జీబీ వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్లు ఎస్30+ ఆపరేటింగ్ సిస్టమ్ వెలుపల పనిచేస్తాయి.
నోకియా 220 4జీ 2024 బ్యాక్ ప్యానెల్లో ఎల్ఈడీ టార్చ్‌తో మాత్రమే అమర్చి ఉండగా, నోకియా 235 4జీ 2024 2ఎంపీ బ్యాక్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. రెండు ఫోన్లు 1,450mAh రిమూవబుల్ బ్యాటరీ, యూఎస్బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లను కలిగి ఉన్నాయి. ఈ హ్యాండ్సెట్లు గరిష్టంగా 9.8 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తాయని కంపెనీ పేర్కొంది.
నోకియా 220 4జీ 2024, నోకియా 235 4జీ 2024 ఫోన్లు 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్‌లను ఉంటాయి. ఎంపీ3 ప్లేయర్ సపోర్ట్‌తో పాటు వైర్డు, వైర్లెస్ ఎమ్ రేడియో కనెక్షన్లను సపోర్ట్ చేస్తాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ద్వారా ఆమోదించిన యూపీఐ అప్లికేషన్లతో ప్రీ-ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఇంటర్నల్ క్లౌడ్ యాప్‌లు, యూట్యూబ్ షార్ట్‌లు, యూట్యూబ్ మ్యూజిక్‌తో పాటు వార్తలు, వాతావరణ అప్డేట్లను యాక్సెస్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తాయి. ఈ హ్యాండ్సెట్లు క్లాసిక్ ఫీచర్ ఫోన్ గేమ్ స్నేక్‌కి కూడా సపోర్ట్ చేస్తాయి.
Read Also : Nokia 3210 UPI Apps : యూపీఐ యాప్స్‌తో నోకియా 3210 ఫీచర్ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, స్పెషిఫికేషన్లు ఇవే!