Noida Apartments Prices : ఇది విన్నారా? నోయిడాలో 4BHK ప్లాట్ రూ. 15 కోట్లు.. అపార్ట్‌మెంట్ల ధరలపై టెక్కీ వీడియో వైరల్!
Noida Apartments Prices : యూపీలోని నోయిడాలో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ల ధరల గురించి ఢిల్లీ ఎన్‌సీఆర్‌కి చెందిన ఇంజనీర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

Techie's Video On Noida's Under-Construction Apartments ( Image Source : Grab Screenshot from Video )
Noida Apartments Prices : ప్రస్తుత రోజుల్లో రియల్ ఎస్టేట్‌కు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. ఒక ఇళ్లు మాత్రమే కాదు.. ల్యాండ్స్, ప్లాట్ల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. చిన్న ఇళ్ల నుంచి లగ్జరీ ఇళ్ల వరకు ప్లాట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సొంతింటి కల అందరికి ఉంటుంది. కానీ, కొంతమంది మాత్రమే ఆ కలను నెరవేర్చుకోగలరు. అందులోనూ ఇళ్ల ధరలు భారీగా పెరగడంతో కోట్లలో ధరల పలికే ప్లాట్లను కొనుగోలు చేయడం కష్టంగా మారుతోంది.
కోట్లు పెట్టినా సొంత ఇల్లు కొనుగోలు చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. లగ్జరీ విల్లా, గేటెడ్ కమ్యూనిటీతో పాటు అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనేందుకు కోట్లు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం, యూపీలోని నోయిడాలో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ల ధరల గురించి ఢిల్లీ ఎన్‌సీఆర్‌కి చెందిన ఇంజనీర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడి ఒక్కో ప్లాట్ల ధరలు రూ. 15 కోట్లకు అమ్ముడవుతున్నట్లు చెప్పడంతో నెటిజన్లు ఒక్కసారిగా కంగుతిన్నారు.
కోట్ల విలువైన ఇల్లు కొనగలమా? :
విట్టీ ఇంజనీర్ అనే కాశిష్ ఛిబ్బర్ రియల్ ఎస్టేట్ ధరలను గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇటీవల నోయిడా సెక్టార్ 124లో వర్చువల్ టూర్ వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడ రాబోయే ఏటీఎస్ నైట్స్‌బ్రిడ్జ్ ప్రాజెక్ట్‌లోని అపార్ట్‌మెంట్‌ను చూశాడు. ఆ వీడియోలో అక్కడ 4BHK అపార్ట్‌మెంట్‌కు రూ. 15 కోట్లు, 6BHK రూ. 25 కోట్లు అని ఇంజనీర్ వెల్లడించారు.
ఈ అపార్ట్‌మెంట్‌లు ఎవరు కొంటున్నారో ఆశ్చర్యం వేస్తోంది. అసలు వాళ్లు ఏ పని చేస్తారో ఇన్ని కోట్లు పెట్టి ఇళ్లను కొనడానికి అని సందేహం వ్యక్తం చేశాడు. ఈ ఇళ్ల ధరలను చూస్తుంటే.. ఉద్యోగం మారడం, వ్యాపారం చేయడం లేదా పెట్టుబడి పెట్టడం వల్ల సొంత ఇంటిని కొనుగోలు చేయడం సాధ్యం కాదంటూ మిలియన్ల మంది వీక్షకులను ఆకర్షించాడు.
నోయిడా రియల్ ఎస్టేట్ మిడిల్ క్లాసు భారతీయులకు అందుబాటులో లేకుండా పోతుందని కొందరు వినియోగదారులు అభిప్రాయపడ్డారు. కొందరు రూ. 15 కోట్లను 1.7 మిలియన్ డాలర్లకు సమానం అని లెక్కలు కట్టారు. అదే న్యూయార్క్‌లో అపార్ట్‌మెంట్ లేదా దుబాయ్‌లోని విల్లాను కొనుగోలు చేయవచ్చునని చెప్పారు. కొంతమంది నెటిజన్లు రూ 15 కోట్ల ధరను “లగ్జరీ ప్రాజెక్ట్” అంటూ కామెంట్ చేశారు.
నోయిడాలో ఇళ్ల ధరలపై నెటిజన్ల స్పందన :
నోయిడాలో ఉండే వాళ్లు రూ. 15కోట్ల ఫ్లాట్‌లను ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? ఆ డబ్బుతో దుబాయ్‌లో పెద్ద విల్లాను కొనుగోలు చేయవచ్చు. మీరు సింగపూర్‌లో 3BHK అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయవచ్చు. న్యూయార్క్‌లోని మాన్‌హాటన్‌లోని అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయవచ్చునని నెటిజన్ కామెంట్ చేశాడు. అదే రూ. 15 కోట్లలో దేశం పౌరసత్వంతో పాటు, యూరప్ లేదా అమెరికాలో దాదాపు ఎక్కడైనా ఒక మంచి ఇంటిని కొనుగోలు చేయవచ్చునని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.
కొద్ది రోజుల క్రితమే ఈ వీడియోను షేర్ చేయగా.. అప్పటి నుంచి 4.4 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అపార్ట్‌మెంట్ల అధిక ధరలపై వినియోగదారులు కామెంట్లలో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఇప్పటివరకూ ఈ వీడియోకు ఒక మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి.
View this post on Instagram