Nokia G42 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? నోకియా G42 5G సేల్ మొదలైందిగా.. అమెజాన్‌లో ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Nokia G42 5G Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? లేటెస్ట్ నోకియా సరసమైన 5G ఫోన్ నోకియా G42 5G సేల్ మొదలైంది. ఇందులో 50MP కెమెరా, 90Hz డిస్‌ప్లే, మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. వివరాలను ఓసారి చెక్ చేయండి.

Nokia G42 5G Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? నోకియా G42 5G సేల్ మొదలైందిగా.. అమెజాన్‌లో ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Nokia G42 5G goes on Sale today, Priced at 12599 on Amazon

Nokia G42 5G Sale : ప్రముఖ హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ నోకియా (Nokia) నుంచి Nokia C22, Nokia C32, Nokia G11 వంటి సరసమైన స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తోంది. ఇప్పటికే విస్తారమైన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ నోకియాగా ప్రసిద్ధి చెందిన HMD గ్లోబల్, సెప్టెంబర్ 11న సరికొత్త సరసమైన స్మార్ట్‌ఫోన్ (Nokia G42 5G)ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ సెప్టెంబర్ 15న అమెజాన్ ఇండియా (Amazon India)లో ప్రారంభమైంది.

లాంచ్ సందర్భంగా, హెచ్ఎండీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ & APAC, HMD గ్లోబల్ రవి కున్వర్ మాట్లాడుతూ.. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన డివైజ్ నోకియా G42 5Gని భారత మార్కెట్లోకి తీసుకురావడం చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు. నోకియా ప్రకారం.. కొత్త నోకియా G42 5G యూజర్లు దీర్ఘకాలం, విశ్వసనీయమైన స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు.  ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం కాగా.. ఆసక్తిగల కొనుగోలుదారులు నోకియా G42 5Gని అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అయితే, ఈ 5G ఫోన్ ధర, ఫీచర్లు, లభ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Poco M6 Pro 5G Price : భలే ఉంది భయ్యా ఫోన్.. పోకో M6 ప్రో 5Gపై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

నోకియా G42 5G ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
నోకియా G42 5G హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ 5G చిప్‌సెట్‌ను పొందుతుంది. 5GB RAMతో వస్తుంది. వర్చువల్‌గా 6GB RAMని అందించే అదనపు ఆప్షన్ అని చెప్పవచ్చు. మీరు 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజీని కూడా పొందవచ్చు. నోకియా 2 సంవత్సరాల OS అప్‌డేట్‌లను హామీ ఇచ్చింది. నోకియా G42 5G ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల HD+ డిస్‌ప్లే, ప్రొటెక్షన్ కోసం పైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3ని కలిగి ఉంది.

కంపెనీ ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ 2-పీస్ యూనిబాడీలో 65 శాతం రీసైకిల్ ప్లాస్టిక్‌ బ్యాక్ కవర్‌తో వస్తుంది. ‘బ్లెండింగ్ సస్టెయినబిలిటీ, డ్యూరబిలిటీ టాప్-టైర్ టెక్నాలజీ’ అనే దాని నినాదాన్ని కొనసాగిస్తుంది. స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది.

Nokia G42 5G goes on Sale today, Priced at 12599 on Amazon

Nokia G42 5G goes on Sale today, Priced at 12599 on Amazon

దీంతో పాటు ప్రైమరీ 50MP AF మెయిన్ కెమెరా ప్లస్ 2MP మాక్రో, 2MP డెప్త్ ఆక్సిలరీ కెమెరాలు LED ఫ్లాష్‌తో ఉంటాయి. మీరు ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్‌ని పొందవచ్చు. నోకియా G42 5G ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. మూడు రోజులు, 800 పూర్తి ఛార్జింగ్ సైకిళ్లను కలిగి ఉంటుందని నోకియా పేర్కొంది.

నోకియా G42 5G సేల్, ధర ఎంతంటే? :
నోకియా G42 5G సేల్ సెప్టెంబర్ 15 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైందని నోకియా ప్రకటించింది. దీని ధర రూ. 12,599 ఉండగా, సో గ్రే, సో పర్పుల్ అనే 2 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియాలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Read Also : iPhone 16 Series Leak : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ వచ్చేస్తోంది.. కొత్త బిగ్ లీక్ ఇదిగో.. ఐఫోన్ 15కు మించి అదిరే అప్‌గ్రేడ్స్..!