Nothing OS 4.0 Open Beta : నథింగ్ ఎసెన్షియల్ ఏఐ వచ్చేసింది.. నథింగ్ OS 4.0 ఓపెన్ బీటా రిలీజ్.. ఫీచర్లు, సపోర్టు చేసే నథింగ్ మోడల్స్ ఇవే
Nothing OS 4.0 Open Beta : నథింగ్ ఫోన్ (3) బ్రాండ్ నుంచి ఎంపిక చేసిన నథింగ్ మోడళ్లపై ఆండ్రాయిడ్ 16 ఆధారంగా నథింగ్ OS 4.0 ఓపెన్ బీటాను రిలీజ్ చేసింది.

Nothing OS 4.0 Open Beta
Nothing OS 4.0 Open Beta : నథింగ్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. నథింగ్ OS 4.0 ఓపెన్ బీటా వచ్చేసింది. బ్రాండ్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ నథింగ్ ఫోన్ (3)తో సహా 4 స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఆండ్రాయిడ్ 16 ఆధారంగా నథింగ్ OS 4.0 ఓపెన్ బీటాను నథింగ్ రిలీజ్ చేసింది. ఈ బీటా వెర్షన్ సపోర్టు చేసే మోడల్‌లు, అన్ని కొత్త ఫీచర్లు, లాంచ్ టైమ్‌లైన్‌లతో సహా నథింగ్ నుంచి కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
నథింగ్ ఎసెన్షియల్ ఏఐ ప్లాట్‌ఫారం :
నథింగ్ కంపెనీ ఎసెన్షియల్ అనే కొత్త ఏఐ (Nothing OS 4.0 Open Beta) ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీలో రెండు కీలక ఫీచర్లు ఉన్నాయి. ఎసెన్షియల్ యాప్స్, ప్లేగ్రౌండ్. ఎసెన్షియల్ యాప్స్ ద్వారా నేచరుల్ లాంగ్వేజీని ఉపయోగించి ఇన్‌స్టంట్ సొంత యాప్‌లను క్రియేట్ చేసుకోచ్చు. ప్లేగ్రౌండ్ అనేది కమ్యూనిటీ ఆధారిత ప్లాట్‌ఫామ్.. వినియోగదారులు ఇతరులు క్రియేట్ చేసిన యాప్‌లను షేర్ చేయవచ్చు. రీమిక్స్ చేయవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నథింగ్ OS 4.0 ఓపెన్ బీటా : సపోర్టు ఉన్న ఫోన్‌లు
నథింగ్ OS 4.0 ఓపెన్ బీటా రిలీజ్ అయింది.
నథింగ్ ఫోన్ (3)
నథింగ్ ఫోన్ (2)
నథింగ్ ఫోన్ (2a)
నథింగ్ ఫోన్ (2a) ప్లస్
ఈ లిస్టులో నథింగ్ లేటెస్ట్ మిడ్-రేంజర్ ఫోన్ (3a) సిరీస్ లేదు. కానీ, బ్రాండ్ ఈ నెలాఖరులో కొన్ని సరికొత్త ఫీచర్లతో ఓపెన్ బీటా వెర్షన్‌ను అందుకోనుంది.
నథింగ్ OS 4.0 ఓపెన్ బీటా కొత్త ఫీచర్లు :
నథింగ్ OS 4.0 ఓపెన్ బీటాతో నథింగ్ ఫోన్ (3) ఎసెన్షియల్ స్పేస్‌లో ఏఐ యూసేజ్ డాష్‌బోర్డ్ కలిగి ఉంది. ఈ కొత్త అప్‌డేట్ లాక్ స్క్రీన్, AOD పర్ఫార్మెన్స్, ఆప్టిమైజ్ బ్రైట్‌నెస్ బిహేవియర్, కెమెరా స్టేబిలిటీ, బ్లూటూత్ స్టేబిలిటీ, Wi-Fi కనెక్టివిటీ, నెట్‌వర్క్ స్టేబిలిటీతో పాటు అనే బగ్ ఫిక్స్ వంటివి ఉన్నాయి.
నథింగ్ ఫోన్ (2a) రేంజ్ ఫోన్లలో ఇప్పుడు “Stretch” కెమెరా ప్రీసెట్ ఉంది. ఫొటోగ్రాఫర్ జోర్డాన్ హెమింగ్‌వేతో క్రియేట్ చేశారు. కెమెరా యాప్ నుంచి నేరుగా రిచ్ షాడోలు, ఎక్స్‌టెండెడ్ హైలైట్‌లతో ఫొటోలను అప్‌గ్రేడ్ చేస్తుంది. అదనంగా, ఈ అప్‌డేట్ స్టార్టప్ స్పీడ్ కోసం సిస్టమ్-లెవల్ యాప్ ఆప్టిమైజేషన్ అందిస్తుంది. Settings > Apps > App optimisation కింద అందుబాటులో ఉంది.
ఈ డివైజ్ నిర్దిష్ట ఫీచర్లతో పాటు కొన్ని సాధారణ కొత్త ఫీచర్లు ఉన్నాయి.
స్పీడ్ కోసం 2 ఫ్లోటింగ్ ఐకాన్స్ పాప్-అప్ వ్యూ
రెండు కొత్త లాక్ స్క్రీన్ క్లాస్ ఫేస్‌లు
2×2 క్విక్ సెట్టింగ్స్ టైల్ సపోర్టు
అడ్వాన్స్ డార్క్ మోడ్ ( Settings> Display> Dark Theme > Advance Dark Mode)
ముఖ్యమైన యాప్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీరు ఏఐతోనే విడ్జెట్‌లను క్రియేట్ చేయొచ్చు. కెమెరా ప్రీసెట్‌లు, ఈక్యూ ప్రొఫైల్‌లతో పాటు ప్లేగ్రౌండ్‌లో షేర్ చేయవచ్చు. నథింగ్ OS 4.0తో నథింగ్ ఫోన్ (3) 6 విడ్జెట్‌ల వరకు, 2 వరకు ఇతర మోడళ్లకు సపోర్టు ఇస్తుంది. పర్ఫార్మెన్స్ స్పీడ్ ఉండేందుకు టెంపరరీ లిమిట్ సెట్ చేసింది.
నథింగ్ OS 4.0 ఓపెన్ బీటా : ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? :
ఓపెన్ బీటా వెర్షన్‌ను అక్టోబర్ 14 వరకు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని నథింగ్ పేర్కొంది. ఆ తర్వాత మీరు బీటాలో జాయిన్ కాలేరు. ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి :
బీటా అప్‌డేట్స్ హబ్.apk డౌన్‌లోడ్ చేసుకుని మీ డౌన్‌లోడ్స్ ఫోల్డర్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకోండి.
Settings > System> Nothing Beta Hubకి వెళ్లండి.
సైన్ అప్ కోసం “ Join Beta” ట్యాప్ చేయండి. రిజిస్ట్రేషన్ తర్వాత అప్‌గ్రేడ్ కోసం “ Go to Update” ట్యాప్ చేయండి.
“Go to Update”పై ట్యాప్ చేయగానే ఫెయిల్ అయితే Settings > System> సిస్టమ్ అప్‌డేట్‌లకు వెళ్లి మాన్యువల్‌గా చెక్ చేసి Updates కోసం చెక్ చేయండి.