DGP Shivadhar Reddy: పింక్ బుక్‌పై నూతన డీజీపీ శివధర్ రెడ్డి కీలక కామెంట్స్
DGP Shivadhar Reddy : తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.

DGP Shivadhar Reddy
DGP Shivadhar Reddy: డీజీపీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.. ఏ లక్ష్యంతో నియమించారో అందుకు అనుగుణంగా పనిచేస్తా.. నా మొదటి ఛాలెంజ్ లోకల్ బాడీ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడం.. అందుకోసం అన్నివిధాల సన్నద్ధం అవుతున్నాం అంటూ తెలంగాణ నూతన డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ 6వ డీజీపీగా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. లక్డీకపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో ఉన్న తన చాంబర్‌లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
లోకల్ బాడీ ఎన్నికలు మాకు మొదటి ఛాలెంజ్. శాంతియుతంగా ఎన్నికలు పూర్తి చేయడానికి సన్నద్ధం అవుతున్నాం. పోలీస్ శాఖలో 17000 ఖాళీలు ఉన్నాయి. ఆ నియామకాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని శివధర్ రెడ్డి అన్నారు. బేసిక్ పోలీసింగ్‌తో సాంకేతికను ఉపయోగించుకుని మరింత సమర్థవంతంగా పని చేస్తామని చెప్పారు.
మావోయిస్టులు పొలిట్ బ్యూరో మల్లోజుల వేణు గోపాల్ ఇటీవల ఒక ప్రకటన రిలీజ్ చేశారు. బయటకు రావడానికి, ఆయుధాలు వదిలి పెట్టడానికి నిర్ణయం తీసుకున్నామని ప్రకటన రిలీజ్ చేశారు. జనరల్ సెక్రటరీ బసవరాజు ఉన్నప్పుడే ఆ నిర్ణయం జరిగిందని వేణుగోపాల్ ప్రకటనలో పేర్కొన్నారు. వేణుగోపాల్ ఇచిన స్టేట్‌మెంట్ జగన్ ఖండించారు. ప్రజా పోరాట పంథా సక్సెస్ అవల్లేదని మావోయిస్టులే అంటున్నారు. పోలీసులు వేధిస్తారని ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి సంశయం లేకుండా మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. చాలామంది ఇప్పటికే పార్టీ నుండి బయటకు వస్తున్నారు. రీసెంట్ సెంట్రల్ కమిటీ మెంబర్ కవితక్క కూడా లొంగిపోయారు. మావోయిస్టులతో మాకు ఇక్కడ సమస్య లేనప్పుడు వాళ్ళతో చర్చలు అనవసరమని డీజీపీ చెప్పారు.
సైబర్ సెక్యూరిటీ, ఈగల్ టీంలకు పూర్తి సహకారం ఉంటుంది. బేసిక్ పోలింగ్ అండ్ విజువల్ పోలీసింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తాం. మాకు ఉన్నదంతా ఖాకీ బుక్.. మాకు పింక్ బుక్ గురించి తెలియదంటూ డీజీపీ శివధర్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఇతరుల వ్యక్తిత్వ హనానికి పాల్పడేలా సోషల్ మీడియా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.