Nothing Phone 2 India : నథింగ్ ఫోన్ (2) లాంచ్ డేట్ తెలిసిందోచ్.. డిజైన్, ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Nothing Phone (2) India : నథింగ్ ఫోన్ (2) లాంచ్ డేట్ ఎప్పుడు అనేది ఎట్టకేలకు తెలిసిందోచ్.. జూలై 11న భారత్, గ్లోబల్ మార్కెట్లలో ఈ 5G ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

Nothing Phone (2) India launch date confirmed_ A look at expected price, design and specs
Nothing Phone (2) India Launch Date : ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ నథింగ్ కంపెనీ నుంచి నథింగ్ ఫోన్ (2) లాంచ్ డేట్ ఎప్పుడు అనేది రివీల్ చేసింది. జూలై 11న 5G ఫోన్ అధికారికంగా భారత్, గ్లోబల్ మార్కెట్‌లలోకి రానుంది. నథింగ్ కంపెనీ మీడియాకు లాంచ్ డేట్ ఎప్పుడు అనేది ధృవీకరించింది. లాంచ్ ఈవెంట్ జూలై రెండో వారంలో రాత్రి 8:30 గంటలకు జరుగనుంది. రాబోయే నథింగ్ ఫోన్ డిజైన్, ధర, స్పెసిఫికేషన్‌లను ఓసారి పరిశీలిద్దాం..
నథింగ్ ఫోన్ (2) భారత్‌లో ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ (2) ధర సుమారుగా రూ. 40వేలు ఉంటుందని అంచనా. ఈ 5G ఫోన్‌కి సంబంధించిన టీజర్‌లు ఇప్పటికే ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తోంది. అదే ధర పరిధిలో నథింగ్ ఫోన్ (2), OnePlus 11R, Pixel 7a వంటి ఫోన్‌లతో పోటీపడే అవకాశం ఉంది. కంపెనీ అధికారికంగా ధృవీకరించిన స్పెసిఫికేషన్‌ల ఆధారంగా అంచనా వేయొచ్చు. రీకాల్ చేసేందుకు నథింగ్ ఫోన్ (1) భారత మార్కెట్లో రూ. 32,999 ధరతో అందుబాటులోకి వచ్చింది.
నథింగ్ ఫోన్ (2) డిజైన్ ఇదేనా? :
లేటెస్ట్ నథింగ్ ఫోన్ (1) తరహా డిజైన్‌ను కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో కంపెనీ సూచించిన విషయాన్ని రివీల్ చేసింది. నథింగ్ ఫోన్ (1)లో చూసిన LEDలతో కూడిన గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ గురించి కంపెనీ సీఈఓ కార్ల్ పీని అడిగినప్పుడు.. రాబోయే 5G ఫోన్‌లో మరిన్ని బెస్ట్ ఆప్షన్లు ఉంటాయని పేర్కొన్నారు. అదే డిజైన్‌తో రానుందని సూచిస్తుంది.
యూజర్లకు మెరుగైన సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడంపై ఈసారి ప్రధాన దృష్టి కేంద్రకరించనున్నట్టు కంపెనీ సూచించింది. నథింగ్ ఫోన్ (2) బ్యాక్ సైడ్ అదే LED డిజైన్‌ను పొందే అవకాశం ఉంది. పాత డిజైన్ ఏదీ ప్లాన్ చేయడం లేదని సూచిస్తుంది. కొత్త నథింగ్ ఫోన్ యూజర్లకు రిఫ్రెష్ డిజైన్ అందించే బ్యాక్ ప్యానెల్‌లో కొన్ని మార్పులతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త 5G ఫోన్ అల్యూమినియం సైడ్ ఫ్రేమ్‌ను కలిగి ఉందని బ్రాండ్ గతంలో ధృవీకరించింది. లాంచ్ ఈవెంట్ సమీపంలో ఉన్నందున త్వరలో డిజైన్ విభాగానికి సంబంధించిన మరిన్ని వివరాలను పొందే అవకాశం ఉంది.

Nothing Phone (2) India launch date confirmed
నథింగ్ ఫోన్ (2) స్పెసిఫికేషన్‌లు ఇవే :
నథింగ్ ఫోన్ (2) ఫ్లాగ్‌షిప్ Qualcomm Snapdragon 8+ Gen 1 చిప్‌సెట్ ద్వారా అందిస్తుంది. OnePlus 11R స్మార్ట్‌ఫోన్ కూడా ఉపయోగిస్తోంది. ఈ డివైజ్ 6.7-అంగుళాల డిస్ప్లే, హుడ్ కింద 4,700mAh బ్యాటరీని కలిగి ఉంది. ఛార్జింగ్ వివరాలను కంపెనీ ధృవీకరించనప్పటికీ, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్టు అందిస్తుందని తెలిపింది. ఎందుకంటే.. అదే నథింగ్ ఫోన్ (1)లో కూడా అందుబాటులో ఉంది. కెమెరా సెన్సార్ల వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
కొత్త నథింగ్ ఫోన్ (2) స్మార్ట్‌ఫోన్ మూడేళ్ల ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లు, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను స్వీకరించనున్నట్టు కంపెనీ వెల్లడించలేదు. లేటెస్ట్ నథింగ్ OS బిల్డ్ యూజర్లకు వేగవంతమైన ఎక్స్‌పీరియన్స్ వంటి మరిన్ని ఫీచర్లను అందిస్తుందని కంపెనీ తెలిపింది. కొత్త డివైజ్‌లో సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించనుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 OSతో వచ్చే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.