Nothing Phone 2 Launch : నథింగ్ ఫోన్ (2) వచ్చేస్తోంది.. జూలైలోనే అధికారిక లాంచ్.. ఫీచర్లు ఏంటి? ధర ఎంత ఉండొచ్చుంటే?
Nothing Phone 2 Launch : నథింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? జూలైలో నథింగ్ ఫోన్ (2) రాబోతోంది. లాంచ్‌కు ముందే నథింగ్ ఫోన్ (2)లో 4,700mAh బ్యాటరీ ఉంటుందని లీక్ డేటా తెలిపింది.

Nothing Phone 2 Launch to officially launch in July, company reveals battery details
Nothing Phone 2 Launch in July : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? వచ్చే జూలైలో నథింగ్ ఫోన్ (2) అధికారికంగా లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ CEO కార్ల్ పీ ప్రకటించారు. గతంలో నెక్స్ట్ జనరేషన్ ఫోన్ (2) క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC కలిగి ఉంటుందని సీఈఓ పేర్కొన్నారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్ తో రానుంది. ఏడాది క్రితమే ఈ ఫోన్ టెస్టింగ్ చేసిన తర్వాత ఆప్టిమైజ్ చేసినట్టు తెలిపారు.
నథింగ్ ఫోన్ (2)లో 4,700mAh బ్యాటరీ ఉంటుందని ఆయన చెప్పారు. నథింగ్ ఫోన్‌లోని 4,500mAh బ్యాటరీ కన్నా నథింగ్ ఫోన్ (1) పెద్దదిగా ఉంటుంది. ఈ బ్యాటరీ సైజు లేటెస్ట్ iPhone 14 Pro (3,200mAh), iPhone 14 Pro Max (4,323mAh) కన్నా కూడా చాలా పెద్దది. ఆండ్రాయిడ్ ఫోన్లలో బెస్ట్ బ్యాటరీ సైజుగా చెప్పవచ్చు. అదే ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో సాధారణంగా స్పీడ్ ఛార్జింగ్ కోసం 4,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. నథింగ్ ఫోన్ (2) డిజైన్‌ను కంపెనీ రివీల్ చేయలేదు. ఫస్ట్-జెన్ నథింగ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ సందర్భంగా అదే డిజైన్‌లోని మార్పులను చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. నథింగ్ ఫోన్ (1) చాలా స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌తో ట్యూన్ చేసిన ఇన్-బిల్ట్ LED లైట్లతో వస్తుంది. కాల్ లేదా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ LED లైట్లు కనిపిస్తాయి. గ్లిఫ్ మాడ్యూల్ డిజైన్‌ను కలిగి ఉండనుంది. నథింగ్ ఇయర్ (2) ఇయర్‌బడ్‌లు, ఇయర్ (1) మాదిరిగానే కనిపిస్తాయి. కెమెరాల విషయానికి వస్తే.. నథింగ్ ఫోన్ (1) వెనుక భాగంలో 4K వీడియోల కోసం రెండు కెమెరాలు ఉన్నాయి. శాంసంగ్, ఆపిల్‌తో పోలిస్తే కంపెనీ ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్ లిమిటెడ్‌గా ఉందని కంపెనీ సీఈఓ తెలిపారు.

Nothing Phone 2 Launch to officially launch in July, company reveals battery details
హై-ఎండ్ చిప్‌తో నథింగ్ ఫోన్ (2) రానుంది. దాంతో ఈ ఫోన ధర గత మోడల్ కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నథింగ్ ఫోన్ (1) భారత మార్కెట్లో రూ. 32,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. నథింగ్ ఫోన్ (2) ధర రూ. 40వేల లోపు ఉంటుందని అంచనా. OnePlus 11R, Pixel 7aతో సహా సెగ్మెంట్‌లోని కొన్ని డివైజ్‌లతో నథింగ్ ఫోన్ పోటీపడనుంది. రెండు 5G ఫోన్‌లు హుడ్ కింద ఫ్లాగ్‌షిప్ చిప్‌ను అందిస్తున్నాయని, OnePlus ఫోన్‌లో అదే Snapdragon 8+ Gen 1 SoC ఉండే అవకాశం ఉంది. నథింగ్ ఫోన్ (2) గురించి మరిన్ని వివరాలు త్వరలో రివీల్ చేసే అవకాశం ఉంది.