అటనామస్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారు చేసిన ఓలా.. దీని స్పెషల్ ఏంటంటే?

పేరుకు తగ్గట్టే ఓలా సోలో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో AI సాంకేతికత ఆధారంగా పలు ఫీచర్లు పొందుపరిచారు.

అటనామస్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారు చేసిన ఓలా.. దీని స్పెషల్ ఏంటంటే?

Ola Solo: ఆటోమొబైల్ రంగంలో డ్రైవర్‌లెస్‌ కారు గురించి ఇటీవల కాలంలో ఎక్కువగా వింటున్నాం. మనిషి అవసరం లేకుండా సోలోగా నడిచే స్కూటర్ గురించి విన్నారా? బెంగుళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ మేకర్ ఓలా.. అటనామస్ స్కూటర్‌ను తయారుచేసింది. ‘ఓలా సోలో’ పేరుతో ఇండియాలో మొట్ట మొదటి అటనామస్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను AI టెక్నాలజీతో లాంచ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన వీడియోను ఓలా సహ వ్యవస్థాపకుడు భవిశ్ అగర్వాల్.. ఎక్స్‌లో షేర్ చేశారు.

“ఓలా సోలో – భారతదేశపు మొట్టమొదటి అటనామస్ ఎలక్ట్రిక్ స్కూటర్. AI టెక్నాలజీతో కూడిన ఫుల్లీ అటనామస్ ట్రాఫిక్ స్మార్ట్ స్కూటర్. మా ఇంజినీరింగ్ బృందం ఊహను నిజం చేసి చూపించింది. ఓలా ఎలక్ట్రిక్‌, ఓలా క్యాబ్స్, కృత్రిమ్ పరస్పర సహకారంతో ఇది సాధ్యమైంద”ని ఎక్స్ పోస్ట్‌లో భవిశ్ అగర్వాల్ పేర్కొన్నారు.

పేరుకు తగ్గట్టే ఓలా సోలో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో AI సాంకేతికత ఆధారంగా పలు ఫీచర్లు పొందుపరిచారు. ఓలా సోలో రైడర్ లేకుండానే సోలోగా వెళ్లిపోగలదు. అంతేకాదు 22 భాషల్లో ఆదేశాలను అర్థం చేసుకోగలదు. ఫేషియల్ రికగ్నిషన్, హెల్మెట్ యాక్టివేషన్ కూడా ఇందులో ఉన్నాయి. చార్జింగ్ అయిపోయే సమయంలో దగ్గరలోని చార్జింగ్ పాయింట్‌ ఎక్కడ ఉంటే అక్కడకు దానికదే వెళ్లిపోతుంది. పార్కింగ్ కూడా దానికదే చేసుకోగలదు. మలుపులు, స్పీడ్ బ్రేకర్లను గుర్తించి దానికి అనుగుణంగా రైడ్ సాగించగలదు.

Also Read: భారత్‌కు సుజుకి వి-స్ట్రోమ్ 800డీఈ బైక్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?