OnePlus 12 Price Drop : విజయ్ సేల్స్‌లో వన్‌ప్లస్ 12పై భారీ డిస్కౌంట్.. రూ. 9వేల వరకు తగ్గింపు.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

OnePlus 12 Price Drop : ఈ వన్‌ప్లస్ ఫోన్ అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కాదు.. విజయ్ సేల్స్‌లో కూడా భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.

OnePlus 12 Price Drop : విజయ్ సేల్స్‌లో వన్‌ప్లస్ 12పై భారీ డిస్కౌంట్.. రూ. 9వేల వరకు తగ్గింపు.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

OnePlus 12 Price drops on Vijay Sales, available with up to Rs 9,000 discount

Updated On : October 1, 2024 / 9:21 PM IST

OnePlus 12 Price Drop : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో 2024 ఏడాదిలో వన్‌ప్లస్ 12 బెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో ఒకటి. ఈ వన్‌ప్లస్ ఫోన్ అత్యంత సరసమైన ధరకే అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కాదు.. విజయ్ సేల్స్‌లో కూడా భారీ తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. వన్‌ప్లస్ 12 రూ. 9వేల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది.

Read Also : iPhone 17 Air Launch : ఐఫోన్ 16 కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫస్ట్ ఐఫోన్ 17 ఎయిర్ ఆఫర్ ఏంటో తెలుసుకోవాల్సిందే..!

ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ డీల్‌ బెస్ట్ అని చెప్పవచ్చు. వన్‌ప్లస్ ఫోన్‌లు సరసమైన ధర వద్ద హై-ఎండ్ పర్ఫార్మెన్స్ అందిస్తాయి. మీరు ఈ వన్‌ప్లస్ ఫోన్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. ఈ డీల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

విజయ్ సేల్స్‌లో వన్‌ప్లస్ 12పై రూ. 9వేలు తగ్గింపు :
ఈ సేల్‌లో వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధర తగ్గింది. వన్‌ప్లస్ 12 ఫోన్ రూ. 62,999 కొత్త ధరతో అందుబాటులో ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 64,999కి లాంచ్ అయింది. కానీ, ప్లాట్‌ఫారమ్ విజయ్ సేల్స్ వెబ్‌సైట్‌లో కొంత ఫెస్టివల్ సేల్‌ను కూడా అందిస్తోంది. ఇది కూడా వన్‌ప్లస్ 12 ధర తగ్గడానికి ఒక కారణంగా చెప్పవచ్చు.

డీల్ విషయానికి వస్తే.. ఈ ధర తగ్గింపు వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ రూ. 2వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుంది. ఎందుకంటే.. వన్‌ప్లస్ ఫోన్ ధర రూ. 64,999 నుంచి రూ. 62,999కి పడిపోయింది. దీనికి అదనంగా, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, వన్‌కార్డ్‌పై రూ. 7వేల అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ వన్‌ప్లస్ ధర రూ.55,999కి తగ్గుతుంది. కేవలం 8 నెలల వ్యవధిలోనే వన్‌ప్లస్ ఫోన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది.

వన్‌ప్లస్ 12 కీలక స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ 12 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌ను కలిగి ఉంది. పవర్‌ఫుల్ హై-ఎండ్ మొబైల్ ప్రాసెసర్. గ్రేట్ స్క్రీన్, గుడ్ బ్యాటరీ లైఫ్‌తో పర్ఫార్మెన్స్-ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్. అత్యుత్తమ సరసమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్ హెచ్‌డీఆర్ 10ప్లస్, డాల్‌బై విజన్, 4,500 నిట్స్ గరిష్ట ప్రకాశం, మరిన్నింటికి సపోర్టుతో 120Hz స్క్రీన్‌ను కలిగి ఉంది.

డిజైన్ కూడా ప్రీమియం, సాఫ్ట్‌వేర్ ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ఫోన్‌లో యూజర్లు అన్ని ప్రాథమిక యుటిలిటీ ఫీచర్‌లతో వస్తుంది. వీటిలో యాప్ లాక్, యాప్‌లను హైడ్ చేయడం వంటి మరిన్ని ఉన్నాయి. వన్‌ప్లస్ 12కి 4 ఏళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 5ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందజేస్తామని కంపెనీ పేర్కొంది.

కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఈ ఫోన్ ధర పరిధిలోని ఇతర ఫోన్‌లతో పోలిస్తే.. అద్భుతమైన డేలైట్ షాట్‌లను తీసుకోవచ్చు. ఇతర ప్రధాన బ్రాండ్‌ల మాదిరిగా కాకుండా, వన్‌ప్లస్ఇప్పటికీ ఫోన్‌లతో ఫాస్ట్ ఛార్జర్‌ను అందిస్తోంది. వన్‌ప్లస్ 12 80డబ్ల్యూ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వన్‌ప్లస్ 12 ఫోన్ ఆన్‌లైన్‌లో ఆకర్షణీయమైన ధరకు విక్రయిస్తోంది.

Read Also : Citroen Aircross SUV : సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ SUV కారు ఇదిగో.. బుకింగ్స్ ఓపెన్, వేరియంట్ల వారీగా ధర ఎంతంటే?