OnePlus: వావ్.. వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్ డిజైన్, ఫీచర్లు ఎంత బాగున్నాయో..
వన్‌ప్లస్ కంపెనీ చైనా అధ్యక్షుడు లూయిస్ లీ తెలిపిన వివరాల ప్రకారం.. వన్‌ప్లస్ 13టీ మూడు కలర్ వేరియంట్‌లలో వస్తోంది.

వన్‌ప్లస్ 13టీ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే విడుదల కానుంది. వన్‌ప్లస్ అధికార వర్గాల నుంచి పలు వివరాలు బయటకు వచ్చాయి. ఆ స్మార్ట్‌ఫోన్ డిజైన్, డిస్ప్లే స్పెక్స్, కలర్ ఆప్షన్‌ల గురించి పలు వివరాలు తెలిశాయి.
వన్‌ప్లస్ కంపెనీ చైనా అధ్యక్షుడు లూయిస్ లీ తెలిపిన వివరాల ప్రకారం.. వన్‌ప్లస్ 13టీ మూడు కలర్ వేరియంట్‌లలో వస్తోంది. అయితే, ఆ మూడు కలర్లు ఏంటన్న విషయాన్ని ఆయన తెలపలేదు. అందులో ఒకటి “చాలా ప్రత్యేకమైన” రంగుతో వస్తోందని చెప్పారు. వీటి ఇమేజ్‌లను అధికారికంగా విడుదల చేయలేదు.
Also Read: మీది పాత సిమ్ కార్డా? కేంద్రం సంచలన నిర్ణయం? కోట్లల్లో పాత సిమ్ కార్డులన్నీ తీసేసి..
ఇప్పటికే ఆ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన టీజర్లు విడుదలయ్యాయి. వన్‌ప్లస్ 13టీ ఇప్పటికే లాంచ్ అయిన వన్‌ప్లస్ 13తో పోల్చితే చిన్న స్క్రీన్‌తో వస్తోంది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 6.82 అంగుళాల ప్యానెల్ ఉంటుంది. వన్‌ప్లస్ 13టీ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేటుతో 6.3-అంగుళాల OLED డిస్ప్లేతో లాంచ్ కానుంది. ఈ ఫోన్‌లో స్క్రీన్ చుట్టూ స్లిమ్ బెజెల్స్ ఉంటాయని తెలిసింది.
ఈ వన్‌ప్లస్ 13టీ డిజైన్ రూపకల్పనలో మార్పులు ఉన్నట్లు కనిపిస్తోంది. అలెర్ట్ స్లైడర్‌కు బదులుగా వన్‌ప్లస్ 13టీ ఎడమ వైపున కొత్త షార్ట్‌కట్ కీ ఉంటుంది. హార్డ్‌వేర్ పరంగా.. వన్‌ప్లస్ 13టీ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎలైట్ ప్రాసెసర్‌తో లాంచ్ కానుంది. ఈ ఫోన్ 16GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్లో రావచ్చు.
వన్‌ప్లస్ 13టీ ఫోన్ బ్యాక్‌సైడ్‌లో రెండు 50 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉంటాయి. వాటిలో ఒకటి టెలిఫోటో కెమెరా కావచ్చు. బ్యాటరీ సామర్థ్యం సుమారు 6,200 ఎంఏహెచ్ గా ఉంటుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు బ్యాకప్ తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్‌కాగానే భారత్‌లోనే లాంచ్ కావచ్చు.