వన్‌ప్లస్ నుంచి ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ ఈ నెలలోనే లాంచ్.. గెట్ రెడీ
లాంచ్ కాకపోయినప్పటికీ ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్ల గురించి లీకుల ద్వారా తెలిసింది.

వన్‌ప్లస్ 13టీ స్మార్ట్‌ఫోన్ ఈ నెలలోనే లాంచ్ అవుతుందని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. లాంచ్ కాకపోయినప్పటికీ ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్ల గురించి లీకుల ద్వారా తెలిసింది. వన్‌ప్లస్ 13టీ స్మార్ట్‌ఫోన్‌ను మొదట చైనాలో లాంచ్ చేయనున్నారు.
ఇతర దేశాల్లో ఎప్పుడు లాంచ్ చేస్తారన్న వివరాలు తెలియరాలేదు. ఇతర దేశాల్లోనూ దీన్ని విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించుకుంటే మే లేదా జూన్ నాటికి వన్‌ప్లస్ 13టీ భారత్ మార్కెట్లో అందుబాటులోకి రావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ఫీచర్లు ఎలా ఉండొచ్చు?
వన్‌ప్లస్ 13టీ 1.5కే రిజల్యూషన్, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటుతో 6.3-అంగుళాల ఫ్లాట్ OLED డిస్ప్లేతో రావచ్చు. ఇందులో ఓ యాక్షన్ బటన్ కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన డిజైన్‌లో ఇదీ ఒకటి. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో రానుంది. ఐఫోన్ 16 వంటి డిజైన్ ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
కెమెరా ఫ్రంట్‌లో 50 ఎంపీ మెయిన్ సెన్సార్‌ను ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో తీసుకురావచ్చు. 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్ ఉంటుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో బ్యాటరీ సామర్థ్యం 6,000 ఎంఏహెచ్‌తో ఇది వస్తుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆక్సిజెనోస్ 15తో రన్ అవుతుంది.
రియల్‌మీ జీటీ 7 ప్రో ఆర్చింగ్ ఎడిషన్ కంటే వన్‌ప్లస్ 13టీ ధర తక్కువగా ఉండవచ్చు. ప్రస్తుతం సుమారు రూ.36,615గా దాని ధర ఉంది. వీటి గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటనలు రాలేదు. అయితే, విశ్లేషకులు అంచనాలు తెలిపారు.