OnePlus Watch 2 Launch Date : కొత్త స్మార్ట్‌వాచ్ కావాలా? ఈ నెల 26న వన్‌ప్లస్ వాచ్ 2 సిరీస్ వచ్చేస్తోంది.. కేవలం రూ.99కే బుకింగ్ ఆఫర్

OnePlus Watch 2 Launch Date : ఆసక్తి గల కొనుగోలుదారులు రూ. 99తో వన్‌ప్లస్ వాచ్‌ 2ని బుక్ చేసుకోవచ్చు. ఏకంగా రూ. 1,000 తగ్గింపు, ఫ్రీ బుల్లెట్ వైర్‌లెస్ Z2 ఇయర్‌బడ్‌లను కూడా పొందవచ్చు.

OnePlus Watch 2 Launch Date : కొత్త స్మార్ట్‌వాచ్ కావాలా? ఈ నెల 26న వన్‌ప్లస్ వాచ్ 2 సిరీస్ వచ్చేస్తోంది.. కేవలం రూ.99కే బుకింగ్ ఆఫర్

OnePlus confirms OnePlus Watch 2 launch date

OnePlus Watch 2 Launch Date : కొత్త స్మార్ట్ వాచ్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మరికొద్ది రోజులు ఆగండి. వన్‌ప్లస్ 2 వాచ్ అతి త్వరలో లాంచ్ కానుంది. ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ టెలికాం పరిశ్రమ అతిపెద్ద వార్షిక సమావేశమైన బార్సిలోనాలోని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌ ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానుంది.

Read Also : OnePlus 12R First Sale : భారత్‌‌లో వన్‌ప్లస్ అభిమానుల కోసం ఫస్ట్ సేల్.. ఈ కొత్త ఫోన్‌పై మరెన్నో ఆఫర్లు.. డోంట్ మిస్!

ఈ సందర్భంగా వన్‌ప్లస్ వాచ్ 2ను లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ధృవీకరించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు వన్‌ప్లస్ 2 వాచ్‌ను కేవలం రూ. 99కే బుక్ చేసుకోవచ్చు. వన్‌ప్లస్ వాచ్ 2పై రూ. 1,000 డిస్కౌంట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC)తో ఉచిత బుల్లెట్ వైర్‌లెస్ Z2 ఇయర్‌బడ్‌లను కూడా పొందవచ్చని కంపెనీ తెలిపింది.

మార్చి 31 వరకు ఆఫర్.. ఫస్ట్ కస్టమర్లకు మాత్రమే :
మీరు పాస్‌ను వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్ నుంచి (పాస్ లింక్ ) కొనుగోలు చేయవచ్చు . ప్రారంభ రిజర్వేషన్‌లు 1,500 యూనిట్లకు పరిమితం చేసింది. ముందుగా వచ్చిన వారికి మొదటి సర్వీసు ఆధారంగా అందుబాటులో ఉంటాయి. ఫ్రీ ఇయర్‌బడ్స్ కూపన్ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది.

రెండు కలర్ ఆప్షన్లలో :
వన్‌ప్లస్ వాచ్ 2 మొత్తం రేడియంట్ స్టీల్, బ్లాక్ స్టీల్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ రెండు వేరియంట్‌లు సిలికాన్ వాచ్ బెల్ట్‌లతో స్టెయిన్‌లెస్ స్టీల్ కేసులను కలిగి ఉంటాయి. వన్‌ప్లస్ వాచ్ 2 సప్పైర్ క్రిస్టల్‌తో 1.43-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. అయితే, ఈ స్మార్ట్ వాచ్ 2 మోడల్ క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ డబ్ల్యూ5 జనరేషన్ 1 చిప్‌సెట్‌లో రన్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు.. గూగుల్ (Google WearOS 4) ప్లాట్‌ఫారమ్‌ను ఇందులో ఉపయోగిస్తుంది.

100 గంటల బ్యాటరీ లైఫ్ :
వన్‌ప్లస్ ప్రకారం.. ఈ స్మార్ట్ మోడ్‌లో వాచ్ 2 బ్యాటరీ లైఫ్ 100 గంటల వరకు ఉంటుంది. స్మార్ట్ మోడ్‌లో గరిష్టంగా 100-గంటల బ్యాటరీ లైఫ్‌తో రానుంది. వన్‌ప్లస్ వాచ్ మీ జీవితానికి అంతరాయం లేకుండా ఉండేలా చేస్తుందని వన్‌ప్లస్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వన్ ప్లస్ వాచ్ 2 సిరీస్ కెమెరా డెకోను రీసౌండ్ రౌండ్ వాచ్ ఫేస్‌ను కలిగి ఉంది. వన్‌ప్లస్ 12 సిరీస్‌కు సరైన ఆప్షన్ అని కంపెనీ తెలిపింది. కాగా, మొబైల్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఫిబ్రవరి 29తో ముగియనుంది.

Read Also : OnePlus Nord CE 3 Lite 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ వన్‌ప్లస్ 5జీ ఫోన్‌పై ఫ్లాట్ డిస్కౌంట్.. ధర ఎంత తగ్గిందంటే?