OnePlus Nord CE 4 Lite 5G : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌లో ధర, స్పెషిఫికేషన్లు ఉండొచ్చుంటే?
OnePlus Nord CE 4 Lite 5G : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో సపోర్ట్ చేసే 5,500mAh బ్యాటరీని అందించనుంది. ఈ ఫోన్ వన్‌ప్లస్ 12ఆర్ మాదిరిగానే ఆక్వా టచ్ టెక్నాలజీని కలిగిన 120Hz అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

OnePlus Nord CE 4 Lite 5G launching tomorrow ( Image Source : Google )
OnePlus Nord CE 4 Lite 5G : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి జూన్ 24న అంటే.. భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ పవర్ అందించే పాత చిప్ అప్‌గ్రేడ్ అవుతుందని లీక్‌లు సూచిస్తున్నాయి.
కంపెనీ ముందున్న వెర్షన్‌తో పోల్చితే.. కొత్త వెర్షన్‌తో మెరుగైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. లాంచ్ ఈవెంట్‌కు ముందు వన్‌ప్లస్ కొన్ని ఫీచర్లను కూడా ధృవీకరించింది. అన్ని కోణాల నుంచి డిజైన్‌ను కూడా వెల్లడించింది. రాబోయే 5జీ ఫోన్ కొన్ని అధికారిక వివరాలు ఇలా ఉన్నాయి. కంపెనీ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈవెంట్‌ను ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్.. స్పెషిఫికేషన్లు, భారత్ ధర (అంచనా) :
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో సపోర్ట్ చేసే 5,500mAh బ్యాటరీని అందించనుంది. ఈ ఫోన్ వన్‌ప్లస్ 12ఆర్ మాదిరిగానే ఆక్వా టచ్ టెక్నాలజీని కలిగి ఉన్న 120Hz అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. తడి చేతులతో కూడా ఆపరేట్ చేయొచ్చు. ఈ ప్యానెల్ 2,100నిట్‌ల గరిష్ట ప్రకాశంతో వస్తుంది.
హుడ్ కింద వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ కలిగి ఉందని పుకారు ఉంది. రూ. 20వేల లోపు ధరలో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లచే విస్తృతంగా ఉపయోగించే చిప్‌సెట్. ఈ ఫోన్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌తో పనిచేసే 6.67-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఇతర సెన్సార్‌లతో పాటు 50ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఫ్రంట్ సైడ్ 16ఎంపీ కెమెరాను కలిగి ఉండే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ డిజైన్ మార్పులు కలిగి ఉంది. ఈ ఫోన్ చిన్న సెన్సార్‌లతో పిల్ ఆకారపు కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుందని అధికారిక ఫొటోలు చూపించాయి. పెద్ద డిస్‌ప్లేతో బాక్సీ డిజైన్‌తో రానుంది. ధర పరంగా చూస్తే.. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ దాదాపు రూ. 20వేల లోపు ఉంటుంది. ఎందుకంటే.. కంపెనీ ఇప్పటికే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 24,999కి విక్రయిస్తోంది. కొత్త వన్‌ప్లస్ ఫోన్, అమెజాన్, వన్‌ప్లస్ ఇండియా సైట్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
Read Also : Vivo X200 Pro Launch : సెక్యూరిటీ ఫీచర్లతో వివో X200 ప్రో ఫ్లాగ్‌షిప్ ఫోన్ వస్తోంది.. ధర ఎంత ఉండొచ్చుంటే?