మిడ్‌రేంజ్‌ ధరలో ఖతర్నాక్‌ స్మార్ట్‌ఫోన్‌ కావాలా? కాస్త ఆగండి.. మతిపోగొట్టే ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చేస్తోంది..

వన్‌ప్లస్‌ లైనప్‌లో ఇలాంటి డిస్‌ప్లేతో వచ్చే మొట్టమొదటి ఫోన్‌ ఇది. మొదట దీన్ని చైనాలో విడుదల చేస్తారు. వన్‌ప్లస్‌ ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌ వివరాలను వెల్లడించలేదు.

మిడ్‌రేంజ్‌ ధరలో ఖతర్నాక్‌ స్మార్ట్‌ఫోన్‌ కావాలా? కాస్త ఆగండి.. మతిపోగొట్టే ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చేస్తోంది..

OnePlus

Updated On : August 12, 2025 / 2:44 PM IST

మిడ్‌రేంజ్‌ ధరలో స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసేందుకు వన్‌ప్లస్‌ సన్నాహాలు చేస్తోంది. తాజా లీక్‌ ప్రకారం.. 1.5కే రిజల్యూషన్‌, 165హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఉన్న ఫ్లాట్‌ డిస్‌ప్లే ఉండే డివైస్‌ను ప్రస్తుతం పరీక్షిస్తోంది. వన్‌ప్లస్‌ లైనప్‌లో ఇలాంటి డిస్‌ప్లేతో వచ్చే మొట్టమొదటి ఫోన్‌ ఇది. మొదట దీన్ని చైనాలో విడుదల చేస్తారు. వన్‌ప్లస్‌ ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌ వివరాలను వెల్లడించలేదు. రూమర్ల ప్రకారం ఇది రానున్న వన్‌ప్లస్‌ ఏస్‌ 6 సిరీస్‌ లేదా ఏస్‌ రేసింగ్‌ ఎడిషన్‌ సిరీస్‌లో భాగం కావొచ్చు. వన్‌ప్లస్‌ ఏస్‌ 5 ప్రో, వన్‌ప్లస్‌ ఏస్‌ 5 గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో విడుదలయ్యాయి.

వన్‌ప్లస్‌ మిడ్‌రేంజ్‌ ఫోన్‌లో 165హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ స్క్రీన్‌
వీబోలో టిప్‌స్టర్‌ డిజిటల్‌ చాట్‌ స్టేషన్‌ తెలిపిన ప్రకారం.. 1.5కే రిజల్యూషన్‌, 165హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఉన్న ఫ్లాట్‌ డిస్‌ప్లేతో కొత్త హ్యాండ్‌సెట్‌ను వన్‌ప్లస్‌ పరీక్షిస్తోంది. కొత్త ఫోన్‌లో మెరుగైన టచ్‌ రెస్పాన్స్‌ కోసం అప్‌గ్రేడ్‌ చేసిన ఐసీ చిప్‌ (IC Chip – ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్‌ చిప్‌) ఉంటుంది. అయితే ఈ అప్‌గ్రేడ్‌ ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌లో వచ్చే అవకాశాలు తక్కువ.

Also Read: భారత మార్కెట్‌లో వివో V60 5G విడుదలైంది.. అబ్బబ్బ ఏముంది భయ్యా.. కెవ్వుకేక

టిప్‌స్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త 165హెర్జ్‌ డిస్‌ప్లేను ముందుగా మిడ్‌రేంజ్‌ స్మార్ట్‌ఫోన్లలోనే ట్రయల్‌ చేస్తారు. సాధారణంగా ఎక్కువ రిఫ్రెష్‌ రేట్లు ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లకే పరిమితం అవుతాయి. ఈసారి మధ్యస్థాయి లైనప్‌ను రియల్‌ వరల్డ్‌ పనితీరు, యూజర్‌ ఫీడ్‌బ్యాక్‌ అంచనా వేసే పరీక్షా వేదికగా వన్‌ప్లస్‌ ఉపయోగించవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌ నిజంగా మధ్యస్థాయి మోడల్‌ అయితే రానున్న వన్‌ప్లస్‌ ఏస్‌ 6 సిరీస్‌లో భాగం కావొచ్చు. ఏస్‌ 6 సిరీస్‌లో 1.5కే రిజల్యూషన్‌, 165హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 8 సిరీస్‌ చిప్‌సెట్లు, 7,000ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండొచ్చు. దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌ ఉండే అవకాశం ఉంది.

వన్‌ప్లస్‌ ఏస్‌ 5 ప్రో, ఏస్‌ 5లు 2024 డిసెంబర్‌లో చైనాలో విడుదలయ్యాయి. వీటిలో 6.78 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 120హెర్జ్‌ అడాప్టివ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఉంది. 16జీబీ ర్యామ్‌, 1టిబీ స్టోరేజ్‌ వరకు ఆప్షన్లు ఉన్నాయి. ప్రో మోడల్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఎడిషన్‌ SoCపై, ఏస్‌ 5 స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 చిప్‌సెట్‌పై పనిచేస్తాయి. 50మెగాపిక్సెల్‌ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ ఉన్నాయి.