Online Scam Alert : సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త.. ఈ 6 మార్గాల్లోనే సైబర్ మోసాలు ఎక్కువ.. రెప్పపాటులో మీ డబ్బులు మాయం చేస్తారు..!

Online Scam Alert : OTP స్కామ్, UPI మనీ రిక్వెస్ట్ స్కామ్స్, బ్యాంక్ అకౌంట్ డీయాక్టివేషన్ స్కామ్‌లతో సహా సాధారణ ఆన్‌లైన్ స్కామ్‌లపై భారత ప్రభుత్వ ప్రాథమిక సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వినియోగదారులను హెచ్చరిస్తోంది.

Online Scam Alert : సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త.. ఈ 6 మార్గాల్లోనే సైబర్ మోసాలు ఎక్కువ.. రెప్పపాటులో మీ డబ్బులు మాయం చేస్తారు..!

Online Scam Alert _ 6 common ways in which cyber frauds are stealing your money

Updated On : October 20, 2023 / 5:28 PM IST

Online Scam Alert : భారత ప్రభుత్వ నోడల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CERT-In) సైబర్ మోసం, సైబర్ క్రైమ్ నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలనే దానిపై అవగాహన పెంచడానికి, ఇంటర్నెట్ వినియోగదారులకు అవగాహన కల్పించడానికి అక్టోబర్ 2023లో సైబర్ జాగృక్త దివస్ (cyber awareness day 2023)ని పాటిస్తోంది. ఈ ఏడాదిలో క్యాంపెయిన్ ముఖ్యంగా ఫేక్ ఆన్‌లైన్ స్కామ్‌ల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వాటిని ఎలా నివారించాలి అనే దానిపై దృష్టి సారించింది.

ఎందుకంటే.. ఇటీవలి సంవత్సరాలలో భారత్‌లో ఆన్‌లైన్ స్కామ్‌లు గణనీయంగా పెరిగాయి. ఆన్‌లైన్ హాకర్లు డబ్బు కోసం ప్రజలను మోసగించడానికి ఉపయోగిస్తున్న అనేక పాపులర్ స్కామ్‌లపై ప్రభుత్వ సంస్థ ప్రజలను హెచ్చరిస్తోంది. ఈ స్కామ్‌లలో కొన్ని ఆధార్ లేదా పాన్ అప్‌డేట్ స్కామ్, OTP స్కామ్, బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్‌డేట్ చేయడం, విద్యుత్ బిల్లు స్కామ్ వంటివి ఉన్నాయి.

OTP స్కామ్స్ (OTP Scams) :
వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) స్కామ్స్ భారీగా పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్లు వినియోగదారులను మోసగించి వారి OTPని తస్కరిస్తున్నారు. టూ-ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ కోసం మోసగాళ్లు అధీకృత పార్టీల మాదిరిగా నటిస్తూ, మాల్వేర్ లింక్‌లను పంపడం, ధృవీకరణ ఫారమ్‌లను ఉపయోగించడం, బ్యాంకుల బాధితులుగా నమ్మించడం లేదా ఫేక్ సిమ్ కార్డ్‌లను పొందడానికి మొబైల్ ఆపరేటర్‌లను సంప్రదించడం వంటి వివిధ మార్గాల్లో OTPలను దొంగిలించవచ్చు. OTP స్కామ్‌లో ఆర్థిక నష్టాలు, భద్రతా ఉల్లంఘనలకు దారితీస్తుంది.

Read Also : Electricity Bill Scam : కరెంట్ బిల్లు కట్టలేదా? మీకు ఇలా మెసేజ్ వచ్చిందా? లింక్ క్లిక్ చేయగానే రూ.1.85 లక్షలు మాయం..!

యూపీఐ మనీ రిక్వెస్ట్ స్కామ్ (UPI money request fraud) :
యూపీఐ మనీ రిక్వెస్ట్ స్కామ్ అనేది రకమైన ఆన్‌లైన్ స్కామ్. హ్యాకర్లు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా డబ్బు పంపేలా ప్రజలను మోసం చేస్తారు. ఈ స్కామర్‌లు ఫేక్ డబ్బు రిక్వెస్ట్‌న్లను పంపడం, రియల్ కంపెనీలుగా నమ్మించడం, యూపీఐ యాప్‌ల భద్రతలో బలహీనతలను కనుగొనడం వంటి ట్రిక్‌లను ఉపయోగిస్తారు. యూపీఐ డబ్బు అభ్యర్థన మోసానికి గురైతే.. డబ్బు కోల్పోవడం, మీ ఐడెంటిటీని దొంగిలించబడడం, భద్రతా సమస్యలను ఎదుర్కోవడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు.

Online Scam Alert _ 6 common ways in which cyber frauds are stealing your money

Online Scam Alert : 6 common ways cyber frauds 

బ్యాంక్ అకౌంట్ డీయాక్టివేట్ స్కామ్ (Bank account deactivated) :
బ్యాంక్ అకౌంట్ డీయాక్టివేషన్ స్కామ్ అనేది ఫిషింగ్ స్కీమ్ (phishing scheme), ఇక్కడ స్కామర్‌లు తమ బ్యాంక్ అకౌంట్ ఇన్‌యాక్టివ్ అయిందని లేదా అనుమానాస్పద యాక్టివిటీ కలిగి ఉందని తప్పుగా క్లెయిమ్ చేయడం ద్వారా వినియోగదారుల ఆర్థిక వివరాలను పొందడానికి ప్రయత్నిస్తారు. సాధారణంగా, ఆటోమాటిక్ కాల్‌లు లేదా టెక్స్ట్ మెసేజ్‌లు పంపుతుంటారు. మీ ఐడెంటిటీని ధృవీకరించడానికి, మీ అకౌంట్ మళ్లీ యాక్టివ్ చేయడానికి నంబర్‌కు కాల్ చేయమని లేదా లింక్‌ను క్లిక్ చేయమని ప్రోత్సహిస్తారు.

ఎవరైనా సూచనలను పాటిస్తే.. తమ బ్యాంక్ అధికారిక ఛానెల్‌లు మాదిరి ఫేక్ వెబ్‌సైట్ లేదా కాల్ సెంటర్‌ను విజిట్ చేయమని లింక్ పంపుతారు. ఈ సైబర్ మోసగాళ్ళు సున్నితమైన సమాచారాన్ని అభ్యర్థిస్తారు. ఈ డేటాను సరెండర్ చేయడం వల్ల బ్యాంక్ అకౌంట్ నుంచి దొంగతనం, మోసపూరిత క్రెడిట్ అకౌంట్లు, ఇతర హానికరమైన కార్యకలాపాలకు దారి తీయవచ్చు. అప్రమత్తంగా ఉండటం, ఇలాంటి మోసాలకు గురికాకుండా ఉండటం చాలా ముఖ్యమని గమనించాలి.

KYC వివరాలను అప్‌డేట్ చేయండి (Update KYC details) :
కేవైసీ స్కామ్ అంటే.. స్కామర్‌లు బ్యాంక్ అధికారుల మాదిరిగా నమ్మించడం అకౌంట్ డీయాక్టివేషన్‌కు సంబంధించి ఊహించిన KYC అప్‌డేట్‌లకు వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయమని కస్టమర్‌లను అభ్యర్థిస్తుంటారు. KYC స్కామర్లు అయాచిత KYC వెరిఫికేషన్ కాల్‌లు, ఫిషింగ్, స్మిషింగ్, ఐడెంటిటీ తస్కరణ, PAN/ఆధార్ కార్డ్-సంబంధిత స్కామ్‌లతో సహా అనేక రకాల వ్యూహాలను ఉపయోగిస్తారు.

ఫ్రీ ఐఫోన్ స్కామ్ ( Free iPhone Fraud) :
వినియోగదారులను ఆకర్షించేందుకు ఫ్రీ ఐఫోన్ స్కామ్ అనేది ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినట్టుగా ఫేక్ మెసేజ్ ఉంటుంది, రిసీవర్ ఫెస్టివల్ గిఫ్ట్‌గా ఐఫోన్ 15ని గెలుచుకున్నట్లు ఉంటుంది. ఈ మెసేజ్ వాటిని మల్టీ వాట్సాప్ గ్రూపులు లేదా స్నేహితులతో షేర్ చేయమని నిర్దేశిస్తుంది. ఫలితంగా గిఫ్ట్ క్లెయిమ్ చేయమని లింక్‌ను అందిస్తుంది. ఇటీవల, ఇండియా పోస్ట్ (India Post) కూడా ఈ మెసేజ్ స్కామ్‌గా హెచ్చరికను జారీ చేసింది. అటువంటి మెసేజ్‌లను ఫార్వార్డ్ చేయడం, అనధికార లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోవాలని వినియోగదారులకు సూచించింది. ఆధార్ లేదా పాన్ కార్డ్‌లకు సంబంధించిన అప్‌డేట్‌లు లేదా స్కామ్ వెబ్‌సైట్‌లకు దారితీసే మోసపూరిత బ్యాంక్ మెసేజ్‌లు వంటి వివిధ ప్రయోజనాల కోసం లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా యూజర్లను మోసగించేందుకు స్కామర్‌లు ప్రభుత్వ సంబంధిత థీమ్‌లను ఉపయోగించుకోవచ్చు.

Online Scam Alert _ 6 common ways in which cyber frauds are stealing your money

Online Scam Alert

ఎలక్ట్రిసిటీ పేమెంట్ డిఫాల్టర్ (Electricity Payment Defaulter) :
కరెంటు బిల్లు స్కామ్‌లలో స్కామర్‌లు తమ కరెంటు బిల్లు చెల్లించలేదని, తక్షణమే చెల్లించకపోతే విద్యుత్తు డిస్‌కనెక్ట్ అవుతుందని ఫేక్ మెసేజ్‌లను పంపడం జరుగుతుంది. స్కామర్లు కూడా ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారుల మాదిరిగా నమ్మిస్తారు. గ్రహీతలు తమ గడువు ముగిసిన బిల్లును వెంటనే చెల్లించకుంటే అదే రోజు వారి ఇంటి విద్యుత్‌ను డిస్‌కనెక్ట్ చేస్తామని హెచ్చరిస్తారు. ఈ మోసపూరిత స్కీమ్ డబ్బును దొంగిలించడానికి, భయాందోళనలను సృష్టించేలా ఉంటుంది. రిసీవర్ మెసేజ్‌లోని లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే లేదా మెసేజ్‌ను నమ్మితే.. స్కామర్‌లు వారి బ్యాంక్ నుంచి డబ్బును దొంగిలించవచ్చు.

ఎలా సేఫ్‌గా ఉండాలంటే? (How to Stay Safe) :
పంపినవారు లేదా వెబ్‌సైట్ చట్టబద్ధతను ఎల్లప్పుడూ ధృవీకరించండి. ఫోన్ నంబర్, ఇమెయిల్ అడ్రస్, డొమైన్ పేర్లు, పంపినవారి గుర్తింపును ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. ప్రత్యేకించి మీరు అనుమానిత మెసేజ్‌లను స్వీకరిస్తే.. అయాచిత ఇమెయిల్‌లు, మెసేజ్‌లు లేదా ఫోన్ కాల్‌లతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారం కోసం అడిగేవిలా ఉంటాయి. అధికారిక సంస్థలు ఎప్పుడూ కాల్‌ల ద్వారా లేదా లింక్ ద్వారా సున్నితమైన వివరాలను అడగవు.

సోషల్ సెక్యూరిటీ నంబర్‌లు, క్రెడిట్ కార్డ్ వివరాలు లేదా పాస్‌వర్డ్‌ల వంటి సున్నితమైన సమాచారాన్ని ఇమెయిల్ లేదా టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా షేర్ చేయడం మానుకోండి. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌లు, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌తో మీ కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్, ఇతర డివైజ్‌లకు అప్‌డేట్ చేసుకోండి. ఈ కొత్త స్కామ్‌ల గురించి తెలుసుకోవడానికి లేటెస్ట్ సైబర్‌ సెక్యూరిటీ న్యూస్, ట్రెండ్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.

Read Also : iPhone 15 Gift Scam : ఇలా చేశారంటే.. రూ. 79వేల విలువైన కొత్త ఐఫోన్ 15 గిఫ్ట్‌గా పొందవచ్చు.. టెంప్ట్ అయ్యారంటే.. అంతే..!